Meta mass layoffs: మెటాలో మాస్ లే ఆఫ్స్; 3600 మంది ఉద్యోగులను తొలగించనున్న టెక్ దిగ్గజం
Meta mass layoffs: టెక్ దిగ్గజం, ఫేస్ బుక్, వాట్సాప్ తదితర కంపెనీల యాజమాన్య సంస్థ మెటా.. మరోసారి ఉద్యోగుల తొలగింపునకు తెరతీసింది. అమెరికా సహా చాలా దేశాల్లో పూర్ పర్ఫార్మెన్స్ చూపిన ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. సోమవారం ఉదయం 5 గంటల నుంచి ఈ ఉద్యోగులకు నోటీసులు ఇవ్వనున్నారు.

Meta mass layoffs: మార్క్ జుకర్ బర్గ్ నేతృత్వంలోని మెటా మరోసారి మాస్ లే ఆఫ్స్ చేపట్టనుంది. వచ్చే వారం నుంచి సరైన పని తీరు చూపని ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ప్రారంభించనుంది. సోమవారం ఉదయం నుంచి ఆయా ఉద్యోగులకు లేఆఫ్ నోటీసులను పంపించనుంది.
మొత్తం 3600 మంది ఉద్యోగులు..
టెక్నాలజీ దిగ్గజం మెటా తన సంస్థలోని మొత్తం 3,600 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అమెరికా సహా చాలా దేశాల్లో స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 5 గంటల నుంచి ఉద్యోగాలు కోల్పోయే ఉద్యోగులకు ఈ నోటీసులు వెళ్లనున్నాయి. మరోవైపు, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ల నియామకాన్ని వేగవంతం చేయనున్నట్లు మెటా అంతర్గత మెమోలో సిబ్బందికి తెలిపింది.
వీరికి మినహాయింపు..
జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్ దేశాల్లోని ఉద్యోగులకు స్థానిక నిబంధనల కారణంగా ఈ లే ఆఫ్ ల నుంచి మినహాయింపు ఉంటుందని మెటా తెలిపింది. యూరప్, ఆసియా, ఆఫ్రికా దేశాల్లోని డజనుకు పైగా దేశాల్లోని ఉద్యోగులకు ఫిబ్రవరి 11 నుంచి 18 వరకు వారి ఉద్యోగాల తొలగింపునకు సంబంధించి నోటీసులు వస్తాయని తెలిపింది. ఇప్పటికే, అంతర్గత పరీక్షల్లో విఫలమైనందుకు ఇన్ఫోసిస్ 300 మందిని తొలగించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
5 శాతం ఉద్యోగులకు కోత..
అతి తక్కువ పర్ఫార్మెన్స్ కనబరిచిన 5% మందిని తొలగించనున్నట్లు మెటా గత నెలలో ప్రకటించింది. వాటిలో కొన్ని స్థానాలను మళ్లీ భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. మునుపటి కంపెనీ వ్యాప్త తొలగింపులకు భిన్నంగా, మెటా సోమవారం తన కార్యాలయాలను తెరిచి ఉంచాలని యోచిస్తోంది. అలాగే, కంపెనీ తీసుకునే నిర్ణయాలపై మరిన్ని వివరాలను అందించే ఎటువంటి అప్ డేట్స్ ను జారీ చేయదని మెటా పీపుల్ హెడ్ జానెల్ గేల్ చెప్పారు. మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్లు, ఇతర "బిజినెస్ క్రిటికల్" ఇంజనీరింగ్ పాత్రల కోసం నియామక ప్రక్రియ ఫిబ్రవరి 11 నుంచి మార్చి 13 మధ్య జరుగుతుందని మెటా తెలిపింది.