Medi Assist IPO: ఇష్యూ ఓపెన్ కాకముందే భారీ జీఎంపీ; జనవరి 15న మెడి అసిస్ట్ ఐపీఓ ప్రారంభం
Medi Assist Healthcare Services IPO: మెడి అసిస్ట్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఐపీఓ జనవరి 15వ తేదీన ఓపెన్ కానుంది. ఈ ఐపీఓ కు గ్రే మార్కెట్లో మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

Medi Assist Healthcare Services IPO: మెడి అసిస్ట్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఐపీఓకు జనవరి 15 నుంచి జనవరి 17 వరకు సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు. ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ను రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.397 నుంచి రూ.418 మధ్య నిర్ణయించారు. ఈ మెడి అసిస్ట్ ఐపీఓ కోసం యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయింపులు జనవరి 12న జరగనున్నాయి.
35 షేర్లు..
మెడి అసిస్ట్ ఐపీఓ (Medi Assist Healthcare Services IPO) కు లాట్స్ లో అప్లై చేసుకోవాలి. ఒక్కో లాట్ లో రూ. 5 ముఖవిలువ కలిగిన 35 ఈక్విటీ షేర్లు ఉంటాయి. రిటైల్ ఇన్వెస్టర్లు 13 లాట్స్ వరకు బిడ్డింగ్ చేయవచ్చు. మెడి అసిస్ట్ ఐపీఓ పబ్లిక్ ఇష్యూలో 50 శాతం వాటాలను క్వాలిఫైడ్ ఇన్ స్టిట్యూషనల్ బయ్యర్స్ (క్యూఐబీ)కు, 15 శాతానికి తగ్గకుండా నాన్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (ఎన్ ఐఐ) కేటాయించింది. ఈ ఐపీఓ షేర్ల కేటాయింపు జనవరి 18న ఖరారు అవుతుంది. జనవరి 19న అర్హులైన ఇన్వెస్టర్ల డీమ్యాట్ ఖాతాల్లోకి షేర్లు జమ అవుతాయి. అలాగే, మెడి అసిస్ట్ హెల్త్ కేర్ సర్వీసెస్ షేర్లు జనవరి 22 న స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతాయి.
మెడి అసిస్ట్ హెల్త్ కేర్ సర్వీసెస్
తన అనుబంధ సంస్థలైన మెడ్వాంటేజ్ టీపీఏ, రక్షా టీపీఏ, మెడి అసిస్ట్ టీపీఏ ద్వారా బీమా కంపెనీలకు థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేషన్ సేవలను మెడి అసిస్ట్ హెల్త్ కేర్ సర్వీసెస్ (Medi Assist Healthcare Services IPO) అందిస్తోంది. అలాగే, తన అనుబంధ సంస్థలైన ఐహెచ్ ఎంఎస్, మేఫేర్ ఇండియా, మేఫేర్ యూకే, మేఫేర్ గ్రూప్ హోల్డింగ్, మేఫేర్ ఫిలిప్పీన్స్, మేఫేర్ సింగపూర్ ల సహాయంతో, ఆసుపత్రిలో చేరడం, కాల్ సెంటర్, కస్టమర్ రిలేషన్స్, కాంట్రాక్ట్ మేనేజ్ మెంట్, బిల్లింగ్ అండ్ క్లెయిమ్ ప్రాసెసింగ్ సేవల వంటి అదనపు ఆరోగ్య సంరక్షణ, అనుబంధ సేవలను కూడా అందిస్తుంది. ఈ సంస్థ 141 దేశాల్లో తన సేవలను అందిస్తోంది. భారత్ లో 31 రాష్ట్రాల్లో (కేంద్రపాలిత ప్రాంతాలతో సహా) ఈ సంస్థకు నెట్ వర్క్ ఉంది.
ఆఫర్ ఫర్ సేల్
డాక్టర్ విక్రమ్ జిత్ సింగ్ ఛత్వాల్ (2,539,092 ఈక్విటీ షేర్లు), మెడిమేటర్ హెల్త్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (12,468,592 ఈక్విటీ షేర్లు), బెస్సెమర్ హెల్త్ క్యాపిటల్ ఎల్ఎల్సీ (6,606,084 వరకు), ఇన్వెస్ట్కార్ప్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ 1 (6,275,706 వరకు) ఈ ఆఫర్ ఫర్ సేల్ లో ప్రధాన విక్రయ వాటాదారులుగా ఉన్నారు. ఈ ఐపీఓకు యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ లిమిటెడ్, నువామా వెల్త్ మేనేజ్మెంట్ లిమిటెడ్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ మెడి అసిస్ట్ హెల్త్కేర్ ఐపీఓ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నారు. దీనికి రిజిస్ట్రార్ లింక్ ఇన్ టైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.
అసిస్ట్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఐపీఓ జీఎంపీ
మెడి అసిస్ట్ ఐపీఓకు గ్రే మార్కెట్లో మంచి స్పందన కనిపిస్తోంది. ప్రస్తుతం గ్రే మార్కెట్లో ఈ కంపెనీ షేర్లు రూ. 80 ప్రీమియంతో ట్రేడ్ అవుతున్నాయి. అంటే, ఇదే ప్రీమియం కొనసాగితే, స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యే రోజు ఈ కంపెనీ షేర్లు 19.14% అధిక ప్రీమియంతో రూ. 498 వద్ద ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది.
టాపిక్