యాపిల్ లవర్స్‌కి క్రేజీ న్యూస్! లేటెస్ట్ ఐఫోన్ 16 సిరీస్ సహా ఐప్యాడ్స్, మ్యాక్‌బుక్, యాపిల్ వాచ్‌లు, ఎయిర్‌పాడ్స్ వంటి పరికరాలపై విజయ్ సేల్స్ భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ “యాపిల్ డేస్ సేల్” మే 24 నుంచి జూన్ 1 వరకు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది. ఆన్‌లైన్‌తో పాటు విజయ్ సేల్స్ ఔట్‌లెట్స్‌లో ఈ డిస్కౌంట్స్‌ని పొందొచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే..
సేల్‌లో భాగంగా ఐఫోన్ 16 సిరీస్‌పై గణనీయమైన ధర తగ్గింపులు లభిస్తున్నాయి. ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా కార్డులతో కొనుగోళ్లు చేసే వారికి రూ.4,000 వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ లభిస్తుంది. డిస్కౌంట్ తర్వాత 128 జీబీ స్టోరేజ్ కలిగిన ఐఫోన్ 16 అసలు ధర రూ.79,900 నుంచి రూ.66,990కు తగ్గుతుంది. ఐఫోన్ 16 ప్లస్ 128 జీబీ వేరియంట్ ధర రూ.89,900 నుంచి రూ.74,990కు తగ్గింది. కొత్తగా లాంచ్ చేసిన ఐఫోన్ 16ఈ ప్రారంభ ధర రూ.59,900 నుంచి రూ.47,990కు దిగొచ్చింది.
హై ఎండ్ మోడళ్లపై కన్నేసిన వారికి ఐఫోన్ 16 ప్రో (128 జీబీ) ఇప్పుడు రూ.1,19,900కు బదులు రూ.1,03,990కే లభిస్తుంది. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ (256 జీబీ) ధర రూ.1,44,900 నుంచి రూ.1,27,650కు పడింది.
పాత ఐఫోన్ మోడళ్లపై కూడా డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్ 15 (128 జీబీ) ధర రూ.58,490, ఐఫోన్ 15 ప్లస్ ధర రూ.66,990 నుంచి ప్రారంభం కానున్నాయి. ఐఫోన్ 13 (128 జీబీ) ధర రూ.42,790 నుంచి మొదలవుతుంది.
అదనంగా, విజయ్ సేల్స్ రిటైల్ ఔట్‌లెట్స్‌ని సందర్శించే వినియోగదారులు అర్హత కలిగిన స్మార్ట్‌ఫోన్స్‌పై రూ .7,500 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ని పొందవచ్చు.
విజయ్ సేల్స్ యాపిల్ టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌ల శ్రేణిపై కూడా తగ్గింపు ధరలను అందిస్తోంది. లెవెన్థ్ జనరేషన్ ఐప్యాడ్ ప్రారంభ ధర రూ.30,200 కాగా, ఐప్యాడ్ ఎయిర్ ప్రారంభ ధర రూ.52,400. ఐప్యాడ్ ప్రో ధర రూ.89,400 నుంచి ప్రారంభం కానుంది.
యాపిల్ కొత్త ఎం4 చిప్‌తో నడిచే మాక్ బుక్ ప్రో మోడళ్లు కూడా ఈ సేల్‌లో భాగంగా ఉన్నాయి. స్టాండర్డ్ మ్యాక్‌బుక్ ప్రో (ఎం4) ధర రూ.1,45,900, ఎం 4 ప్రో వెర్షన్ ధర రూ .1,72,400. టాప్ టైర్ ఎం4 మ్యాక్స్ మోడల్ ధర రూ.2,78,900గా ఉంది.
విజయ్ సేల్స్ మే 25న ఎం4- ఎం2 చిప్స్‌తో కూడిన మాక్‌బుక్ ఎయిర్ శ్రేణిపై డీల్స్‌ని వెల్లడించే అవకాశం ఉంది.
యాపిల్ వేరబుల్స్ శ్రేణి వేరబుల్స్, ఆడియో డివైస్‌లను కూడా ఈ సేల్‌లో చేర్చనున్నారు. యాపిల్ వాచ్ సిరీస్ 10 రూ .40,600 నుంచి, సెకెండ్ జనరేషన్ యాపిల్ వాచ్ ఎస్ఈ రూ .20,900 నుంచి ప్రారంభమవుతాయి. యాపిల్ వాచ్ అల్ట్రా 2 ప్రారంభ ధర రూ.79,700.
ఆడియో విభాగంలో ఎయిర్‌పాడ్స్ 4 ధర రూ.10,900, ఎయిర్‌పాడ్స్ ప్రో (సెకండ్ జనరేషన్) ధర రూ.20,900గా నిర్ణయించారు. అదనంగా బీట్స్ వైర్లెస్ ఆడియో ఉత్పత్తులు సేల్ లో రూ.5,500 నుంచి లభిస్తాయి.
మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని విజయ్ సేల్స్ ఔట్‌లెట్‌ని సందర్శించండి.
సంబంధిత కథనం