Maruti cars price hike: మారుతి కార్ల ధరలు పెరిగాయి; ఏ మోడల్ పై ఎంత అంటే..?
Maruti cars price hike: భారత్ లో వినియోగదారులు అత్యంత విశ్వసించే కార్ల ఉత్పత్తి సంస్థ మారుతి సుజుకీ. భారత్ లో గత కొన్ని దశాబ్దాలుగా అత్యధిక సేల్స్ కూడా ఈ కంపెనీ కార్లవే. తాజాగా, మారుతి స్విఫ్ట్, గ్రాండ్ విటారా ధరలను పెంచుతున్నట్లు మారుతి సంస్థ ప్రకటించింది.
Maruti cars price hike: గ్రాండ్ విటారా, స్విఫ్ట్ మోడళ్ల ధరలను ఈ రోజు (ఏప్రిల్ 10) నుండి పెంచుతున్నట్లు మారుతి సుజుకీ సంస్థ బుధవారం ప్రకటించింది. ఈ నెలలో అన్ని మోడళ్ల ధరలను సవరించే నిర్ణయంలో భాగంగా కార్ల తయారీ సంస్థ ఈ రెండు మోడల్స్ ధరలను రూ .25,000 వరకు పెంచింది. కమోడిటీ ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం కారణంగా ఈ నెలలో తమ కార్ల ధరలను పెంచనున్నట్లు మారుతి సుజుకి ఇదివరకే ప్రకటించింది. పాపులర్ హ్యాచ్ బ్యాక్ మారుతి సుజుకీ స్విఫ్ట్ ధర రూ.25,000 పెరగగా, ఫ్లాగ్ షిప్ ఎస్ యూవీ గ్రాండ్ విటారా ధర రూ.19,000 పెరిగింది.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
వేరియంట్ల వారీగా గ్రాండ్ విటారా ధరలు
మారుతి సుజుకీ ఈ రోజు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ సందర్భంగా ఈ ధరల పెంపును ప్రకటించింది. గ్రాండ్ విటారా ఎస్యూవీ ఎంట్రీ లెవల్ సిగ్మా వేరియంట్ ధరను రూ. 19 వేలు పెంచింది. ఇంతకుముందు ఈ వేరియంట్ ధర రూ .10.76 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండగా, ఇప్పుడు రూ. 19 వేల పెంపు అనంతరం, ఆ వేరియంట్ ధర రూ .10.95 లక్షలు (ఎక్స్-షోరూమ్) కు చేరుకుంది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Grand Vitara) నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. సిగ్మా వేరియంట్ ను మినహాయిస్తే, ఇతర వేరియంట్ల ధరలను పెంచలేదు. గ్రాండ్ విటారా టాప్-స్పెక్ ఆల్ఫా ప్లస్ ఇంటెలిజెంట్ హైబ్రిడ్ వేరియంట్ ధర రూ .19.97 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.
స్విఫ్ట్ ధరలు ఇలా..
మారుతి సుజుకి (Maruti Suzuki) భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్ బ్యాక్ లలో ఒకటైన మారుతీ స్విఫ్ట్ ధరను కూడా పెంచింది. కార్ల తయారీ సంస్థ ఈ మోడల్ ధరను రూ .25,000 పెంచింది. స్విఫ్ట్ ధరలు వేరింయట్ ను బట్టి రూ.5.99 లక్షల నుంచి రూ.9.03 లక్షల వరకు (ఎక్స్ షోరూమ్) ఉంటాయి. స్విఫ్ట్ అన్ని వేరియంట్లు ధరలు పెరుగుతాయా? లేక కొన్ని ఎంపిక చేసిన వేరియంట్ల ధరలను మాత్రమే పెంచుతారా? అన్న విషయంలో స్పష్టత లేదు. మారుతి సుజుకి ఈ ఏడాది చివర్లో స్విఫ్ట్ ఫేస్ లిఫ్ట్ వర్షన్ ను విడుదల చేయనుంది.
జనవరి నుంచి..
ఈ ఏడాది జనవరిలో మారుతి సుజుకీ (Maruti Suzuki) తన కార్ల లైనప్ అంతటా ధరలను పెంచింది. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ఇన్ పుట్ ఖర్చుల భారాన్ని పూడ్చడానికి ప్రయత్నించామని కార్ల తయారీ సంస్థ తెలిపింది.