ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌లో ఒకటిగా కొనసాగుతోంది మారుతీ సుజుకీ వాగన్ ఆర్. సంస్థ సేల్స్‌లోనూ కీలక పాత్ర పోషిస్తోంది. తక్కువ ధరలో కారు కొనాలని చూస్తున్న వారికి వాగన్ ఆర్ మంచి ఆప్షన్‌గా మారుతుండటంతో సేల్స్ బాగా జరుగుతున్నాయి. మరి మీరు కూడా బడ్జెట్లో ఒక కారు కొనాలని చూస్తున్నారా? అయితే, రూ. 10లక్షల లోపే ఈ మారుతీ సుజుకీ వాగన్ ఆర్ టాప్ ఎండ్ మోడల్ వచ్చేస్తోందని మీరు తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో మారుతీ సుజుకీ వాగన్ ఆర్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మారుతీ సుజుకీ వాగన్ ఆర్ ఎల్ఎక్స్ఐ:- రూ. 6.88 లక్షలు
వీఎక్స్ఐ- రూ. 7.41 లక్షలు
జెడ్ఎక్స్ఐ:- రూ. 7.80 లక్షలు
ఎల్ఎక్స్ఐ సీఎన్జీ:- రూ. 7.93 లక్షలు
వీఎక్స్ఐ ఏటీ:- రూ. 7.99 లక్షలు
జెడ్ఎక్స్ఐ ప్లస్:- రూ. 8.36 లక్షలు
జెడ్ఎక్స్ఐ ఏటీ:- రూ. 8.39 లక్షలు
వీఎక్స్ఐ సీఎన్జీ:- రూ. 8.46 లక్షలు
జెడ్ఎక్స్ఐ డ్యూయెల్ టోన్:- రూ. 8.5 లక్షలు
జెడ్ఎక్స్ఐ ప్లస్ ఏటీ:- రూ. 8.95 లక్షలు
జెడ్ఎక్స్ఐ ప్లస్ ఏటీ డ్యూయెల్ టోన్:- రూ. 9.09 లక్షలు
అంటే.. హైదరాబాద్‌లో మారుతీ సుజుకీ వాగన్ ఆర్ ఆన్‌రోడ్ ప్రైజ్ ధర రూ. 6.8లక్షలు- రూ. 9.09 లక్షల మధ్యలో ఉంటుంది. పైన పేర్కొనట్టు, సీఎన్జీ అని చెప్పిన మోడల్స్ మినహా.. మిగిలినవి అన్ని పెట్రోల్ ఇంజిన్ ఉన్న మోడల్స్. మారుతీ వాగన్ ఆర్‌లో డీజిల్ ఇంజిన్ లేదు!
ఇక మారుతీ వాగన్ ఆర్‌లో వీఎక్స్ఐ సీఎన్జీ, వీఎక్స్ఐ పెట్రోల్ మోడల్స్.. బెస్ట్ సెల్లింగ్‌గా దూసుకెళుతున్నాయి.
ఈ మోడల్‌కి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీరు మీ సమీప మారుతీ సుజుకీ డీలర్షిప్ షోరూమ్‌ని సందర్శించాలి.
సాధారణంగా.. వెహికిల్‌ని లాంచ్ చేసేటప్పుడు.. దాని ఎక్స్‌షోరూం ధరను మాత్రమే సంస్థలు చెబుతాయి. కానీ ఆ వెహికిల్ ఆన్‌రోడ్ ప్రైజ్.. ఎక్స్‌షోరూం ప్రైజ్ కన్నా ఎక్కువగా ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో.. ట్యాక్స్‌లు వేరువేరుగా ఉండటం ఇందుకు కారణం. అందుకే.. ఏదైనా కారు కొనే ముందు, దాని ఎక్స్‌షోరూం ధర కాకుండా.. ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలు తెలుసుకోవాలి. అప్పుడు బడ్జెట్ వేసుకోవాలి.
డీలర్షిప్ షోరూమ్స్ని సందర్శిస్తే.. టెస్ట్ డ్రైవ్ చేయడంతో పాటు సంబంధిత వెహికిల్పైన ఏవైనా ఆఫర్స్, డిస్కౌంట్స్ ఉన్నాయా? అన్న వివరాలు కూడా తెలుస్తాయి.
సంబంధిత కథనం