ఇక అన్ని కార్లకు 6 ఎయిర్​బ్యాగులు- మళ్లీ ధరలు పెంచనున్న మారుతీ సుజుకీ!-maruti suzuki to offer six airbags as standard across entire portfolio another price hike likely soon ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఇక అన్ని కార్లకు 6 ఎయిర్​బ్యాగులు- మళ్లీ ధరలు పెంచనున్న మారుతీ సుజుకీ!

ఇక అన్ని కార్లకు 6 ఎయిర్​బ్యాగులు- మళ్లీ ధరలు పెంచనున్న మారుతీ సుజుకీ!

Sharath Chitturi HT Telugu

దేశీయ దిగ్గజం మారుతీ సుజుకీ సేఫ్టీపై మరింత ఫోకస్​ చేసినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు తన పోర్ట్​ఫోలియోలోని అన్ని వాహనాలకు 6 ఎయిర్​బ్యాగులను స్టాండర్డ్​గా ఇచ్చేందుకు ప్లాన్​ చేస్తోంది. కానీ దీని వల్ల మారుతీ సుజుకీ వాహనాల ధరలు మరోసారి పెరిగే అవకాశం లేకపోలేదు!

మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​..

ఏదైనా కారు కొనుగోలు చేయాలంటే మైలేజ్​ మాత్రమే కాదు, ఇప్పుడు సేఫ్టీ ఫీచర్స్​ని కూడా చూస్తున్నారు. ఇంకా చెప్పాలంటే, భద్రతకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్న అనేక కుటుంబాలు సేఫ్టీ విషయంలో రాజీపడటం లేదు. అందుకు తగ్గట్టుగానే ఆటోమొబైల్​ సంస్థలు సైతం తమ వాహనాల్లో అధిక సేఫ్టీ ఫీచర్స్​ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అమ్మకాల పరంగా దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతీ సుజుకీ కూడా ఇప్పుడు సేఫ్టీపై మరింత ఫోకస్​ చేసింది. ఈ నేపథ్యంలోనే తన పోర్ట్​ఫోలియోలోని అన్ని మోడల్స్​కి 6 ఎయిర్​బ్యాగులు ఫిట్​ చేసేందుకు సంస్థ రెడీ అవుతోంది. అంతేకాదు, ఈ సేఫ్టీ ఇచ్చి, సంస్థ వాహనాల ధరలను మరోసారి పెంచే అవకాశం కూడా ఉంది!

సేఫ్టీపై మారుతీ సుజుకీ ఫోకస్​..

దిగ్గజ కార్ల తయారీ సంస్థ ఇప్పుడు తన మొత్తం ప్యాసింజర్ వాహనాల శ్రేణిలో ఆరు ఎయిర్​బ్యాగులను స్టాండర్డ్ ఫిట్​మెంట్​గా అందించాలని యోచిస్తోంది. ప్రస్తుతం మారుతీ సుజుకీ నుంచి ఎంపిక చేసిన మోడళ్లలో ఆరు ఎయిర్ బ్యాగులు స్టాండర్డ్​గా వస్తున్నాయి. వీటిలో ఆల్టో కే10, వాగన్​ఆర్, సెలెరియో, స్విఫ్ట్ హ్యాచ్​బ్యాక్​లు ఉన్నాయి.

ఫైవ్ స్టార్ గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ రేటింగ్ సాధించిన కొత్త తరం మారుతీ సుజుకీ డిజైర్ సబ్ కాంపాక్ట్ సెడాన్ కూడా ఆరు ఎయిర్​బ్యాగులను స్టాండర్డ్​గా కలిగి ఉంది. ఇది కాకుండా, ప్రీమియం హ్యాచ్​బ్యాక్ ఆధారంగా రూపొందించిన మారుతీ సుజుకీ బాలెనో, ఫ్రాంక్స్ క్రాసోవర్ కూడా ఆరు ఎయిర్​బ్యాగులను పొందుతాయి. కానీ వాటి సంబంధిత టాప్-స్పెక్ ట్రిమ్​లలో మాత్రమే అవి ఉండే అవకాశం ఉంది.

తమ పూర్తి శ్రేణి ప్యాసింజర్ వాహనాల్లో స్టాండర్డ్ ఫీచర్​గా ఆరు ఎయిర్​బ్యాగులను ఇస్తామని మారుతీ సుజుకీ ఇప్పటికే వెల్లడించింది. కార్ల తయారీ సంస్థ కాలపరిమితిని ఖచ్చితంగా పేర్కొననప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తమ కార్లకు స్టాండర్డ్ ఫిట్​మెంట్​గా ఆరు ఎయిర్​బ్యాగులను ఫిక్స్​ చేసి, విడుదల చేయాలని భావిస్తోంది. ఈ చర్యతో, ఎస్-ప్రెస్సో, ఫ్రాంక్స్, బాలెనో, ఇగ్నిస్ వంటి మోడళ్లు ప్రామాణిక ఫీచర్​గా ఆరు ఎయిర్​బ్యాగులను పొందుతాయి.

ఆరు ఎయిర్​బ్యాగులతో ధర కూడా పెరుగుతుంది!

మారుతీ సుజుకీ మొత్తం ప్యాసింజర్ వాహనాల శ్రేణిలో స్టాండర్డ్ ఫీచర్​గా ఆరు ఎయిర్ బ్యాగులు ఇవ్వాలను చూస్తుండటంతో, ఆయా వాహనాల ధరలు మరోసారి పెరిగే అవకాశం లేకపోలేదు! ద్రవ్యోల్బణం, ముడి పదార్థాల ధరలు పెరగడం వంటి కారణాల వల్ల 2025లో మారుతీ సుజుకీ తన కార్ల ధరలను ఇప్పటికే పలుమార్లు పెంచింది. ఆరు ఎయిర్ బ్యాగులు అందుబాటులోకి వస్తే మారుతీ సుజుకీ మోడళ్లు మరింత ఖరీదైనవిగా మారొచ్చు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం