Maruti Suzuki Swift vs Tata Tiago : స్విఫ్ట్ వర్సెస్ టియాగో.. ఏ హ్యాచ్‌బ్యాక్ కొనాలి?
Maruti Suzuki Swift vs Tata Tiago : మారుతీ సుజుకీ స్విఫ్ట్ వర్సెస్ టాటా టియాగో.. ఏది బెస్ట్? ధర, స్పెసిఫికేషన్స్‌ని ఇక్కడ తెలుసుకోండి..
Maruti Suzuki Swift on road price in Hyderabad : ఇండియా ఆటోమొబైల్ మార్కెట్ ఎస్యూవీ సెగ్మెంట్‌కి విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. ఈ తరుణంలో.. ఎస్యూవీ పోటీని తట్టుకుని చాలా తక్కువ హ్యాచ్‌బ్యాక్ వెహికిల్స్ మాత్రమే నిలబడుతున్నాయి. వాటిల్లో ప్రముఖంగా వినిపించే పేర్లు.. మారుతీ సుజుకీ స్విఫ్ట్, టాటా టియాగో. ఇక 2024 మారుతీ సుజుకీ స్విఫ్ట్ ఇటీవలే లాంచ్ అయ్యింది. ఈ నేపథ్యంలో.. ఈ రెండింటినీ పోల్చి.. ఏది కొంటే బెటర్? అనేది ఇక్కడ తెలుసుకుందాము..
మారుతీ సుజుకీ స్విఫ్ట్ వర్సెస్ టాటా టియాగో: ధర..
2024 మారుతీ సుజుకీ స్విఫ్ట్ ఎక్స్‌షోరూం ధర రూ .6.49 లక్షల నుంచి రూ .9.65 లక్షల మధ్య ఉంది. మరోవైపు.. టాటా టియాగో ధర రూ .5.65 లక్షల నుంచి రూ. 8.90 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. అంటే కొత్త తరం మారుతీ సుజుకీ స్విఫ్ట్.. టాటా టియాగో కంటే ప్రీమియం కలిగి ఉందని అర్థం.
ఇదీ చూడండి:- Upcoming compact SUVs in India : ఇండియాలో లాంచ్‌కు రెడీ అవుతున్న ఎస్‌యూవీలు ఇవే..!
మారుతీ సుజుకీ స్విఫ్ట్ వర్సెస్ టాటా టియాగో: స్పెసిఫికేషన్లు..
Tata Tiago on road price in Hyderabad : కొత్త మారుతీ సుజుకీ స్విఫ్ట్‌లో.. మునుపటి 1.2-లీటర్ 4 సిలిండర్ల పవర్ మిల్ స్థానంలో.. కొత్త జెడ్-సిరీస్ 1.2-లీటర్ 3 సిలిండర్ల నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ వచ్చింది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్ బాక్స్, 5-స్పీడ్ ఏఎమ్‌టీ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్‌తో లభిస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 80.46బీహెచ్పీ పవర్, 111.7ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ ఇంజిన్ మేన్యువల్ వేరియంట్లో లీటరుకు 24.8 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఏఎంటీ వేరియంట్ లీటరుకు 25.75 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. మునుపటి తరం స్విఫ్ట్ పెట్రోల్-సీఎన్జీ బై-ఫ్యూయల్ ఆప్షన్స్‌తో అందుబాటులో ఉండగా, కొత్త మోడల్ ఇంకా సీఎన్జీ వేరియంట్‌ని అందుకోలేదు.
మరోవైపు.. టాటా టియాగో 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ 3 సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 5-స్పీడ్ మేన్యువల్ ఏఎమ్‌టీ గేర్‌బాక్స్ ఆప్షన్స్‌తో లభిస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 84బీహెచ్పీ పవర్, 113ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది. కొత్త తరం మారుతీ సుజుకీ స్విఫ్ట్ మాదిరిగా కాకుండా.. టాటా టియాగోలో పెట్రోల్-సీఎన్జీ ఆప్షన్స్‌తో లభిస్తుంది. పరిశ్రమ-లీడింగ్ టెక్నాలజీగా ఈ సీఎన్జీ వేరియంట్ పేరు తెచ్చుకుంది.
Maruti Suzuki Swift price details : 2024 మారుతీ సుజుకీ స్విఫ్ట్‌తో పోలిస్తే టాటా టియాగో కొంచెం మెరుగైన పవర్, అధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, సీఎన్జీ వేరియంట్, సీఎన్జీ-ఏఎమ్‌టీ కలయిక లభ్యత టియాగోకు దాని ప్రత్యర్థి మారుతీ సుజుకీ స్విఫ్ట్ కంటే కొంచెం ఎడ్జ్ ఇస్తుంది. పూర్తి వివరాల కోసం మీరు మీ సమీప డీలర్షిప్ షేరూమ్స్ని విజిట్ చేస్తే.. బడ్జెట్ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవచ్చు.
సంబంధిత కథనం