Maruti Suzuki Swift launch: మారుతి సుజుకీ స్విఫ్ట్ 2024 మోడల్ లాంచ్; మైలేజీ 25 కిమీల పైనే. ధర కూడా అందుబాటులోనే..-maruti suzuki swift launched at rs 6 49 lakh gets new design engine and cabin ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Maruti Suzuki Swift Launch: మారుతి సుజుకీ స్విఫ్ట్ 2024 మోడల్ లాంచ్; మైలేజీ 25 కిమీల పైనే. ధర కూడా అందుబాటులోనే..

Maruti Suzuki Swift launch: మారుతి సుజుకీ స్విఫ్ట్ 2024 మోడల్ లాంచ్; మైలేజీ 25 కిమీల పైనే. ధర కూడా అందుబాటులోనే..

HT Telugu Desk HT Telugu
May 09, 2024 03:31 PM IST

భారతీయులు అత్యంత విశ్వసించే కార్ తయారీ సంస్థ మారుతి సుజుకీ. ఈ సంస్థ నుంచి వస్తున్న నాల్గవ తరం మారుతి సుజుకీ స్విఫ్ట్ మే 9, గురువారం మార్కెట్లోకి అడుగుపెట్టింది. ీ 2024 మోడల్ మారుతి సుజుకీ స్విఫ్ట్ పవర్ ట్రెయిన్, డిజైన్, క్యాబిన్ విభాగాల్లో అనేక మార్పులతో వినియోగదారులను మరింత ఆకర్షించేలా రూపొందింది.

మారుతి సుజుకీ స్విఫ్ట్2024 మోడల్ లాంచ్
మారుతి సుజుకీ స్విఫ్ట్2024 మోడల్ లాంచ్

Maruti Suzuki Swift launch: 4వ తరం మారుతి సుజుకీ స్విఫ్ట్ ను మే 9న లాంచ్ చేశారు. ఈ లేటెస్ట్ మోడల్ లో ఇంజన్ పరంగా, డిజైన్ పరంగా అనేక మార్పులు చేశారు. భారతీయులు అత్యధికంగా విశ్వసించే స్విఫ్ట్ ఇప్పుడు సరికొత్త అప్ డేట్ లతో మార్కెట్లోకి వచ్చింది.

ధర అందుబాటులోనే..

ఈ 2024 మోడల్, నాల్గవ తరం మారుతి సుజుకీ స్విఫ్ట్ బేస్ మోడల్ అయిన ఎల్ఎక్స్ఐ వేరియంట్ ప్రారంభ ధరను రూ. 6.49 లక్షలుగా నిర్ణయించారు. అలాగే, టాప్-ఎండ్ వేరియంట్ అయిన జెడ్ఎక్స్ఐ + వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 9.65 లక్షలుగా నిర్ణయించారు. ఈ కొత్త తరం స్విఫ్ట్ డిజైన్ లో, ఫీచర్లలో గణనీయమైన అప్ డేట్స్ తో వస్తుంది. ఈ మారుతి సుజుకీ స్విఫ్ట్ ఐదు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, విఎక్స్ఐ (ఓ), జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ + .

2024 మారుతి సుజుకి స్విఫ్ట్: ఇంజిన్, మైలేజ్

మారుతి సుజుకీ స్విఫ్ట్ లేటెస్ట్ మోడల్ లో వచ్చిన అతి ముఖ్యమైన మార్పు అడ్వాన్స్డ్ ఇంజన్ ను అమర్చడం. మునుపటి మోడల్స్ లోని ఇంజన్ స్థానంలో ఈ 2024 స్విఫ్ట్ లో కొత్త 1.2-లీటర్ 3-సిలిండర్ జెడ్-సిరీస్ పెట్రోల్ ఇంజన్ ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త స్విఫ్ట్ మైల్డ్-హైబ్రిడ్ సాంకేతికతను కలిగి ఉండదు. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఏఎమ్ టీ గేర్ బాక్స్ తో వస్తుంది. ఇది 80 బీహెచ్ పీ గరిష్ట శక్తిని, 112 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాదు, ఇది లీటరుకు 25.72 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

2024 మారుతి సుజుకి స్విఫ్ట్: డైమెన్షన్స్, డిజైన్

కొత్త స్విఫ్ట్ ఇంతకుముందు వచ్చిన స్విఫ్ట్ మోడల్స్ కంటే ఈ 2024 మోడల్ స్విఫ్ట్ 15 మిమీ ఎక్కువ పొడవు ఉంటుంది. వెడల్పు మాత్రం గత మోడల్స్ కన్నా 40 మిమీ తక్కువ ఉంటుంది. ఎత్తు 30 మిమీ ఎక్కువ ఉంటుంది. వీల్ బేస్ గత మోడల్స్ మాదిరిగానే 2,450 మిమీ ఉంటుంది. కొత్త స్విఫ్ట్ డిజైన్ లో కొన్ని మార్పులు చేశారు. ఇందులో ఆల్-బ్లాక్ ట్రీట్మెంట్ తో గ్రిల్ ను రీ డిజైన్ చేశారు. ఎల్ఈడీ హెడ్ లైట్లను, డీఆర్ఎల్స్ ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. సీ-పిల్లర్ కు బదులుగా తలుపులకు వెనుక డోర్ హ్యాండిల్స్ ప్లేస్మెంట్ లో మార్పు చేశారు. వాహనం వెనుక భాగంలో టెయిల్ లైట్స్ ను రీ డిజైన్ చేశారు. జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్ లో డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఉంటాయి. ఇతర వేరియంట్లు స్టీల్ రిమ్ లతో వస్తాయి. విఎక్స్ఐ వేరియంట్లు స్పోర్టింగ్ వీల్ కవర్ లను అందిస్తాయి.

2024 మారుతి సుజుకి స్విఫ్ట్: ఇంటీరియర్

కొత్త స్విఫ్ట్ ప్రీమియం అనుభూతిని అందించడంపై దృష్టి సారించి ఫ్రాంక్స్, బ్రెజ్జా, బాలెనో మాదిరిగా సవరించిన క్యాబిన్ తో వస్తోంది. ఇందులో ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన తాజా 7-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. అలాగే, అప్డేటెడ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. టాప్-ఎండ్ వేరియంట్లలో పెద్ద 9-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, హెడ్-అప్ డిస్ప్లే, వైర్లెస్ ఛార్జింగ్, రియర్ ఏసీ వెంట్స్ మొదలైనవి ఉన్నాయి.

2024 మారుతి సుజుకి స్విఫ్ట్: భద్రతా ఫీచర్లు

భద్రతా పరంగా, నాల్గవ తరం స్విఫ్ట్ అన్ని వేరియంట్లలో ప్రామాణికంగా ఆరు ఎయిర్ బ్యాగులను కలిగి ఉంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (esc), హిల్ స్టార్ట్ అసిస్ట్ తదితర సెక్యూరిటీ ఫీచర్స్ తో వస్తుంది.

WhatsApp channel