ధరలు పెరగడం కంటే ముందే మారుతి సుజుకి స్విఫ్ట్‌పై డిస్కౌంట్ పొందండి.. ఇదిగో ఆఫర్ వివరాలు!-maruti suzuki swift discount offer january 2025 get this car before price hike ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ధరలు పెరగడం కంటే ముందే మారుతి సుజుకి స్విఫ్ట్‌పై డిస్కౌంట్ పొందండి.. ఇదిగో ఆఫర్ వివరాలు!

ధరలు పెరగడం కంటే ముందే మారుతి సుజుకి స్విఫ్ట్‌పై డిస్కౌంట్ పొందండి.. ఇదిగో ఆఫర్ వివరాలు!

Anand Sai HT Telugu
Jan 08, 2025 12:30 PM IST

Maruti Suzuki Swift Discount : మారుతి సుజుకి ఇండియా జనవరి 2025లో తన పోర్ట్‌ఫోలియోలో పాపులర్ హ్యాచ్‌బ్యాక్, స్విఫ్ట్‌పై డిస్కౌంట్లను తీసుకువచ్చింది. ఈ నెలలో కారును కొనుగోలు చేస్తే మీకు డబ్బులు ఆదా అవుతాయి.

మారుతి సుజుకి స్విఫ్ట్ డిస్కౌంట్
మారుతి సుజుకి స్విఫ్ట్ డిస్కౌంట్

జనవరి 2025లో మారుతి సుజుకి పాపులర్ హ్యాచ్ బ్యాక్ స్విఫ్ట్‌పై డిస్కౌంట్లను అందిస్తుంది. ఈ కారును కొనుగోలు చేస్తే 35 వేల రూపాయల వరకు ప్రయోజనం లభిస్తుంది. స్విఫ్ట్ మోడల్ ఇయర్ 2023, మోడల్ ఇయర్ 2024పై కంపెనీ ఇలాంటి డిస్కౌంట్లను అందిస్తోంది. కస్టమర్లకు క్యాష్ డిస్కౌంట్లతో పాటు స్క్రాపేజ్ బోనస్ ప్రయోజనాన్ని కూడా కంపెనీ అందిస్తోంది. మారుతి సుజుకి కార్ల ధరలు పెరగడం కంటే ముందే దీనిని కొనుగోలు చేయండి. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.49 లక్షలు. జనవరి 31 వరకు మాత్రమే ఈ ఆఫర్ వినియోగదారులకు లభిస్తుంది. ఈ నెలలో కార్ల ధరలను కూడా కంపెనీ పెంచబోతోంది. సుమారు 4 శాతం వరకు పెరుగుతుందని అంచనా. ఈ కారు ఫీచర్ల గురించి తెలుసుకుందాం..

yearly horoscope entry point

స్విఫ్ట్ ఫీచర్లు

ఇందులో పూర్తిగా కొత్త ఇంటీరియర్‌ను పొందుతాయి. దీని క్యాబిన్ చాలా విలాసవంతంగా ఉంటుంది. ఇందులో వెనుక ఏసీ వెంట్స్ ఉన్నాయి. ఈ కారులో వైర్లెస్ ఛార్జర్, డ్యూయల్ ఛార్జింగ్ పోర్ట్ లభిస్తుంది. ఇది రియర్ వ్యూ కెమెరాను పొందుతుంది. తద్వారా డ్రైవర్ కారును సులభంగా పార్క్ చేయవచ్చు. 9 అంగుళాల ఫ్రీ స్టాండింగ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్‌ను అందించారు.

దీనికి రీడిజైన్ చేసిన డ్యాష్ బోర్డు లభిస్తుంది. వైర్లెస్ కనెక్టివిటీతో ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలకు స్క్రీన్ సపోర్ట్ చేస్తుంది. బాలెనో, గ్రాండ్ విటారా తరహాలో ఆటో క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్‌తో సెంటర్ కన్సోల్‌ను రీడిజైన్ చేశారు. ఇది కాకుండా ఇది కొత్త ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్‌ను పొందుతుంది.

ఇంజిన్ పవర్ట్రెయిన్ చూస్తే.. సరికొత్త జెడ్ సిరీస్ ఇంజిన్‌ను పొందుతుంది. పాత స్విఫ్ట్‌తో పోలిస్తే మైలేజ్‌ను గణనీయంగా పెంచుతుంది. కొత్త 1.2 లీటర్ జెడ్ 12 ఇ 3 సిలిండర్ ఎన్ఎ పెట్రోల్ ఇంజన్ 80 బిహెచ్పీ శక్తిని, 112 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో మైల్డ్ హైబ్రిడ్ సెటప్ ఉంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్, 5-స్పీడ్ ఎఎంటి గేర్ బాక్స్ ఆప్షన్ పొందుతుంది. మైలేజ్ పరంగా మాన్యువల్ ఎఫ్ఇ వేరియంట్ లీటరుకు 24.80 కిలోమీటర్లు, ఆటోమేటిక్ ఎఫ్ఇ వేరియంట్ లీటరుకు 25.75 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

సేఫ్టీలోనూ బెస్ట్

కొత్త స్విఫ్ట్ సేఫ్టీ ఫీచర్లు చూస్తే.. ఇది హిల్ హోల్డ్ కంట్రోల్, ఇఎస్పీ, కొత్త సస్పెన్షన్, అన్ని వేరియంట్లకు 6 ఎయిర్ బ్యాగులను పొందుతుంది. క్రూయిజ్ కంట్రోల్, అన్ని సీట్లకు 3 పాయింట్ సీట్ బెల్ట్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబీడీ), బ్రేక్ అసిస్ట్ (బీఏ) వంటి అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

గమనిక : వివిధ ప్లాట్‌ఫామ్‌ల సహాయంతో కారుపై డిస్కౌంట్లను ఇచ్చాం. మీ నగరం లేదా సమీప డీలర్‌ను సంప్రందించి డిస్కౌంట్ల వివరాలు తెలుసుకోండి. తక్కువ, ఎక్కువ ఉండవచ్చు.

Whats_app_banner