Maruti Suzuki Car Sales : మారుతికి చెందిన 17 మోడళ్లలో ఈ కారు నెంబర్ వన్.. వాటిని వెనక్కు నెట్టేసింది!
Maruti Suzuki Car Sales : మారుతి సుజుకి ఇండియా 2024 డిసెంబర్ చివరి నెలకు సంబంధించిన డేటాను వెల్లడించింది. కంపెనీ భారత మార్కెట్లో మొత్తం 17 మోడళ్లను విక్రయిస్తోంది. ఇందులో హ్యాచ్‌బ్యాక్‌లు, ఎంపీవీలు, ఎస్‌యూవీలు, సెడాన్ కార్లు ఉన్నాయి.
భారత మార్కెట్‌లో మారుతి కార్ల ప్రస్థానం ప్రత్యేకం. ఎక్కువ మంది ఈ కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. మారుతి సుజుకి ఇండియా 2024 డిసెంబర్ చివరి నెల డేటాను తెలిపింది. భారత మార్కెట్లో మొత్తం 17 మోడళ్లను విక్రయిస్తోంది. గత నెలలో కంపెనీకి అత్యధికంగా అమ్ముడైన కారు బ్రెజ్జా. ఈ ఎస్‌యూవీకి ఉన్న డిమాండ్ దృష్ట్యా స్విఫ్ట్, వ్యాగన్ ఆర్, బాలెనో, ఫ్రాంక్స్‌లతో పాటు 7 సీటర్ ఎర్టిగా కూడా వెనక్కు వెళ్లింది. ఇన్విక్టో కంపెనీ అమ్మకాలు కూడా పెరిగాయి. ముందుగా అమ్మకాల గణాంకాలను పరిశీలిద్దాం.
అమ్మకాలు ఇలా
మారుతి సుజుకి ఇండియా డిసెంబర్ అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే బ్రెజ్జా 17,336 యూనిట్లు, వ్యాగన్ ఆర్ 17,303 యూనిట్లు, ఎర్టిగా 16,056 యూనిట్లు, డిజైర్ 16,573 యూనిట్లు, ఈకో 11,678 యూనిట్లు, ఫ్రాంక్స్ 10,752 యూనిట్లు, స్విఫ్ట్ 10,421 యూనిట్లు, బాలెనో 9,112 యూనిట్లు, గ్రాండ్ 1, ఆల్టో కె 10 జిమ్నీ 1,100 యూనిట్లు, ఇన్విక్టో 825 యూనిట్లు, ఇగ్నిస్ 749 యూనిట్లు, సెలెరియో 748 యూనిట్లు, సియాజ్ 464 యూనిట్లు, ఎస్-ప్రెస్సో 8 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ విధంగా కంపెనీ మొత్తం 130,115 వాహనాలను విక్రయించింది.
మారుతి బ్రెజ్జా ఫీచర్లు
బ్రెజ్జా కొత్త తరం కె-సిరీస్ 1.5-డ్యూయల్ జెట్ డబ్ల్యూటీ ఇంజిన్ తో పనిచేస్తుంది. ఇది స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్ బాక్స్‌తో అటాచ్ అయి ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 103 బిహెచ్‌పీ పవర్, 137ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. బ్రెజ్జా మాన్యువల్ వేరియంట్ లీటరుకు 20.15 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అదే ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 19.80 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
ఇందులో 360 డిగ్రీల కెమెరా ఉంది. ఈ కెమెరా చాలా హైటెక్, మల్టీ ఇన్ఫర్మేషన్ కెమెరా. ఈ కెమెరా కారు 9 అంగుళాల స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేను సపోర్ట్ చేస్తుంది. బ్రెజ్జాలో వైర్‌లెస్ ఛార్జింగ్ డాక్ కూడా ఉంది. దీనితో స్మార్ట్‌ఫోన్‌ను సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.