Maruti Cars Mileage : మైలేజీలో రారాజు మారుతి కారు.. పెట్రోల్, సీఎన్జీ, హైబ్రిడ్.. ఏది ఎంత ఇస్తుందో ఫుల్ లిస్ట్-maruti suzuki petrol cng and hybrid cars mileage details check all cars figures here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Maruti Cars Mileage : మైలేజీలో రారాజు మారుతి కారు.. పెట్రోల్, సీఎన్జీ, హైబ్రిడ్.. ఏది ఎంత ఇస్తుందో ఫుల్ లిస్ట్

Maruti Cars Mileage : మైలేజీలో రారాజు మారుతి కారు.. పెట్రోల్, సీఎన్జీ, హైబ్రిడ్.. ఏది ఎంత ఇస్తుందో ఫుల్ లిస్ట్

Anand Sai HT Telugu
Oct 29, 2024 06:30 PM IST

Maruti Cars Mileage : మారుతి సుజుకి కార్లు మైలేజీకి పెట్టింది పేరు. ఈ కార్ల మైలేజీ కూడా కంపెనీ అమ్మకాలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందనేది నిజం. పెట్రోల్ నుండి సీఎన్జీ, హైబ్రిడ్ వరకు అన్ని రకాల మోడళ్లకు మైలేజ్ బాగుంటుంది. మారుతి కార్లు ఏ కారు ఎంత మైలేజీ ఇస్తుందో చూద్దాం..

మారుతి సుజుకి కార్ల మైలేజీ
మారుతి సుజుకి కార్ల మైలేజీ

మారుతి సుజుకి కార్ల మైలేజీ కారణంగా అందరూ ఇష్టపడుతారు. ఈ కంపెనీ పోర్ట్ ఫోలియోలో మొత్తం 17 మోడళ్లు ఉన్నాయి. ఇందులో సెలెరియో, స్విఫ్ట్, ఎస్-ప్రెస్సో, వ్యాగన్ఆర్, ఆల్టో కె 10, బాలెనో, డిజైర్, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, ఎక్స్ఎల్ 6, ఇగ్నిస్, సియాజ్, ఎర్టిగా, బ్రెజ్జా, ఈకో, జిమ్నీ, ఇన్విక్టో ఉన్నాయి. ఎరీనా, నెక్సా షోరూమ్ ల నుంచి కంపెనీ ఈ కార్లను విక్రయిస్తుంది. మీరు కూడా ఈ కార్లలో ఒకదాన్ని కొనుగోలు చేయాలనుకుంటే వాటి మేలైజీ గురించి తెలుసుకోండి.

మారుతి సుజుకి పెట్రోల్ కార్ల మైలేజీ

మారుతి సుజుకి పెట్రోల్ కార్ల మైలేజ్ చూస్తే.. మారుతి సుజుకి సెలెరియో మైలేజ్ లీటరుకు 26.68 కిలోమీటర్లు, మారుతి సుజుకి స్విఫ్ట్ మైలేజ్ లీటరుకు 25.75 కిలోమీటర్లు, మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో మైలేజ్ లీటరుకు 25.30 కిలోమీటర్లు, మారుతి సుజుకి వ్యాగన్ఆర్ మైలేజ్ లీటరుకు 25.19 కిలోమీటర్లు, మారుతి సుజుకి ఆల్టో కె 10 మైలేజ్ లీటరుకు 24.90 కిలోమీటర్లు, మారుతి సుజుకి బాలెనో మైలేజ్ లీటరుకు 2.9 కి.మీ.గా ఇస్తుంది. మారుతి సుజుకి డిజైర్ లీటరుకు 22.61 కిలోమీటర్లు, మారుతి సుజుకి ఫ్రాంక్స్ మైలేజ్ లీటరుకు 21.8 కిలోమీటర్లు అందిస్తుంది.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా మైలేజ్ లీటరుకు 21.11 కిలోమీటర్లు, మారుతి సుజుకి ఎక్స్ఎల్6 మైలేజ్ లీటరుకు 20.97 కిలోమీటర్లు, మారుతి సుజుకి ఇగ్నిస్ మైలేజ్ లీటరుకు 20.89 కిలోమీటర్లు, మారుతి సుజుకి ఎర్టిగా మైలేజ్ లీటరుకు 20.65 కిలోమీటర్లు, మారుతి సుజుకి ఎర్టిగా మైలేజ్ లీటరుకు 20.51 కిలోమీటర్లు, మారుతి సుజుకి బ్రెజ్జా మైలేజ్ లీటరుకు 19.89 కిలోమీటర్లుగా అందిస్తుంది.

మారుతి సీఎన్జీ కార్ల మైలేజ్

మారుతి సీఎన్జీ కార్లలో మొత్తం 13 మోడళ్లను కలిగి ఉంది. ఇందులో మారుతి సుజుకి సెలెరియో మైలేజ్ కిలోకు 34.43 కిలోమీటర్లు, మారుతి సుజుకి ఆల్టో కె 10 మైలేజ్ కిలోకు 33.85 కిలోమీటర్లు, మారుతి సుజుకి వ్యాగన్ఆర్ మైలేజ్ కిలోకు 33.47 కిలోమీటర్లు, మారుతి సుజుకి స్విఫ్ట్ మైలేజ్ 32.85 కిలోమీటర్లు/ కిలో, మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో మైలేజ్ కిలోకు 32.73 కిలోమీటర్లు, మారుతి సుజుకి డిజైర్ మైలేజ్ కిలోకు 31.12 కిలోమీటర్లు అందిస్తుంది.

అదే సమయంలో మారుతి సుజుకి బాలెనో మైలేజ్ కిలోకు 30.61 కిలోమీటర్లు, మారుతి సుజుకి ఫ్రోంక్స్ మైలేజ్ కిలోకు 28.51 కిలోమీటర్లు, మారుతి సుజుకి ఈకో మైలేజ్ 26.78 కిలోమీటర్లు / కిలో, మారుతి సుజుకి గ్రాండ్ విటారా మైలేజ్ 26.6 కిలోమీటర్లు / కిలో, మారుతి సుజుకి ఎక్స్ఎల్ 6 మైలేజ్ 26.32 కిలోమీటర్లు / కిలో, మారుతి సుజుకి ఎర్టిగా మైలేజ్ 26.32 కిలోమీటర్లు / కిలో, మారుతి సుజుకి ఎర్టిగా మైలేజ్ 26.32 కిలోమీటర్లు/ కిలోగా ఉంటుంది.

మారుతి హైబ్రిడ్ కార్ల మైలేజ్

మారుతి సుజుకి హైబ్రిడ్ కార్ల మైలేజ్ గురించి చూస్తే.. కంపెనీకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో మారుతి సుజుకి గ్రాండ్ విటారా మైలేజ్ లీటరుకు 27.97 కిలోమీటర్లు, మారుతి సుజుకి ఇన్విక్టో మైలేజ్ లీటరుకు 23.24 కిలోమీటర్లుగా అందిస్తుంది.

Whats_app_banner