Maruti Suzuki price hike : కస్టమర్స్​కి షాక్​- భారీగా పెరగనున్న మారుతీ సుజుకీ వాహనాల ధరలు..-maruti suzuki joins hyundai motor announces price hike from january ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Maruti Suzuki Price Hike : కస్టమర్స్​కి షాక్​- భారీగా పెరగనున్న మారుతీ సుజుకీ వాహనాల ధరలు..

Maruti Suzuki price hike : కస్టమర్స్​కి షాక్​- భారీగా పెరగనున్న మారుతీ సుజుకీ వాహనాల ధరలు..

Sharath Chitturi HT Telugu
Dec 06, 2024 01:21 PM IST

Maruti Suzuki price hike : వినియోగదారులకు షాక్​ ఇచ్చేందుకు మారుతీ సుజుకీ సంస్థ రెడీ అయ్యింది. 2025 జనవరిలో తమ ప్రాడక్ట్స్​పై కనీసం 4శాతం ప్రైజ్​ హైక్​ తీసుకుంటామని స్పష్టం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

భారీగా పెరగనున్న మారుతీ సుజుకీ వాహనాల ధరలు..
భారీగా పెరగనున్న మారుతీ సుజుకీ వాహనాల ధరలు..

నూతన ఏడాది ప్రారంభంలో కస్టమర్స్​పై ‘ధరల’ భారాన్ని మోపేందుకు ఆటోమొబైల్​ సంస్థ సిద్ధమవుతున్నాయి. 2025 జనవరిలో కార్ల ధరలను పెంచుతున్న సంస్థల జాబితాలో తాజాగా మారుతీ సుజుకీ సైతం చేసింది. జనవరి 2025 నుంచి తమ లైనప్​లోని అన్ని ప్రాడక్ట్స్​పై ధరలు కనీసం నాలుగు శాతం పెరుగుతాయని భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. హ్యుందాయ్ తన లైనప్​లోని మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే మారుతీ సుజుకీ సైతం ఇదే విషయంపై ప్రకటన చేయడం గమనార్హం.

yearly horoscope entry point

మారుతీ సుజుకీ ఈ రోజు రెగ్యులేటరీ ఫైలింగ్ ద్వారా ధరల పెంపును ప్రకటించింది. ధరల పెంపు నాలుగు శాతం వరకు ఉండే అవకాశం ఉందని, మోడళ్లను బట్టి మారవచ్చని కార్ల తయారీ సంస్థ తెలిపింది. పెరుగుతున్న ఇన్​పుట్​ ఖర్చులు, నిర్వహణ ఖర్చుల భారాన్ని కొత్త సంవత్సరం నుంచి తమ వినియోగదారులకు బదిలీ చేయకతప్పడం లేదని పేర్కొంది.

హ్యుందాయ్​ నుంచి మెర్సిడీస్​ వరకు..

జనవరి నుంచి ధరల పెంచుతామని ప్రకటించిన భారతదేశంలో ఐదవ కార్ల తయారీదారు మారుతీ సుజుకీ! జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థలు మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడీలు ఇప్పటికే ప్రైజ్​ హైక్​ని చెప్పేశాయి. హ్యుందాయ్​ కూడా ఈ లిస్ట్​లో ఉంది.

అన్ని కార్ల తయారీదారులు ప్రైజ్​ హైక్​ నిర్ణయాల వెనుక “ఇన్పుట్ ఖర్చులు”, “నిర్వహణ వ్యయాల పెరుగుదల”ను ప్రధాన కారణాలుగా చెబుతున్నాయి.

"ఖర్చులను ఆప్టిమైజ్ చేయడానికి, వినియోగదారులపై ప్రభావాన్ని తగ్గించడానికి కంపెనీ నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ, పెరిగిన ఖర్చులో కొంత భాగాన్ని మార్కెట్​కి బదిలీ చేయవలసి ఉంటుంది," అని మారుతి సుజుకి ఈ రోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

ధరలను పెంచే కంపెనీల జాబితా రానున్న రోజుల్లో​ మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

భారతదేశంలో మారుతీ సుజుకీ కార్ల అమ్మకాలు..

దాదాపు 40 శాతం మార్కెట్ వాటాతో భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీదారుగా కొనసాగుతోంది మారుతీ సుజుకీ. గత ఏడాది నవంబర్​తో (1.34 లక్షల యూనిట్లు) పోలిస్తే ఈసారి 1.44 లక్షల యూనిట్లకు పైగా దేశీయ అమ్మకాలు నమోదయ్యాయి. బ్రెజా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా వంటి ఎస్​యూవీలతో కూడిన యుటిలిటీ వాహన విభాగంలో 16.9 శాతం వృద్ధి నమోదైంది. ఎర్టిగా, ఎక్స్ఎల్6, ఇన్విక్టో వంటి ఎంపీవీలు మారుతీ అమ్మకాలను నడిపించాయి. కాగా ఎస్​యూవీలతో డీలాపడిన చిన్న కార్ల విభాగం తనను తాను పునరుద్ధరించుకోవడానికి కష్టపడుతోంది!

హ్యుందాయ్​ వాహనాల ధరలు కూడా..

జనవరి 2025 నుంచి తమ లైనప్​లోని అన్ని కార్ల ధరలను పెంచుతున్నట్లు హ్యుందాయ్ ప్రకటించింది. కానీ ఏ మోడల్ పై, ఏ వేరియంట్​పై ఎంత ధర పెంచబోతోందో ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ పెంపు రూ. 25 వేల వరకు ఉంటుందని కంపెనీ సీఓఓ తరుణ్ గార్గ్ హింట్ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం