Maruti Suzuki cars : ఈ మారుతీ సుజుకీ వాహనాలపై భారీ డిస్కౌంట్లు..!
Discounts on Maruti Suzuki cars : మారుతీ సుజుకీ సంస్థ.. తన పోర్ట్‌ఫోలియోలోని అనేక వెహికిల్స్‌పై అదిరిపోయే డిస్కౌంట్స్‌ని ప్రకటించింది. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి.
Maruti Suzuki cars discounts : మారుతీ సుజుకీ తన నెక్సా శ్రేణి ప్యాసింజర్ వాహనాలపై రూ .87,000 వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా.. గరిష్టంగా రూ .87,000 వరకు తగ్గింపును పొందుతుండగా, నెక్సా రిటైల్ నెట్వర్క్ ద్వారా విక్రయించే ఇతర కార్లు ఇగ్నిస్, బాలెనో, సియాజ్, జిమ్నీ, ఎక్స్ఎల్ 6 కూడా మార్చి 2024లో సూపర్ డిస్కౌంట్లతో లభిస్తాయి. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..
మారుతీ సుజుకీ వెహికిల్స్‌పై డిస్కౌంట్స్..
మారుతీ సుజుకీ గ్రాండ్ విటారాపై రూ.30,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.50,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తోంది. అలాగే, ఈ ఎస్‌యూవీపై రూ .7,000 కార్పొరేట్ ఆఫర్ పొందొచ్చు. అయితే, ఈ ఎస్‌యూవీకి చెందిన సీఎన్జీ వేరియంట్‌పై ఎటువంటి ఆఫర్ అందుబాటులో లేదు.
మారుతీ సుజుకీ బాలెనో కారుపై రూ.57,000 వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌పై రూ.35,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తోంది. అంతేకాకుండా అర్హులైన కస్టమర్లకు రూ.7,000 వరకు కార్పొరేట్ ఆఫర్లను కూడా ఇస్తోంది సంస్థ. మారుతీ సుజుకీ బాలెనో సీఎన్జీ వేరియంట్లపైనా కూడా రూ .25,000 వరకు ప్రయోజనాలతో లభిస్తాయి. వీటిలో రూ .10,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ .15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ వంటివి ఉన్నాయి.
ఇతర మారుతీ సుజుకీ వాహనాలపైనా..
Maruti Suzuki latest news : మారుతీ సుజుకీ ఇగ్నిస్ కారుపై రూ.62,000 వరకు బెనిఫిట్స్ అందిస్తోంది సంస్థ. మారుతీ సుజుకీ ఇగ్నిస్ కారుపై రూ.40,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.7,000 వరకు కార్పొరేట్ ఆఫర్ ఉంది. బాలెనో ఆధారిత క్రాసోవర్ ఫ్రాంక్స్, ఎక్స్ఎల్ 6 ఎంపీవీపై.. వరుసగా రూ .27,000- రూ .20,000 వరకు ప్రయోజనాలను పొందొచ్చుs.
మారుతీ సుజుకీ ఏకైక మిడ్-సైజ్ సెడాన్ సియాజ్.. రూ .60,000 వరకు ప్రయోజనాలతో లభిస్తోంది. ఇందులో రూ .25,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ .25,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు రూ .10,000 వరకు కార్పొరేట్ ఆఫర్లు ఉన్నాయి.
Huge discounts on Maruti Suzuki cars : హైప్ ఎక్కువగా ఉన్న ఎస్‌యూవీల్లో ఒకటిగా నిలిచినప్పటికీ.. మారుతీ సుజుకీ జిమ్నీ సేల్స్ మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. 2023 లో లాంచ్ అయిన ఈ ఎస్యూవీ సేల్స్.. ప్రతి నెలా పడిపోతున్నాయి. ఇక ఇప్పుడు.. సేల్స్‌ని పెంచుకునే ప్రయత్నంలో.. మారుతీ సుజుకీ జిమ్నీ కోసం రూ .53,000 వరకు డిస్కౌంట్లను అందిస్తోంది సంస్థ. ఇందులో రూ .50,000 వరకు క్యాష్ డిస్కౌంట్, కార్పొరేట్ ఆఫర్లలో రూ .3,000 వరకు ఉన్నాయి.
ఈ డిస్కౌంట్లు ఈ నెలకు మాత్రమే పరిమితమని సమాచారం. పైగా.. ఇవి ఒక్క లొకేషన్లో ఒక్క విధంగా ఉంటాయి. అందుకే.. మీరు మీ సమీపంలోని డీలర్షిప్ షోరూమ్‌ని సంప్రదించి.. కొత్త వెహికిల్ కొనే విషయంపై నిర్ణయం తీసుకోవాలి.
సంబంధిత కథనం