భారత మార్కెట్లో చిన్న కార్ల తయారీకి రారాజుగా పేరుగాంచిన మారుతీ సుజుకీ.. బ్రెజా, గ్రాండ్ విటారా వంటి మోడళ్లతో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ రెండు మోడళ్ల సక్సెస్‌తో పాటు యుటిలిటీ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని మారుతీ సుజుకీ ఇప్పుడు ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో కొత్త మోడళ్లను ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. ఈసారి 'ఎస్కుడో' (Escudo) పేరుతో సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేయాలని సంస్థ యోచిస్తోంది.
మారుతీ సుజుకీ ఇప్పటికే భారతదేశంలో 'ఎస్కుడో' ‘టార్క్నాడో’ అనే పేర్లను ట్రేడ్‌మార్క్ చేసింది. ఆసక్తికరంగా, జపాన్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో సుజుకీ విటారాకు 'ఎస్కుడో' అనే పేరును ఉపయోగిస్తున్నారు. ఇక రాబోయే ఎస్‌యూవీ భారతదేశం కోసం ప్రత్యేకంగా తయారవుతుందని, ఇది బ్రెజా- గ్రాండ్ విటారా మధ్య స్థానంలో నిలుస్తుందని భావిస్తున్నారు.
ఈ ఏడాది పండుగ సీజన్‌లో మారుతీ సుజుకీ ఎస్కుడో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ నుంచి మనం ఆశించదగిన కొన్ని ముఖ్య అంశాలు కింద తెలుసుకోండి.
మారుతీ సుజుకీ ఎస్కుడో ఈ ఏడాది పండుగ సీజన్‌లో భారతదేశంలో విడుదలవుతుందని అంచనా వేస్తున్నారు. విడుదలైన తర్వాత, ఎస్కుడో ఎస్‌యూవీ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్, వోక్స్‌వ్యాగన్ టైగన్, హోండా ఎలివేట్, ఎంజీ ఆస్టర్ వంటి మోడల్స్‌తో తలపడుతుంది. విడుదలైన తర్వాత, ఇది మారుతీ సుజుకీ ‘అరేనా’ రిటైల్ నెట్‌వర్క్ ద్వారా సేల్‌లోకి వెళుతుంది.
మారుతీ సుజుకీ ఎస్కుడో, గ్రాండ్ విటారాను కూడా ఆధారంగా చేసుకున్న సుజుకీ గ్లోబల్ సీ ప్లాట్‌ఫామ్‌పై తయరవుతుందని భావిస్తున్నారు. అయితే, ఇది క్యాబిన్ లోపల మరింత స్పేస్‌ని అందించడానికి పొడవైన వీల్‌బేస్ వంటి అవసరమైన మార్పులతో రావచ్చు.
మారుతీ సుజుకీ ఎస్కుడో క్యాబిన్ లోపల అనేక ప్రీమియం ఫీచర్లతో వస్తుందని అంచనా వేస్తున్నారు. వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు కొత్త డాష్‌బోర్డ్ ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంటుంది. టాప్ వేరియంట్లలో సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు కూడా ఉండవచ్చు.
మారుతీ సుజుకీ ఎస్కుడో ఎస్‌యూవీ 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పవర్‌ని పొందుతుంది. ఇది ఎర్టిగా, బ్రెజా, గ్రాండ్ విటారా వంటి మోడళ్లలో ఇప్పటికే అందుబాటులో ఉన్న మారుతీ సుజుకీ మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో కనెక్ట్ చేసి ఉంటుంది. అలాగే, క్లీనర్ ఫ్యూయల్ టెక్నాలజీకి పెరుగుతున్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకొని, సీఎన్జీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుందని ఆశిస్తున్నారు. ఎస్‌యూవీ కోసం ట్రాన్స్‌మిషన్ ఎంపికల్లో ఐదు-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్ ఉంటాయి.
మారుతీ సుజుకీ ఎస్కుడో ఎస్‌యూవీ అనేక భద్రతా ఫీచర్లతో వస్తుందని అంచనా వేస్తున్నారు. అన్ని వేరియంట్లలో ప్రామాణిక ఫీచర్లుగా ఆరు ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్, ఈఎస్‌సీ వంటివి ఉండే అవకాశం ఉంది. టాప్-ఎండ్ ట్రిమ్‌లో 360-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా లభిస్తుందని భావిస్తున్నారు.
ఈ మోడల్ లాంచ్, ఫీచర్స్, ధరపై రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
సంబంధిత కథనం