Best Maruti car : అవసరం ఏదైనా- ఈ ఒక్క వ్యాన్​ ఉంటే చాలు! మారుతీ సుజుకీ 'ఈకో'కు 15ఏళ్లు..-maruti suzuki eeco turns 15 heres what kept the van relevant all these years ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Maruti Car : అవసరం ఏదైనా- ఈ ఒక్క వ్యాన్​ ఉంటే చాలు! మారుతీ సుజుకీ 'ఈకో'కు 15ఏళ్లు..

Best Maruti car : అవసరం ఏదైనా- ఈ ఒక్క వ్యాన్​ ఉంటే చాలు! మారుతీ సుజుకీ 'ఈకో'కు 15ఏళ్లు..

Sharath Chitturi HT Telugu
Jan 14, 2025 12:10 PM IST

ఇండియాలో అన్ని అవసరాలకు ఉపయోగించగలిగే వ్యాన్​గా గుర్తింపు పొందిన మారుతీ సుజుకీ ఈకోకు 15ఏళ్లు నిండాయి! ఈ మోడల్​ ఎందుకు ప్రత్యేకం? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మారుతీ సుజుకీ ఈకో
మారుతీ సుజుకీ ఈకో

మారుతీ సుజుకీ ఈకో 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది! ఈకోకి సంబంధించి ఇప్పటివరకు 12 లక్షలకుపైగా యూనిట్​లను విక్రయించినట్టు సంస్థ ప్రకటించింది. 2010 లో లాంచ్ అయిన తరువాత ఈ మైక్రోవాన్​కి భారతదేశంలో మంచి డిమాండ్​ కనిపించింది. చాలా కాలం వరకు ఈ మోడల్​ హాట్ కేకుల్లా అమ్ముడుపోయింది. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ ఈకో ఎందుకు ప్రత్యేకం? ధర ఎంత? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

yearly horoscope entry point

మారుతీ సుజుకీ ఈకోకి 15ఏళ్లు..

వివిధ అవసరాల కోసం వాడుకునే విధంగా ఉండటం ఈ మారుతీ సుజుకీ ఈకో ప్రత్యేకత! #HarSafarBaneKhaas (ప్రతి ప్రయాణాన్ని ప్రత్యేకంగా చేయండి) అన్న మార్కెటింగ్ ట్యాగ్ లైన్​తో ఈ వ్యాన్​ ప్రజల్లోకి వెళ్లింది. ఈ ఈకో వ్యాన్ పెట్రోల్, డ్యూయల్-ఫ్యూయల్ ఎస్-సీఎన్జీ వంటి ఆప్షన్స్​లో అందుబాటులో ఉంది.

ఇప్పటికీ పెట్రోల్, సీఎన్జీ మోడల్స్​ అమ్మకాలు దాదాపు సమానంగా ఉందని తయారీదారు తమ ప్రకటనలో హైలైట్ చేసింది. అమ్మకాల్లో పెట్రోల్ ఇంజిన్ వాటా 57 శాతం కాగా, 43శాతం సీఎన్జీ యూనిట్​లో సీఎన్జీని అమర్చినట్టు పేర్కొంది. 

“మారుతీ సుజుకీ ఈకోను గ్రామీణ ప్రాంతాల్లో ప్రముఖంగా విక్రయిస్తున్నాము. భారతదేశానికి అత్యంత ప్రియమైన వ్యాన్​గా పరిగణిస్తున్న ఈకో పట్టణ మార్కెట్లలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో కూడా తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది,” అని మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తన ప్రకటనలో తెలిపారు.

మారుతీ సుజుకీ ఈకో: వేరియంట్లు..

మారుతీ సుజుకీ ఈకో 13 విభిన్న వేరియంట్లలో లభిస్తుంది! వీటిలో 5-సీటర్, 7-సీటర్, కార్గో, టూర్, అంబులెన్స్ వంటి అత్యవసర వాహన కాన్ఫిగరేషన్లు ఉన్నాయి.

మారుతీ సుజుకీ ఈకో: ఇంజిన్, పనితీరు..

మారుతీ సుజుకీ ఈకోలో 1200 సీసీ, కే-సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ వీవీటీ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 6,000 ఆర్​పీఎమ్ వద్ద 79.5 బీహెచ్​పీ పవర్, 3,000 ఆర్​పీఎమ్ వద్ద 104.4 ఎన్ఎమ్ పీక్​ టార్క్​ని జనరేట్​ చేస్తుంది.

మారుతీ సుజుకీ ఈకో: సేఫ్టీ కూడా..!

ఈ మారుతీ సుజుకీ మైక్రోవాన్​లో డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, ఏబీఎస్ విత్ ఈబీడీ, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, డ్రైవర్- కో-డ్రైవర్ ఇద్దరికీ సీట్ బెల్ట్ రిమైండర్లు, హై-స్పీడ్ అలర్ట్ సిస్టమ్ వంటి కొన్ని భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఇండియాలో మారుతీ సుజుకీ ఈకో ధర రూ. 6.49 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం