ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు కనిపిస్తున్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అందుకు తగ్గట్టుగానే ఆటోమొబైల్ సంస్థలు కొత్త కొత్త మోడల్స్‌ని లాంచ్ చేస్తున్నాయి. అయితే, రానున్న రోజుల్లో లాంచ్‌కానున్న 3 మోడల్స్‌పై ఇండియాలో మంచి బజ్ ఉంది. అవి.. మారుతీ సుజుకీ ఈ విటారా, ఎంజీ ఎం9 ఎంపీవీ, ఎంజీ సైబర్‌స్టర్. రాబోయే కొన్ని వారాల్లో భారతదేశంలో లాంచ్ అవుతున్న ఈ మోడల్స్‌కి సంబంధించిన వివరాలను ఇక్కడ చూసేయండి..
భారతదేశంలో త్వరలో విడుదల కానున్న అత్యంత ఎగ్జైటింగ్ కార్లలో మారుతీ సుజుకీ ఈ విటారా ఒకటి. ఇది బ్రాండ్ నుంచి వస్తున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు. మారుతీ సుజుకీ ఇప్పటికే ఈ విటారాను 2025 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. ఈ ఎస్‌యూవీపై గత కొంత కాలంగా రోడ్ టెస్ట్‌లు జరుగుతున్నాయి. ఇది త్వరలో ఇండియాలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ ఈవీ మారుతీ సుజుకీ ప్రీమియం రిటైల్ నెట్వర్క్ నెక్సా ద్వారా అమ్మకాలకు వెళుతుంది. మారుతీ సుజుకీ ఈ విటారాలో 49 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ మోటార్‌తో కనెక్ట్ చేసి ఉంటుంది. ఇది 142 బీహెచ్పీ పీక్ పవర్‌ని, 192.5 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఫుల్ ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.
ఎంజీ ఎం9 అనేది ప్రీమియం ఎలక్ట్రిక్ ఎంపీవీ. ఇది కియా కార్నివాల్‌కు సమానమైన పరిమాణాన్ని కలిగి ఉంటుంది. ఎంజీ ఎం9ని ఆటో ఎక్స్పో 2025లో ప్రదర్శించారు. భారతదేశంలో విడుదలను సంస్థ ధ్రువీకరించింది. ప్రపంచవ్యాప్తంగా మాక్సస్ మిల్ఫా 9గా పిలుస్తున్న ఈ ఎంజీ ఎం9 ఎలక్ట్రిక్ ఎంపీవీ భారతదేశంలో వాహన తయారీదారుల ప్రీమియం రిటైల్ నెట్వర్క్ ఎంజి సెలెక్ట్ ద్వారా అమ్మకాలకు వెళుతుంది. ఇది ఎంజీ సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును కూడా విక్రయించనుంది. ఎంజీ ఎం9లో ఏడుగురు ప్రయాణికులు ప్రయాణించే సామర్థ్యం ఉంది. ప్రపంచవ్యాప్తంగా, ఈ ఎలక్ట్రిక్ వాహనం 90 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఫుల్ ఛార్జ్ చేస్తే 430 కిలోమీటర్ల వరకు పరిధిని అందిస్తుంది.
ఇండియాలో మచ్ అవైటెడ్ ఎలక్ట్రిక్ కార్లలో ఈ ఎంజీ సైబర్‌స్టర్ ముందువరుసలో ఉంటుంది. ఇది త్వరలో భారత మార్కెట్లో విడుదల కానున్న మరో అద్భుతమైన ఎలక్ట్రిక్ కారు. ఈ ఎలక్ట్రిక్ కారును ఎంజీ ఎం9 తో పాటు ఆటో ఎక్స్పో 2025 లో ప్రదర్శించారు. దీనితో పాటు సైబర్‌స్టర్ ఎంజీ సెలెక్ట్ ప్రీమియం రిటైల్ నెట్వర్క్ ద్వారా అమ్మకానికి వెళుతుంది. టూ-డోర్ స్పోర్ట్స్ కారు ఆటోమొబైల్ సంస్థ నుంచి వస్తున్న అత్యంత శక్తివంతమైన ప్రొడక్షన్-స్పెక్ మోడల్. ఇది ఫ్యూచరిస్టిక్ డిజైన్, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పుష్కలమైన ఫీచర్లతో అప్ మార్కెట్ క్యాబిన్‌ను ప్యాక్ చేస్తుంది. ఇందులో 77 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీన్ని ఫుల్ ఛార్జ్ చేస్తే 443 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఎంజీ సైబర్‌స్టర్ గరిష్టంగా 503 బీహెచ్పీ పవర్, 725ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని జనరేట్ చేస్తుంది.
సంబంధిత కథనం