Electric car : సింగిల్​ ఛార్జ్​తో 400 కి.మీ రేంజ్​- ఈవీ అంటే ఈ మారుతీ సుజుకీ ఎస్​యూవీలా ఉండాలి!-maruti suzuki e vitara electric car teased ahead of debut see details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Electric Car : సింగిల్​ ఛార్జ్​తో 400 కి.మీ రేంజ్​- ఈవీ అంటే ఈ మారుతీ సుజుకీ ఎస్​యూవీలా ఉండాలి!

Electric car : సింగిల్​ ఛార్జ్​తో 400 కి.మీ రేంజ్​- ఈవీ అంటే ఈ మారుతీ సుజుకీ ఎస్​యూవీలా ఉండాలి!

Sharath Chitturi HT Telugu
Jan 03, 2025 02:16 PM IST

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025 లో మారుతీ సుజుకీ ఇండియా-స్పెక్ ఈ విటారాని ఆవిష్కరించనుంది. ఈ మోడల్​పై లేటెస్ట్​ అప్డేట్స్​తో పాటు రేంజ్​ తదితర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

సింగిల్​ ఛార్జ్​తో 400 కి.మీ రేంజ్!
సింగిల్​ ఛార్జ్​తో 400 కి.మీ రేంజ్!

దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మారుతీ సుజుకీ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్​ కారుపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మారుతీ సుజుకీ ఈ విటారాని ఈ నెలలో జరిగే భారత్​ మొబిలిటీ గ్లోబల్​ ఎక్స్​పోలో ప్రదర్శించనున్నారు. ఇక ఇప్పుడు, కొత్త ఎలక్ట్రిక్ ఎస్​యూవీకి సంబంధించిన మరికొన్ని వివరాలు అందుబాటులోకి వచ్చాయి. సంస్థకు చెందిన ప్రీమియం నెక్సా డీలర్​షిప్స్​ ద్వారా ఈ ఈవీని విక్రయించనున్నట్లు ధృవీకరిస్తూ తయారీదారు తన నెక్సా అకౌంట్​ ద్వారా కొత్త టీజర్​ని సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

yearly horoscope entry point

మారుతీ సుజుకీ ఈ విటారా స్పెసిఫికేషన్లు ఏంటి?

ఈ విటారా ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ ప్రపంచవ్యాప్తంగా రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్​తో లభిస్తుంది. అవి. 49 కిలోవాట్, 61 కిలోవాట్. అయితే రెండు ఆప్షన్స్​ భారతీయ వినియోగదారులకు అందుబాటులో ఉంటాయో లేదో తయారీదారు ఇంకా ధృవీకరించలేదు. ఈ శ్రేణికి సంబంధించిన నిర్దిష్ట వివరాలు వెల్లడించనప్పటికీ, ఈ వాహనం ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 400 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని అంచనాలు ఉన్నాయి.

49 కిలోవాట్ల బ్యాటరీ 142బీహెచ్​పీ పవర్, 189ఎన్ఎమ్ టార్క్​ని ప్రొడ్యూస్ చేస్తుంది. 2 డబ్ల్యూడీ మోడ్​లో 61 కిలోవాట్ల బ్యాటరీ 172 బీహెచ్​పీ పవర్​ని, 189 ఎన్ఎమ్ టార్క్​ని ఉత్పత్తి చేయగలదు, అదే బ్యాటరీతో 4డబ్ల్యూడీ వేరియంట్ 300 ఎన్ఎమ్ టార్క్​ని ఉత్పత్తి చేస్తుంది. మోటార్, ఇన్వర్టర్లను లిథియం ఐరన్-ఫాస్ఫేట్ బ్యాటరీలతో మిళితం చేసే అత్యంత సమర్థవంతమైన ఈయాక్సిల్​ని పవర్ట్రెయిన్ కలిగి ఉందని సుజుకి సూచించింది. ప్రస్తుతానికి భారత మార్కెట్​లో విడుదలయ్యే మారుతీ సుజుకీ తొలి ఎలక్ట్రిక్​ కారు స్పెసిఫికేషన్లు తెలియరాలేదు.

మారుతీ సుజుకీ ఈ విటారా- డైమెన్షన్స్​..

మారుతీ సుజుకీ ఈ విటారా పొడవు 4,275 ఎంఎం. వెడల్పు 1,800 ఎంఎం. ఎత్తు 1,635 ఎంఎం. ఇది 2,700 ఎంఎం పొడవైన వీల్​బేస్​ను కలిగి ఉంది. ఎంచుకున్న వేరియంట్​ను బట్టి 18-ఇంచ్​ లేదా 19-ఇంచ్​ అల్లాయ్ వీల్స్​పై ప్రయాణిస్తుంది. ఇది 180 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, 5.2 మీటర్ల టర్నింగ్ రేడియస్ కలిగి ఉంది.

మారుతీ సుజుకీ ఈ విటారా ప్రత్యర్థులు ఎవరు?

ఈ విటారా ఇటీవల ఆవిష్కరించిన హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, టాటా కర్వ్ ఈవీలకు పోటీగా ఉంటుంది.

మారుతీ సుజుకీ ఈ విటారా ఏ ప్లాట్​ఫామ్​ను ఉపయోగిస్తుంది?

మారుతీ సుజుకీ ఈ విటారా హియర్​​టెక్ట్-ఇ ప్లాట్​ఫామ్​పై ఆధారపడి ఉంటుంది. ఇది బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకంగా తయారైంది. ఈ ప్లాట్​ఫామ్​ హై-వోల్టేజ్ రక్షణ, కాంపాక్ట్ ఓవర్ హాంగ్​ లను కలిగి ఉన్న తేలికపాటి నిర్మాణాన్ని కలిగి ఉంది. ఇది విశాలమైన ఇంటీరియర్​ను పొందుతుంది.

ఈ నెలలో ఈ విటారా లాంచ్​ ఉన్న నేపథ్యంలో మారుతీ సుజుకీ నుంచి ఇంకొన్ని రోజుల పాటు మరిన్ని అప్డేట్స్​ వెలువడే అవకాశం ఉంది. అప్పుడు ఇండియాకు చెందిన ఈ మారుతీ సుజుకీ ఈ విటారా ఎలక్ట్రిక్​ ఎస్​యూవీపై పూర్తి వివరాలు తెలుస్తాయి.

Whats_app_banner