దేశంలోని నెం.1 సెడాన్‌పై డిస్కౌంట్.. ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే!
Marutu Suzuki Dzire Discount : మారుతి సుజుకి ఇండియా తన కొత్త తరం డిజైర్‌పై ఈ నెలలో డిస్కౌంట్లను ప్రకటించింది. జనవరి 2025లో ఈ సెడాన్ కొనుగోలు చేయాలనుకుంటే రూ .40,000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి.
మారుతి సుజుకి ఇండియా కొత్త తరం డిజైర్ మీద డిస్కౌంట్లను ప్రకటించింది. జనవరి 2025లో ఈ సెడాన్ కొనుగోలు చేస్తే.. రూ .40,000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. కంపెనీ ఈ సెడాన్‌పై నగదు తగ్గింపుతో స్క్రాపేజ్ బోనస్‌ను కూడా అందిస్తోంది. డిజైర్ దేశంలోనే నెంబర్-1 సెడాన్‌గా ఉంది. కొత్త మోడల్ వచ్చిన తర్వాత దాని అమ్మకాలు బాగా పెరిగాయి. పాత డిజైర్ మోడల్ ఇయర్ 2023, మోడల్ ఇయర్ 2024పై కంపెనీ ఇలాంటి డిస్కౌంట్లను అందిస్తోంది. కొత్త మోడల్ పై ఎలాంటి ఆఫర్లు లేవు.
దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.79 లక్షలు. జనవరి 31 వరకు మాత్రమే ఈ ఆఫర్ వినియోగదారులకు లభిస్తుంది. ఈ నెలలో కార్ల ధరలను కూడా కంపెనీ పెంచబోతోంది.
కొత్త తరం డిజైర్ ఫీచర్లు
ఇందులో పూర్తిగా కొత్త ఇంటీరియర్‌ను పొందుతారు. దీని క్యాబిన్ చాలా విలాసవంతంగా ఉంటుంది. ఇందులో వెనుక ఏసీ వెంట్స్ ఉన్నాయి. ఈ కారులో వైర్లెస్ ఛార్జర్, డ్యూయల్ ఛార్జింగ్ పోర్ట్ లభిస్తుంది. రియర్ వ్యూ కెమెరా వస్తుంది. తద్వారా డ్రైవర్ కారును సులభంగా పార్క్ చేయవచ్చు. ఇందులో 9 అంగుళాల ఫ్రీ స్టాండింగ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్‌ను అందించారు.
దీనికి రీడిజైన్ చేసిన డ్యాష్ బోర్డు లభిస్తుంది. వైర్‌లెస్ కనెక్టివిటీతో ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలకు స్క్రీన్ సపోర్ట్ చేస్తుంది. బాలెనో, గ్రాండ్ విటారా తరహాలో ఆటో క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్‌తో సెంటర్ కన్సోల్‌ను రీడిజైన్ చేశారు. ఇది కాకుండా కొత్త ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్ వస్తుంది.
మైలేజీ వివరాలు
ఇంజిన్ పవర్ట్రెయిన్ గురించి చూస్తే.. సరికొత్త జెడ్ సిరీస్ ఇంజిన్‌తో వస్తుంది. పాత డిజైర్‌తో పోలిస్తే మైలేజ్ గణనీయంగా పెంచుతుంది. కొత్త 1.2 లీటర్ జెడ్ 12 ఇ 3 సిలిండర్ ఎన్ఎ పెట్రోల్ ఇంజన్.. 80 బిహెచ్పీ శక్తిని, 112 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇందులో మైల్డ్ హైబ్రిడ్ సెటప్ ఉంది. 5-స్పీడ్ మ్యాన్యువల్, 5-స్పీడ్ ఏఎంటీ గేర్ బాక్స్ ఆప్షన్ పొందుతుంది. మైలేజీ పరంగా మాన్యువల్ ఎఫ్ఈ వేరియంట్ లీటరుకు 24.80 కిలోమీటర్లు, ఆటోమేటిక్ ఎఫ్ఈ వేరియంట్ లీటరుకు 25.75 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
సేఫ్టీ ఫీచర్లు
కొత్త డిజైర్ సేఫ్టీ ఫీచర్ల గురించి చూస్తే.. హిల్ హోల్డ్ కంట్రోల్, ఈఎస్పీ, కొత్త సస్పెన్షన్, అన్ని వేరియంట్లకు 6 ఎయిర్ బ్యాగులను పొందుతుంది. క్రూయిజ్ కంట్రోల్, అన్ని సీట్లకు 3 పాయింట్ సీట్ బెల్ట్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్(ఈబీడీ), బ్రేక్ అసిస్ట్(బీఏ) వంటి అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
గమనిక : వివిధ ప్లాట్‌ఫామ్‌ల సాయంతో కారుపై డిస్కౌంట్ వివరాలు అందించాం. మీ నగరం లేదా సమీప డీలర్ ఎక్కువ లేదా తక్కువ డిస్కౌంట్లను కలిగి ఉండవచ్చు. ఒక్కసారి వెళ్లి వివరాలు తెలుసుకోండి.