Maruti Suzuki Dzire : మిడిల్ క్లాస్ మెచ్చే ఈ కారును రూ.6 లక్షల రుణంతో కొనుగోలు చేస్తే ఈఎంఐ ఎంత?-maruti suzuki dzire car with loan of 6 lakh rupees know down payment and emi calculator details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Maruti Suzuki Dzire : మిడిల్ క్లాస్ మెచ్చే ఈ కారును రూ.6 లక్షల రుణంతో కొనుగోలు చేస్తే ఈఎంఐ ఎంత?

Maruti Suzuki Dzire : మిడిల్ క్లాస్ మెచ్చే ఈ కారును రూ.6 లక్షల రుణంతో కొనుగోలు చేస్తే ఈఎంఐ ఎంత?

Anand Sai HT Telugu
Jan 26, 2025 03:30 PM IST

Maruti Suzuki Dzire : మారుతి సుజుకి ఇండియా తన కార్ల ధరలను ఫిబ్రవరి 1 నుండి పెంచనుంది. ఆ తరువాత మీరు కారు కొనుగోలు చేయడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే మిడిల్ క్లాస్ వాళ్లకి నచ్చే మారుతి సుజుకి డిజైర్ నెలవారీ ఈఎంఐ ఎంత ఉంటుందో చూద్దాం..

మారుతి సుజుకి డిజైర్ ఈఎంఐ
మారుతి సుజుకి డిజైర్ ఈఎంఐ (New Maruti Dzire)

మారుతి సుజుకి ఇండియా కార్ల ధరలు ఫిబ్రవరిలో పెరగనున్నాయి. జనవరి 31 నాటికి చౌకగా కార్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీకు బడ్జెట్ తక్కువగా ఉంటే లోన్ ఈఎంఐలపై కూడా కొనుగోలు చేయవచ్చు. మీరు కొత్త తరం డిజైర్ కొనుగోలు చేయాలనుకుంటే వివిధ వడ్డీ రేట్లు, కాలపరిమితిపై దాని నెలవారీ ఈఎంఐ ఎంత అనేది తెలుసుకుందాం..

డిజైర్ బేస్ వేరియంట్ ఎల్ఎక్స్ఐ ఎంటి పెట్రోల్ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.6.79 లక్షలు. బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ 80 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఆటో లోన్ ఇవ్వవచ్చు. అలాంటప్పుడు రూ.79,000 డౌన్ పేమెంట్ ద్వారా రూ.6 లక్షల రుణం తీసుకుంటే ఎంత ఈఎంఐ కట్టాల్సి వస్తుందో అర్థం చేసుకోవాలి. డౌన్ పేమెంట్, ఇన్సూరెన్స్, ఆర్టీవో వంటి ఇతర ఖర్చులను మీ జేబు నుంచే చెల్లించాల్సి ఉంటుంది.

8 శాతం వడ్డీ రేటుతో

మారుతి డిజైర్ ఎల్ఎక్స్ఐ ఎంటి పెట్రోల్ బేస్ వేరియంట్ కొనుగోలు చేయడానికి 8 శాతం వడ్డీ రేటుతో రూ .6 లక్షలు రుణం తీసుకుంటారు.

3 సంవత్సరాలకు నెలవారీ ఈఎంఐ రూ .18,802

4 సంవత్సరాల నెలవారీ ఈఎంఐ రూ .14,648

5 సంవత్సరాల నెలవారీ ఈఎంఐ రూ .12,166

6 సంవత్సరాలకు నెలవారీ ఈఎంఐ రూ .10,520

7 సంవత్సరాలకు నెలవారీ ఈఎంఐ రూ .9352

8.5 శాతం వడ్డీ రేటుతో

మారుతి డిజైర్ ఎల్ఎక్స్ఐ ఎంటి పెట్రోల్ బేస్ వేరియంట్ కొనుగోలు చేయడానికి మీరు 8.5 శాతం వడ్డీ రేటుతో రూ .6 లక్షలు రుణం తీసుకుంటే ఎంత చెల్లించాలో తెలుసుకుందాం..

3 సంవత్సరాలకు నెలవారీ ఈఎంఐ రూ .18,941

4 సంవత్సరాల నెలవారీ ఈఎంఐ రూ .14,789

5 సంవత్సరాలకు నెలవారీ ఈఎంఐ రూ.12,310

6 సంవత్సరాలకు నెలవారీ ఈఎంఐ రూ .10667

7 సంవత్సరాలకు నెలవారీ ఈఎంఐ రూ .9502

9 శాతం వడ్డీతో

మారుతి డిజైర్ ఎల్ఎక్స్ఐ ఎంటి పెట్రోల్ బేస్ వేరియంట్ 9 శాతం వడ్డీతో రూ .6 లక్షలు రుణం తీసుకుంటారు. ఆ సమయంలో చెల్లించాల్సిన మెుత్తం ఎంతంటే..

3 సంవత్సరాలకు నెలవారీ ఈఎంఐ రూ .19,080

4 సంవత్సరాల నెలవారీ ఈఎంఐ రూ .14,931

5 సంవత్సరాలకు నెలవారీ ఈఎంఐ రూ .12,455

6 సంవత్సరాలకు నెలవారీ ఈఎంఐ రూ .10,815

7 సంవత్సరాలకు నెలవారీ ఈఎంఐ రూ .9653

9.5 శాతం వడ్డీ రేటుతో

మారుతి డిజైర్ ఎల్ఎక్స్ఐ ఎంటి పెట్రోల్ బేస్ వేరియంట్ 9.5 శాతం వడ్డీ రేటుతో రూ .6 లక్షలు రుణం తీసుకుంటే ఎంత చెల్లించాలి.

3 సంవత్సరాలకు నెలవారీ ఈఎంఐ రూ .19,220

4 సంవత్సరాల నెలవారీ ఈఎంఐ రూ .15,074

5 సంవత్సరాలకు నెలవారీ ఈఎంఐ రూ .12,601

6 సంవత్సరాలకు నెలవారీ ఈఎంఐ రూ .10965

7 సంవత్సరాలకు నెలవారీ ఈఎంఐ రూ .9806

10 శాతం వడ్డీ రేటుతో

మారుతి డిజైర్ ఎల్ఎక్స్ఐ ఎంటి పెట్రోల్ బేస్ వేరియంట్ 10 శాతం వడ్డీ రేటుతో రూ .6 లక్షలు రుణం తీసుకుంటే ఎంత ఈఎంఐ కట్టాలి.

3 సంవత్సరాలకు నెలవారీ ఈఎంఐ రూ .19,360

4 సంవత్సరాల నెలవారీ ఈఎంఐ రూ .15,218

5 సంవత్సరాల నెలవారీ ఈఎంఐ రూ .12,748

6 సంవత్సరాలకు నెలవారీ ఈఎంఐ రూ .11,116

7 సంవత్సరాలకు నెలవారీ ఈఎంఐ రూ.9961

గమనిక : దగ్గరలోని షోరూమ్ లేదా డీలర్‌షిప్‌ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

Whats_app_banner