Best mileage car : ఈ ఫ్యామిలీ కారు.. మైలేజ్​లో కూడా టాప్​! లాంగ్​ ట్రిప్స్​కి బెస్ట్​ ఛాయిస్​..-maruti suzuki dzire 2024 facelift petrol cng mileage revealed check details of this bet family car ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Mileage Car : ఈ ఫ్యామిలీ కారు.. మైలేజ్​లో కూడా టాప్​! లాంగ్​ ట్రిప్స్​కి బెస్ట్​ ఛాయిస్​..

Best mileage car : ఈ ఫ్యామిలీ కారు.. మైలేజ్​లో కూడా టాప్​! లాంగ్​ ట్రిప్స్​కి బెస్ట్​ ఛాయిస్​..

Sharath Chitturi HT Telugu
Nov 07, 2024 06:40 AM IST

Maruti suzuki Dzire 2024 : మారుతీ సుజుకీ డిజైర్ ఫేస్​లిఫ్ట్​ నవంబర్ 11న అధికారికంగా విడుదలకానుంది. అయితే, తాజాగా ఈ మోడల్​కి సంబంధించిన మైలేజ్​ వివరాలు బయటకి వచ్చాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఈ ఫ్యామిలీ కారు మైలేజ్​లో కూడా టాప్​! లాంగ్​ ట్రిప్స్​కి బెస్ట్​ ఛాయిస్​..
ఈ ఫ్యామిలీ కారు మైలేజ్​లో కూడా టాప్​! లాంగ్​ ట్రిప్స్​కి బెస్ట్​ ఛాయిస్​..

మచ్​ అవైటెడ్​ మారుతీ సుజుకీ డిజైర్​ ఫేస్​లిఫ్ట్​ లాంచ్​కు రెడీ అవుతోంది. ఈ సబ్​ కాంపాక్ట్​ సెడాన్​, ఈ నెల 11న లాంచ్​కానుంది. కొత్త తరం మోడల్స్​ ఇప్పటికే డీలర్​షిప్​ షోరూమ్స్​కి చేరుకున్నాయని సమాచారం. అయితే, ఈ 2024 మారుతీ సుజుకీ డిజైర్​ వర్షెన్​కి సంబంధించిన మైలేజ్​ వివరాలు బయటకు వచ్చాయి. ఈ సెడాన్, 1.2-లీటర్ మూడు సిలిండర్ల నేచురల్ ఆస్పిరేటెడ్ జెడ్ సిరీస్ పెట్రోల్ ఇంజిన్​ని కంటిన్యూ చేస్తుంది. కానీ మైలేజ్​ సామర్థ్యం మాత్రం పాత వర్షెన్​తో పోల్చుకుంటే పెరిగింది! ఈ నేపథ్యంలో ఈ మోడల్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

మారుతీ సుజుకీ డిజైర్ పెట్రోల్ మైలేజ్..

మారుతీ సుజుకీ ప్రకారం.. కొత్త డిజైర్ దాని మునుపటి మోడల్​ కంటే ఎక్కువ మైలేజీని అందిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఏఎమ్​టీ ట్రాన్స్​మిషన్ యూనిట్లతో వచ్చే ఈ సెడాన్ పెట్రోల్ వేరియంట్లు కనీసం 24.97 కిలోమీటర్ల మైలేజీని ఇస్తాయి. మునుపటి తరం డిజైర్​తో పోలిస్తే ఇది దాదాపు 2 కిలోమీటర్లు ఎక్కువ! డిజైర్​ ఫేస్​లిఫ్ట్​ ఏఎమ్​టీ వర్షెన్ లీటరుకు 25 కిలోమీటర్లకు పైగా ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది!

మారుతీ సుజుకీ డిజైర్ సీఎన్జీ మైలేజ్..

2024 మారుతీ సుజుకీ డిజైర్​.. పెట్రోల్, సీఎన్జీ వర్షెన్స్​లో అందుబాటులోకి రానుంది. ఇక సీఎన్జీ వర్షెన్ అదే ఇంజిన్​తో. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్​బాక్స్​తో మాత్రమే లభిస్తుంది. డిజైర్ సీఎన్జీ ప్రస్తుతం లీటరుకు 31 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తోంది. డిజైర్ సీఎన్జీ దాని కొత్త అవతారంలో లీటరుకు 33.73 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇది దాని మునుపటి కంటే 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ!

మారుతీ సుజుకీ డిజైర్: ఫీచర్ అప్డేట్స్..

మారుతీ సుజుకీ డిజైర్ 2024 అవతారంలో రిఫ్రెష్డ్ మోడల్​గా వస్తుంది. ఎలక్ట్రిక్ సన్​రూఫ్​లో అతిపెద్ద మార్పు ఉంది! ఇది ఈ విభాగంలో మొదటిది. టచ్​స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్ స్క్రీన్ కూడా పరిమాణంలో పెరిగింది. ఇప్పుడు 9 ఇంచ్​గా ఉంది. మారుతీ సుజుకీ కొత్త డిజైర్​లో 360-డిగ్రీ కెమెరాను కూడా అందిస్తోంది. వీటితో పాటు, డిజైర్ వైర్లెస్ ఛార్జింగ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్​ కార్​ప్లే కనెక్టివిటీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక ప్రయాణీకుల కోసం ఏసీ వెంట్స్ వంటి ఇతర ఫీచర్లతో వస్తుంది.

మారుతీ సుజుకీ డిజైర్ తన తాజా పునరావృతంలో హ్యుందాయ్ ఆరా, రాబోయే హోండా అమేజ్ ఫేస్​లిఫ్ట్ సెడాన్​లతో పోటీని మరింత పెంచనుంది. ఎస్​యూవీల దండయాత్ర నేపథ్యంలో కొత్త ఫీచర్లు, మెరుగైన ఇంధన సామర్థ్యంతో, కొత్త డిజైర్ రాబోయే రోజుల్లో సబ్-కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్​ని రిఫ్రెష్​ చేసేందుకు దోహదపడుతుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం