మారుతీ సుజుకీ నుంచి కొత్త 7 సీటర్​ ఎస్​యూవీ- ఇక ఆ కార్లతో బిగ్​ ఫైట్​!-maruti suzuki confirms working on new 7 seater suv what it could be ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  మారుతీ సుజుకీ నుంచి కొత్త 7 సీటర్​ ఎస్​యూవీ- ఇక ఆ కార్లతో బిగ్​ ఫైట్​!

మారుతీ సుజుకీ నుంచి కొత్త 7 సీటర్​ ఎస్​యూవీ- ఇక ఆ కార్లతో బిగ్​ ఫైట్​!

Sharath Chitturi HT Telugu

మారుతీ సుజుకీ నుంచి కొత్త ఎస్​యూవీ లాంచ్​కు రెడీ అవుతోంది. ఇదొక 7 సీటర్​ ఎస్​యూవీ. ఇది ఇప్పటికే మార్కెట్​లో ఉన్న మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారాకు 7 సీటర్​ వెర్షన్​ని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మారుతీ సుజుకీ నుంచి కొత్త 7 సీటర్​ ఎస్​యూవీ (motoring_world)

ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో ఎస్​యూవీ సెగ్మెంట్​కి ఎంత డిమాండ్​ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ డిమాండ్​ని క్యాష్​ చేసుకునేందుకు ఆటోమొబైల్​ సంస్థలు కొత్త కొత్త మోడల్స్​ని పరిచయం చేస్తున్నాయి. ఇక ఇప్పుడు దేశీయ దిగ్గజం మారుతీ సుజుకీ సైతం ఇండియాలో కొత్త ఎస్​యూవీని తీసుకొచ్చేందుకు ప్లాన్​ చేస్తోంది. ఈ విషయాన్ని సంస్థ స్వయంగా ధ్రువీకరించింది. ఈ మోడల్​కి సంబంధించిన స్పై షాట్స్​ ఇప్పటికే బయటకు వచ్చాయి. ఈ ఎస్​యూవీ పేరును సంస్థ ఇంకా ధ్రువీకరించనప్పటికీ, స్పై షాట్స్​ని పరిశీలిస్తే.. ఈ కొత్త మోడల్​ గ్రాండ్ విటారా 7 సీటర్ వెర్షన్​ అని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

మారుతీ సుజుకీ కొత్త ఎస్​యూవీ..

మారుతీ సుజుకీ కొత్త ఎస్​యూవీ కోసం ఎటువంటి లాంచ్ టైమ్​లైన్​ని వెల్లడించలేదు. ఈ కొత్త ఎస్​యూవీ గ్రాండ్ విటారా, ఇన్విక్టో మధ్య ఉంటుంది. మారుతీ సుజుకీ నెమ్మదిగా ప్రీమియం సెగ్మెంట్ వైపు అడుగులు వేస్తోంది. సుజుకీ 7 సీట్ల వాహనాన్ని తయారు చేయడం ఇది మొదటిసారి కాదు. ఈ బ్రాండ్ ఇప్పటికే ప్రపంచ మార్కెట్లో కొన్ని మోడళ్లను కలిగి ఉంది. 7-సీటర్ ఎస్​యూవీలకు డిమాండ్ ఉన్నందున, మారుతీ సుజుకీ ఈ మార్గంలో వెళ్లాలన్న నిర్ణయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.

ఊహించినట్లుగా, కొత్త ఎస్​యూవీని మారుతీ సుజుకీ ప్రీమియం లైనప్ అయిన నెక్సా డీలర్​షిప్​ల ద్వారా మాత్రమే సేల్​లోకి వెళుతుంది. ఈ కొత్త ఎస్​యూవీ లాంచ్ అయిన తర్వాత హ్యుందాయ్ అల్కజార్, టాటా సఫారీ, ఎంజీ హెక్టార్ ప్లస్, కియా కారెన్స్​లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

కొత్త 7-సీటర్ ఎస్​యూవీలో 1.5-లీటర్, 4 సిలిండర్​ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ ఉండొచ్చు. ఇది 1.2 బీహెచ్​పీ పవర్​, 137 ఎన్ఎమ్ టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్​బాక్స్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్​మిషన్​తో కనెక్ట్​ చేసి ఉండనుంది. మరోవైపు, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ 3 సిలిండర్​ యూనిట్ కూడా ఉండొచ్చు. ఇది 113 బీహెచ్​పీ పవర్​, 122 ఎన్ఎమ్ టార్క్​ని కలిగి ఉంది. ఇది ఈసీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్​మిషన్​తో కనెక్ట్​ చేసి ఉంటుంది. ఆల్ వీల్ డ్రైవ్, సీఎన్జీ పవర్ట్రెయిన్ ఉంటాయా అనేది ప్రస్తుతానికి తెలియరాలేదు.

ఈ కొత్త 7 సీటర్​ ఎస్​యూవీ గ్రాండ్ విటారా కంటే భిన్నమైన డిజైన్​తో రానుందని స్పై షాట్స్ స్పష్టం చేశాయి. ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, రేర్ బంపర్, కొత్త ఓవర్​హ్యాంగ్​ కొత్త రేర్ ఎండ్ డిజైన్ ఉండనుంది. అదనంగా, ఎక్కువ క్యాబిన్ స్పేస్​ కోసం వీల్​బేస్ పొడవుగా పెరగొచ్చు. వెనుక డోర్లు కూడా పొడవుగా ఉండే అవకాశం ఉంది.

ప్రస్తుతానికి, ఎస్​యూవీ ఇంటీరియర్​పై ఎలాంటి అప్డేట్స్​ రాలేదు. అయితే, గ్రాండ్ విటారాతో పోలిస్తే ఇది కొద్దిగా రీడిజైన్ చేసిన డ్యాష్​బోర్డును పొందుతుందని మనం ఆశించవచ్చు. మారుతీ సుజుకీ నుంచి వస్తున్న కొత్త 7 సీటర్​ ఎస్​యూవీ క్యాబిన్​తో పాటు డ్యాష్​బోర్డుకు కొత్త రంగులు ఉండవచ్చు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం