Maruti Suzuki Brezza : ఈ బెస్ట్​ సెల్లింగ్​ ఫ్యామిలీ ఎస్​యూవీ ధరను పెంచిన మారుతీ సుజుకీ.. కారణం ఇదే!-maruti suzuki brezza updated with more features details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Maruti Suzuki Brezza : ఈ బెస్ట్​ సెల్లింగ్​ ఫ్యామిలీ ఎస్​యూవీ ధరను పెంచిన మారుతీ సుజుకీ.. కారణం ఇదే!

Maruti Suzuki Brezza : ఈ బెస్ట్​ సెల్లింగ్​ ఫ్యామిలీ ఎస్​యూవీ ధరను పెంచిన మారుతీ సుజుకీ.. కారణం ఇదే!

Sharath Chitturi HT Telugu
Updated Feb 15, 2025 08:29 AM IST

మారుతీ సుజుకీ బ్రెజా ధరలను సంస్థ పెంచింది. కొన్ని భద్రతా పరమైన ఫీచర్స్​ని యాడ్​ చేసి, ధరలను కూడా పెంచేసింది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మారుతీ సుజుకీ బ్రెజా
మారుతీ సుజుకీ బ్రెజా

ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీల్లో మారుతీ సుజుకీ బ్రెజా ఒకటి. దీనిని ఒక ఫ్యామిలీ ఎస్​యూవీగా ప్రజల్లోకి తీసుకెళ్లిన సంస్థ మంచి సక్సెస్​ని చూసింది. ఇకప్పుడు బ్రెజా ధరను సంస్థ పెంచింది! ఈ నేపథ్యంలో ధరల పెంపునకు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మారుతీ సుజుకీ బ్రెజా ధరలు పెంపు..

మారుతి సుజుకి బ్రెజా ఎస్​యూవీ మునుపటి కంటే ఇప్పుడు ఖరీదైనది. దీని ఎక్స్​షోరూమ్ ధర రూ.8.69 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. ఎల్ఎక్స్ఐ వేరియంట్ ధర రూ.15,000 పెరగ్గా.. వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ వేరియంట్ల ధరలు వరుసగా రూ.5,500, రూ.11,500 హైక్​ని చూశాయి. టాప్ ఎండ్ జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్ల ధరలు మాత్రం సంస్థ పెంచలేదు.

మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ బ్రెజాలో కొన్ని భద్రతా ఫీచర్లను జోడించడంతో ధరలను పెంచింది. ఇప్పుడు బ్రెజాలో వచ్చిన అతిపెద్ద భద్రతా ఫీచర్ 6 ఎయిర్ బ్యాగులు! ఇది కాకుండా మారుతీ సుజుకీ 3 పాయింట్ ఈఎల్ఆర్ రేర్ సెంటర్ సీట్ బెల్ట్, ముందు ప్రయాణీకులకు హైట్​ అడ్జెస్టెబుల్​ సీట్​బెల్ట్​, 60:40 స్ల్పిట్​ సీట్లు, కప్ హోల్డర్లతో రేర్ సెంటర్ ఆర్మ్​రెస్ట్​, అడ్జెస్టెబుల్​ రేర్​ ఆర్మ్​రెస్ట్​ని జోడించింది. ఈ ఫీచర్లను ఇప్పుడు అన్ని వేరియంట్లకు స్టాండర్డ్​గా అందిస్తోంది.

మారుతీ సుజుకీ బ్రెజా- ఇంజిన్​..

మారుతీ సుజుకీ బ్రెజాలో 1.5-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 6,000 ఆర్పిఎమ్ వద్ద 102 బీహెచ్​పీ పవర్​ని, 4,400 ఆర్పిఎమ్ వద్ద 136.8 ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ని ఉత్పత్తి చేస్తుంది. గేర్​బాక్స్ ఆప్షన్లలో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్​మిషన్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఆప్షన్లు ఉన్నాయి. స్మార్ట్ హైబ్రిడ్ సిస్టమ్ బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్​, యాక్సిలరేషన్ సమయంలో టార్క్ అసిస్ట్, ఐడిల్ స్టార్ట్-స్టాప్ ఫంక్షనాలిటీని అనుమతిస్తుంది.

ఇదే ఇంజిన్ సీఎన్జీతో కూడా లభిస్తుంది. సీఎన్జీతో నడిచే ఈ ఇంజిన్ సుమారుగా 86బీహెచ్​పీ పవర్, 121ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది మాన్యువల్ గేర్​బాక్స్​తో మాత్రమే అందుబాటులో ఉంది.

మారుతీ సుజుకీ బ్రెజా ఫీచర్లు..

మారుతీ సుజుకీ బ్రెజా ఎస్​యూవీలో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేతో కూడిన టచ్​స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, సన్​రూఫ్, వైర్​లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, మరెన్నో ఉన్నాయి.

మారుతీ సుజుకీ బ్రెజా వేరియంట్లు..

మారుతీ సుజుకీ బ్రెజా ఫ్యామిలీ ఎస్​యూవీ నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. అవి.. ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్.

మారుతీ సుజుకీ బ్రెజా బూట్ స్పేస్..

మారుతీ సుజుకీ బ్రెజా 328 లీటర్ల బూట్ స్పేస్​ను అందిస్తుంది.

మారుతీ సుజుకీ బ్రెజా ప్రత్యర్థులు..

మారుతీ సుజుకీ బ్రెజా ఎస్​యూవీ.. స్కోడా కైలాక్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, టాటా నెక్సాన్, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ ఖైగర్, మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్ఓతో పోటీపడుతుంది.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.
Whats_app_banner

సంబంధిత కథనం