Best Mileage Cars : మారుతికి చెందిన ఈ కార్లు మైలేజీలోనూ సూపర్.. ఇందులో మీకు ఏది ఇష్టం?
Best Mileage Cars Of Maruti : మిడిల్ క్లాస్ వాళ్లను ఎక్కువగా ఆకట్టుకునేవి బడ్జెట్ ఫ్రెండ్లీతోపాటుగా మైలేజీ ఇచ్చే కార్లు. మారుతికి చెందిన కొన్ని కార్లు మైలేజీలో బాగుంటాయి. రెండో ఆలోచన లేకుండా కొనొచ్చు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది.
కారు మైలేజీ గురించి మాట్లాడితే.. మారుతి సుజుకి కార్లు దాదాపు అందరికీ గుర్తుకువస్తాయి. ఈ కంపెనీకి చెందిన కార్లు 24 కి.మీ కంటే ఎక్కువ మైలేజీని కూడా అందిస్తాయి. చాలా మారుతి కార్లు ఆటో ఐడిల్ స్టార్ట్-స్టాప్‌ను కలిగి ఉన్నాయి. ఇది కూడా మైలేజీ పెరిగేందుకు సాయపడుతుంది. ఇప్పుడు మారుతిలో మంచి మైలేజీ కార్లు ఏవో చూద్దాం..
మారుతి గ్రాండ్ విటారా
మారుతి గ్రాండ్ విటారా అత్యధిక మైలేజ్ ఇచ్చే మారుతి కారు. 27.97 కేఎంపీఎల్ మైలేజీని అందజేస్తుందని క్లెయిమ్ చేసింది కంపెనీ. ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్ ఈ మైలేజీని అందిస్తుంది. ఇది పెట్రోల్ ఆధారిత 1.5-లీటర్, 3-సిలిండర్, స్ట్రాంగ్-హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌ను పొందుతుంది.
మారుతి సెలెరియో
మారుతి సుజుకి సెలెరియో 1-లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఆటో ఐడిల్ స్టార్ట్-స్టాప్ స్టాండర్డ్‌తో ఇది 26.68 కేఎంపీఎల్ మైలేజీని అందజేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇక్కడ గ్రాండ్ విటారా మినహా అన్ని కార్లు 5 స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ ట్రాన్స్‌మిషన్ ఎంపికలను కలిగి ఉన్నాయి.
మారుతి ఆల్టో కె10
కొత్త ఆల్టో కె10లో 1-లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్ లభిస్తుంది. ఇది ఆటో ఐడిల్ స్టార్ట్ స్టాప్ ఫీచర్‌ను కోల్పోతుంది. 24.39 కి.మీ నుండి 24.50 కి.మీ వరకు మైలేజీ అందిస్తుంది.
మారుతి వ్యాగన్ ఆర్
వ్యాగన్ ఆర్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు సెలెరియో, ఎస్ ప్రెస్సోలో పొందే అదే ఇంజన్‌ను పొందుతుంది. రెండు ఇంజన్లు ఒకే విధమైన సామర్థ్యాన్ని అందిస్తాయి. ఏఎంటీతో 23.56 కేఎంపీఎల్ నుంచి 25.19 కేఎంపీఎల్ వరకు మైలేజీని అందిస్తుంది.
మారుతి బాలెనో
ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో అత్యధిక మైలేజ్ ఇచ్చే కారు మారుతి బాలెనో. ఈ హ్యాచ్‌బ్యాక్ 22.94 కేఎంపీఎల్ మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. బాలెనో దాని రీబ్యాడ్జ్ వెర్షన్ టయోటా గ్లాంజాకు సమానమైన మైలేజీని అందిస్తుందని తెలిపింది.
మారుతి ఎస్-ప్రెస్సో
మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో డ్యూయల్ జెట్ ఇంజన్, ఐడిల్ స్టార్ట్-స్టాప్ ఫీచర్‌తో వస్తుంది. ఇది 25.30 కేఎంపీఎల్ మైలేజీ ఇస్తుంది.