Maruti Suzuki Baleno Price Hike: బలెనో కారు ధర పెంపు: ఎంత పెరిగింది? కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే!
Maruti Suzuki Baleno Price Hike: మారుతీ సుజుకీ బలెనో కారు ధర పెరిగింది. అలాగే కొన్ని కొత్త సెఫ్టీ ఫీచర్లు యాడ్ అయ్యాయి.
Maruti Suzuki Baleno Price Hike : బలెనో హ్యాచ్‍బ్యాక్ కారు ధరను పాపులర్ కంపెనీ మారుతీ సుజుకీ (Maruti Suzuki) పెంచింది. కొన్ని కొత్త సెఫ్టీ ఫీచర్లు, అప్‍డేటెడ్ పవర్‌ట్రైన్‍తో కొత్త బలెనోను తీసుకొచ్చి.. ధరను కాస్త అధికం చేసింది. ఇప్పుడు బలెనో బేస్ వేరియంట్ కూడా ఈఎస్‍పీ, హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్లతో వస్తోంది. మొత్తంగా మారుతీ సుజుకీ బలెనోకు చెందిన అన్ని వేరియంట్లపై ఇప్పుడు రూ.5వేల ధర పెరిగింది. కొత్త ధరలు, స్పెసిఫికేషన్ల వివరాలు ఇక్కడ చూడండి.
Maruti Suzuki Baleno: టైర్లు జారే అవకాశం ఉన్న రోడ్లపై ఈ ఈఎస్‍పీ ఫీచర్ ఉపయోగపడుతుంది. టైర్స్ స్కిడ్ కాకుండా ఇది నిరోధిస్తుంది. ఇక ఈ కొత్త మారుతీ సుజుకీ బలెనో(New Maruti Suzuki Baleno)కు హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్ కూడా యాడ్ అయింది. ఎత్తైన రోడ్లపై ముందుకు వెళుతున్నప్పుడు ఈ సదుపాయం ఉపయోగపడుతుంది.
Maruti Suzuki Baleno: 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేడెట్ పెట్రోల్ ఇంజిన్‍తోనే అప్‍డేటెడ్ మారుతీ సుజుకీ బలెనో వస్తోంది. 12 వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ ఉంటుంది. 89 bhp మ్యాగ్జిమమ్ పవర్, 113 Nm పీక్ టార్క్యూను ఈ ఇంజిన్ ప్రొడ్యూజ్ చేయగలదు. ఆర్‌డీఈతో పాటు బీఎస్6 ఫేజ్ 2 ఎమిషన్ ప్రమాణాలకు అనుగుణంగా బలెనో ఇంజిన్‍ను అప్‍డేట్ చేసింది మారుతీ సుజుకీ.
మారుతీ సుజుకీ బలెనో ధరలు ఇవే
Maruti Suzuki Baleno Price Hike : పెరుగుదల తర్వాత మారుతీ సుజుకీ బలెనో ప్రారంభ ధర రూ.6.61లక్షలకు చేరింది. బలెనోలో సిగ్మా బేస్ వేరియంట్‍గా ఉంది. ఇక బలెనో ఆల్ఫా ఏఎంటీ గేర్ బాక్స్ టాప్ వేరియంట్ ధర రూ.9.88లక్షలకు చేరింది. అంటే ప్రస్తుతం బలెనో హ్యాచ్‍బ్యాక్ కారు వేరియంట్ల ధరలు రూ.6.61లక్షల నుంచి రూ.9.88లక్షల మధ్య ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్-షోరూం ధరలు.
Cars Price Hike: టాటా మోటార్స్, ఫోక్స్‌వ్యాగన్, కియాతో పాటు దాదాపు అన్ని కార్ల తయారీ సంస్థలు ఇటీవల ధరలను పెంచాయి. బీఎస్6 ఫేజ్ 2 ప్రమాణాలకు అనుగుణంగా ఇంజిన్‍లను అప్‍డేట్ చేయడం తప్పనిసరి కావటంతో రేట్లను అధికంగా చేశాయి. అలాగే టూ-వీలర్ తయారీ సంస్థలు కూడా ధరలను పెంచాయి.
ఇటీవల ఫోక్స్‌వ్యాగన్ టియాగున్ ధర పెరిగింది. వేరియంట్లను బట్టి ఈ ఎస్‍యూవీ ధర రూ.6వేల నుంచి రూ.45వేల వరకు అధికమైంది. ప్రస్తుతం టియాగున్ ఎస్‍యూవీ ధరలు రూ.11.62లక్షల నుంచి రూ.19.06లక్షల మధ్య ఉన్నాయి.
సంబంధిత కథనం