Maruti Suzuki Baleno : చిన్న ఫ్యామిలీకి బెస్ట్ కారు మారుతి సుజుకి బాలెనో.. తక్కువ ధరలోనే మంచి ఫీచర్లు!-maruti suzuki baleno is the best car for a small family good features at low budget ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Maruti Suzuki Baleno : చిన్న ఫ్యామిలీకి బెస్ట్ కారు మారుతి సుజుకి బాలెనో.. తక్కువ ధరలోనే మంచి ఫీచర్లు!

Maruti Suzuki Baleno : చిన్న ఫ్యామిలీకి బెస్ట్ కారు మారుతి సుజుకి బాలెనో.. తక్కువ ధరలోనే మంచి ఫీచర్లు!

Anand Sai HT Telugu

Maruti Suzuki Baleno : మారుతి సుజుకి బాలెనో కారు స్టైలిష్‌ లుక్‌లో ఉంటుంది. చిన్న ఫ్యామిలీకి బడ్జెట్ ధరలో కొనుగోలు చేసేందుకు అందుబాటులో దొరుకుతుంది. ఈ కారు వివరాలు తెలుసుకుందాం..

మారుతి సుజుకి బాలెనో

మారుతి సుజుకి హ్యాచ్‌బ్యాక్‌లు మంచి అమ్మకాలు చేస్తాయి. మారుతి సుజుకి ఫ్లాగ్‌షిప్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనోకు మంచి డిమాండ్ ఉంది. ఈ కారు ఆకర్షణీయమైన డిజైన్, మంచి ఫీచర్లు, భద్రతను కలిగి ఉంది. కొత్త ఫేస్‌లిఫ్టెడ్ బాలెనో రైడ్, బిల్డ్ క్వాలిటీ ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్‌తో పోలిస్తే కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. మంచి సీటింగ్, ఇంజిన్, కొత్త ఫీచర్లు చిన్న ఫ్యామిలీకి ఇది మంచి ఆప్షన్. స్టైలింగ్, 360 డిగ్రీ కెమెరా, హెడ్ అప్ డిస్‌ప్లేలాంటి ఫీచర్లు దీనికి యాడ్ చేశారు.

ఫీచర్లు

ఈ హ్యాచ్‌బ్యాక్ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్‌పీ), హిల్-హోల్డ్ అసిస్ట్, ప్రయాణికులందరికీ 3 పాయింట్ సీట్ బెల్ట్‌లు, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్‌లతో ఉంటుంది.

ధర వివరాలు

మారుతి సుజుకి బాలెనో బేస్ వేరియంట్ ధర రూ. 6.66 లక్షలుగా ఉంది. టాప్ ఎండ్ వేరియంట్‌కి రూ. 9.83 లక్షలు. సీఎన్జీ వేరియంట్‌ల ధరలు రూ. 8.40 లక్షల నుండి మెుదలవుతాయి, పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్‌లు రూ. 7.95 లక్షల ఎక్స్ షోరుమ్ నుంచి ధరలు ఉంటాయి.

ఈ కారులో 9 అంగుళాల టచ్ స్క్రీన్, 6 స్పీకర్ అర్కామిస్ ట్యూన్డ్ సౌండ్ సిస్టమ్‌ను అన్ని వేరియంట్‌లలో కలిగి ఉంది. ఇది హెడ్స్-అప్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, కీలెస్ ఎంట్రీని కూడా కలిగి ఉంది.

ఇంజన్ వివరాలు

పెట్రోల్, సీఎన్జీ ఆప్షన్స్‌లో 1.2-లీటర్ సహజంగా ఆస్పిరేటెడ్ ఇంజన్‌తో అందిస్తారు. పెట్రోల్ ఇంజన్ 90 పీఎస్ పవర్, 113 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. సీఎన్జీ ఇంజన్ 77.5 పీఎస్ పవర్, 98.5 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో విడిగా జత అయి ఉంటుంది.