Maruti Wagon R : మారుతి వ్యాగన్ ఆర్ ఆటోమేటిక్ కారుకు పెరిగిన డిమాండ్.. ఈ లెక్కలే నిదర్శనం!-maruti seeing growth in demand for automatic variants of wagon r know this car history ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Maruti Wagon R : మారుతి వ్యాగన్ ఆర్ ఆటోమేటిక్ కారుకు పెరిగిన డిమాండ్.. ఈ లెక్కలే నిదర్శనం!

Maruti Wagon R : మారుతి వ్యాగన్ ఆర్ ఆటోమేటిక్ కారుకు పెరిగిన డిమాండ్.. ఈ లెక్కలే నిదర్శనం!

Anand Sai HT Telugu

Maruti Wagon R : భారత మార్కెట్‌లో మారుతి వ్యాగన్ ఆర్ ఆటోమేటిక్ వేరియంట్‌కు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్(ఏఎంటీ) వేరియంట్లకు ఈ ఆర్థిక సంవత్సరంలో డిమాండ్ 20 శాతం పెరిగింది.

మారుతి వ్యాగన్ ఆర్ కారుకు పెరిగిన డిమాండ్ (Maruti Suzuki WagonR)

మారుతి ప్రసిద్ధ హ్యాచ్ బ్యాక్ కారు వాగన్‌ ఆర్ మరోసారి భారత మార్కెట్‌లో తనకున్న డిమాండ్ చూపించింది. ముఖ్యంగా ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్ (ఏఎంటీ) వేరియంట్లకు ఈ ఆర్థిక సంవత్సరంలో డిమాండ్ 20 శాతం పెరిగింది. మారుతున్న పట్టణ ట్రాఫిక్ స్థితి, డ్రైవింగ్‌ను సులభతరం చేయాలనే ఆలోచనతో దీనిలో మార్పులు చేశారు. తర్వాత దీనికి డిమాండ్ పెరిగింది. దాని వివరాలు తెలుసుకుందాం.

1.0-లీటర్, 1.2-లీటర్ వేరియంట్లు వరుసగా డిమాండ్ 80:20 నిష్పత్తిలో ఉన్నాయి. అంటే 1.2-లీటర్ వేరియంట్ల కంటే వ్యాగన్‌ఆర్ 1.0-లీటర్ వేరియంట్లకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉందని మారుతి ఇంతకు ముందు నివేదించింది. 1.0-లీటర్ వేరియంట్ ఏఎంటీ వేరియంట్ వీఎక్స్ఐ ట్రిమ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. విఎక్స్ఐ ఎంటీ, విఎక్స్ఐ ఏఎంటీ మధ్య కేవలం 45,000 వ్యత్యాసం ఉంది. 1.2-లీటర్‌లో ఏఎంటీ జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్లలో లభిస్తాయి.

వ్యాగన్‌ ఆర్ ఆటోమేటిక్స్‌కు క్రేజ్ పెరుగుతోంది. పట్టణ ట్రాఫిక్‌లో ఉపశమనం, ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ (ఏజీఎస్) డ్రైవింగ్‌ను సులభతరం చేస్తుంది. ప్రజలు దీనిని ఎక్కువగా ఇష్టపడతారు. మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్ల ధరలో స్వల్ప వ్యత్యాసం ఉంటుంది. ఇది వినియోగదారులను ఆటోమేటిక్ వైపు ఆకర్షిస్తోంది. మారుతి సుజుకి ఏఎంటీ టెక్నాలజీ వినియోగదారులలో విశ్వసనీయతను పెంచింది.

మారుతి వ్యాగన్ఆర్ 25 సంవత్సరాలుగా భారత మార్కెట్లో ఉంది. ఈ కాలంలో 32 లక్షలకుపైగా యూనిట్లను విక్రయించింది. దీన్ని తొలిసారిగా 1999లో ప్రారంభించారు. ఆటోమేటిక్ వేరియంట్ మొదటిసారి 2015లో వచ్చింది. ఇది సెలెరియో తరువాత మారుతి రెండో ఏఎంటీ కారు. మారుతి వ్యాగన్‌ఆర్ చివరి అప్‌డేట్‌ను 2022లో అందుకుంది.

మారుతి వ్యాగన్ఆర్ ఆటోమేటిక్ వేరియంట్ గొప్ప డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది. ఏఎంటీ సిస్టమ్ అద్భుతమైన, మంచి డ్రైవింగ్‌ను అందిస్తుంది. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ నమ్మదగిన కారు మాత్రమే కాదు, మారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారుల అవసరాలను కూడా తీరుస్తుంది. ఆటోమేటిక్ వేరియంట్లకు పెరుగుతున్న డిమాండ్ దీనికి నిదర్శనం. పట్టణ ప్రాంతాల్లో సులభమైన, మంచి డ్రైవింగ్ కోసం వ్యాగన్ఆర్ ఏఎంటీ వేరియంట్లు సరైన ఎంపిక అని చాలామంది నమ్ముతారు.