Discounts on Maruti cars: ఈ కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించిన మారుతి సుజుకీ
పండుగ సీజన్ సమీపిస్తున్న తరుణంలో తమ వాహన శ్రేణిలోని కొన్ని ఎంపిక చేసిన వాహనాలపై మారుతి సుజుకీ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.
సెప్టెంబర్ నెలలో కొన్ని ఎంపిక చేసిన మోడల్స్ పై మారుతి సుజుకీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఎరీనా డీలర్ షిప్స్ ద్వారా కొనుగోలు చేసే 8 మోడల్స్ పై ఈ డిస్కౌంట్స్ లభిస్తాయి. ఈ డిస్కౌంట్స్ లో క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్చేంజ్ బెనిఫిట్స్, కార్పొరేట్ బోనస్ లు ఉన్నాయి. ఎరీనా డీలర్ షిప్ ద్వారా మారుతి ఇప్పటివరకు సుమారు 70 లక్షల కార్లను సేల్ చేసింది. ఈ డీలర్ షిప్స్ ద్వారా వేగన్ ఆర్, ఆల్టో కే 10, ఎస్ ప్రెస్సో, సెలీరియొ, స్విఫ్ట్, డిజైర్, బ్రెజా, ఎర్టిగా, ఈకో కార్లను మారుతి సుజుకీ అమ్ముతుంటుంది. ఈ మోడల్స్ లో ప్రస్తుతం మారుతి సుజుకీ బ్రెజా ఎస్ యూవీ ని మినహాయిస్తే, అన్ని మోడల్స్ కు డిస్కౌంట్ ప్రకటించింది.
వేగన్ ఆర్
వేగన్ ఆర్ మోడల్ పై మారుతి సుజుకీ రూ. 35 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ ను ఆఫర్ చేస్తోంది. అదనంగా రూ. 20 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్, రూ. 4 వేల వరకు కార్పొరేట్ బోనస్ ఉంది. అంటే, మొత్తంగా రూ. 59 వేల డిస్కౌంట్ లభిస్తుంది. వేగన్ ఆర్ సీఎన్జీ వర్షన్ లో మాత్రం క్యాష్ డిస్కౌంట్ రూ. 30 వేలు ఉంటుంది. మిగతా డిస్కౌంట్ లు యథాతథంగా ఉంటాయి. అంటే, వేగన్ ఆర్ సీఎన్జీ మోడల్ పై మొత్తంగా రూ. 54 వేల డిస్కౌంట్ లభిస్తుంది.
మారుతి స్విఫ్ట్
స్విఫ్ట్ మోడల్ పై మారుతి సుజుకీ రూ. 35 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ ను ఆఫర్ చేస్తోంది. అదనంగా రూ. 20 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్, రూ. 5 వేల వరకు కార్పొరేట్ బోనస్ ఉంది. అంటే, మొత్తంగా రూ. 60 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అయితే, జడ్ ఎక్స్ ఐ, జడ్ ఎక్స్ ఐ ప్లస్ లపై ఈ డిస్కౌంట్ లేదు.
ఆల్టో కే 10
స్విఫ్ట్ మోడల్ పై మారుతి సుజుకీ రూ. 35 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ ను ఆఫర్ చేస్తోంది. అదనంగా రూ. 15 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్, రూ. 4 వేల వరకు కార్పొరేట్ బోనస్ ఉంది. అంటే, మొత్తంగా రూ. 54 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అయితే, పెట్రోలు మ్యాన్యువల్ వర్షన్ కు మాత్రమే రూ. 35 వేల క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. ఆల్టో కే 10 పెట్రోల్ ఆటోమేటిక్, సీఎన్జీ వర్షన్లపై రూ. 20 వేల క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది.