మారుతి గ్రాండ్ విటారా Vs హ్యుందాయ్ క్రెటా.. ఈ రెండింటిలో కొనేందుకు ఏది బెస్ట్?-maruti grand vitara vs hyundai creta mileage features price which is best car for purchase check comparison ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  మారుతి గ్రాండ్ విటారా Vs హ్యుందాయ్ క్రెటా.. ఈ రెండింటిలో కొనేందుకు ఏది బెస్ట్?

మారుతి గ్రాండ్ విటారా Vs హ్యుందాయ్ క్రెటా.. ఈ రెండింటిలో కొనేందుకు ఏది బెస్ట్?

Anand Sai HT Telugu
Jan 30, 2025 12:30 PM IST

Maruti Grand Vitara Vs Hyundai Creta : మారుతి సుజుకి గ్రాండ్ విటారా, హ్యుందాయ్ క్రెటాకు ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ రెండింటిలో కొనేందుకు ఏది బెస్ట్ ఉంటుంది?

మారుతి గ్రాండ్ విటారా Vs హ్యుందాయ్ క్రెటా
మారుతి గ్రాండ్ విటారా Vs హ్యుందాయ్ క్రెటా

మారుతి సుజుకి గ్రాండ్ విటారా, హ్యుందాయ్ క్రెటా ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువగా అమ్ముడయ్యే ఎస్‌యూవీలు. ఈ రెండు కార్లలో ఏది బెస్ట్ అని పోల్చి చూస్తే ఈజీగా మీకు ఏం కొనాలో అర్థమవుతుంది. అందుకే ఈ రెండు ఎస్‌యూవీల ధర, ఫీచర్లు, మైలేజీ వివరాలను తెలుసుకుందాం.

yearly horoscope entry point

ధరలు చూస్తే..

మారుతి గ్రాండ్ విటారా ధరలు బేస్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ కోసం రూ. 10.99 లక్షల నుండి మెుదలవుతాయి. టాప్ స్పెక్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆటోమేటిక్(ఆల్ఫా ప్లస్) వేరియంట్ కోసం 20.99 లక్షలు ఖర్చు చేయాలి. సీఎన్జీ వేరియంట్లు రూ. 13.15 లక్షల ఎక్స్ షోరూమ్ నుండి మెుదలవుతాయి.

ఇక 2024 హ్యుందాయ్ క్రెటా బేస్ పెట్రోల్ మాన్యువల్ ధర రూ. 11 లక్షలు(ఎక్స్-షోరూమ్), టాప్ ఎండ్ టర్బో పెట్రోల్, డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్‌ల ధర రూ. 20.15 లక్షలు(ఎక్స్-షోరూమ్). హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ ధర రూ.14.51 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉంది.

ఫీచర్లు

గ్రాండ్ విటారా 9 అంగుళాల హెచ్‌డీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వైర్‌లెస్, 6-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్లతో వస్తుంది..

హ్యుందాయ్ క్రెటాలో డ్యూయల్ 10.25 అంగుళాల డిస్‌ప్లేలు, కనెక్ట్ చేసిన కార్ టెక్, 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, డ్యూయల్ జోన్ ఆటో ఏసీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ కెమెరావంటి ఫీచర్లు ఉన్నాయి.

మైలేజీ ఎంతంటే

మారుతి గ్రాండ్ విటారాలో 1.5-లీటర్ పెట్రోల్, పెట్రోల్ హైబ్రిడ్ ఇంజన్ ఎంపికలు ఉన్నాయి. పెట్రోల్ మాన్యువల్‌లో 21.11 కేఎంపీఎల్, పెట్రోల్ ఆటోమేటిక్‌లో 20.58 కేఎంపీఎల్, పెట్రోల్ ఆల్ వీల్ డ్రైవ్‌లో 19.38 కేఎంపీఎల్, సీఎన్జీలో 26.6 కేఎంపీఎల్, పెట్రోల్ హైబ్రిడ్‌లో 27.97కేఎంపీఎల్ మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది.

హ్యుందాయ్ క్రెటా 1.5-లీటర్ సహజసిద్ధమైన ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ మాన్యువల్‌లో 17.4కేఎంపీఎల్, సీవీటీలో 17.7 కేఎంపీఎల్ మైలేజీని అందిస్తుంది. 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌పై 18.4కేఎంపీఎల్, 1.5-లీటర్ డీజిల్ మాన్యువల్‌లో 21.8 కి.మీ, ఆటోమేటిక్‌లో 19.1 కిలో మీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ వెల్లడించింది.

సేఫ్టీ విషయానికొస్తే..

గ్రాండ్ విటారా వేరియంట్‌పై ఆధారపడి 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు, చైల్డ్ సీట్ మౌంట్, 360-డిగ్రీ కెమెరా, వెనుక పార్కింగ్ సెన్సార్, ప్రయాణీకులందరికీ 3 పాయింట్ సీట్ బెల్ట్, ఈఎస్పీ, హిల్- హోల్డ్, టైర్ ఇది ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి భద్రతా లక్షణాలను కలిగి ఉంది.

క్రెటాకు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, హిల్ స్టార్ట్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రియర్ డిస్క్ బ్రేక్‌లు, లెవల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్), క్రూయిజ్ కంట్రోల్, ఫార్వర్డ్ వార్నింగ్, ఆటోలిషన్ ఉన్నాయి.

ఈ రెండు కార్లు ప్రత్యేకమైనవి. చాలా బాగుంటాయి. వీటిలో మీకు ఏది బాగుంటుందో ధర, ఫీచర్లు, మైలేజీ చూసి డిసైడ్ చేసుకోండి.

Whats_app_banner