Maruti e Vitara : 10 కలర్ ఆప్షన్స్‌లో మారుతి ఈ విటారా.. సేఫ్టీ కిట్ వివరాలు వెల్లడి!
Maruti e Vitara : మారుతి సుజుకి ఇండియా తన మొదటి ఎలక్ట్రిక్ కారు ఈ విటారాను 2025 త్వరలోనే విడుదల చేయనుంది. దీని డిజైన్, ఇంటీరియర్‌కు సంబంధించిన సమాచారాన్ని కంపెనీ పంచుకుంది.
మారుతి సుజుకి ఇండియా మొదటి ఎలక్ట్రిక్ కారు ఈ విటారాను 2025. త్వరలోనే విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. దీని డిజైన్, ఇంటీరియర్‌కు సంబంధించిన సమాచారాన్ని కంపెనీ వెల్లడించింది. దీని ఇతర వివరాలు కూడా కూడా లాంచ్‌కు ముందే బయటకు వస్తున్నాయి. ఈ ఈవీకి సంబంధించిన కొన్ని వివరాలను కంపెనీ పంచుకుంది. దీనిలో దీని రంగులు, భద్రతా వివరాలు ఉన్నాయి.

ఈ కలర్ ఆప్షన్స్
మారుతి సుజుకి ఈ-విటారాను 10 ఎక్స్టీరియర్ కలర్ ఆప్షన్లలో అందించనుంది. ఇందులో 6 మోనో-టోన్, 4 డ్యూయల్-టోన్ రంగులు ఉన్నాయి. నెక్సా బ్లూ, స్ప్లెండిడ్ సిల్వర్, ఆర్కిటిక్ వైట్, గ్రాండియర్ గ్రే, బ్లూయిష్ బ్లాక్, ఓప్లెంట్ రెడ్ అనే 6 సింగిల్-టోన్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. అదే సమయంలో బ్లాక్ రూఫ్, ఎ-పిల్లర్, బి-పిల్లర్ డ్యూయల్-టోన్ రంగులో లభిస్తాయి. అలాగే ఆర్కిటిక్ వైట్, ల్యాండ్ బ్రీజ్ గ్రీన్, స్ప్లెండిడ్ సిల్వర్, ఓపులెంట్ రెడ్ కలర్ ఆప్షన్లు కూడా ఇందులో ఉండనున్నాయి.
ఫీచర్లు
మారుతి ఇ-విటారాలో ఎల్ఈడి హెడ్‌లైట్ల్, పగటిపూట రన్నింగ్ ల్యాంప్స్, టెయిల్ లైట్లు, 18-అంగుళాల చక్రాలు, గ్రిల్‌పై యాక్టివ్ ఎయిర్ వెంట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, మల్టీ కలర్ ఇంటీరియర్ యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జర్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వస్తాయి.
ఇన్ఫినిటీ బై హర్మన్ ఆడియో సిస్టమ్, ఇన్-కార్ కనెక్టివిటీ టెక్నాలజీ, సింగిల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్, పీఎం 2.5 ఎయిర్ ఫిల్టర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 10-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, రిక్లైనింగ్, స్లైడింగ్ అండ్ స్ప్లిట్ (60:40) వెనుక సీట్లు, డ్రైవ్ మోడ్స్ (ఎకో, నార్మల్, స్పోర్ట్), స్నో మోడ్, వన్ పెడల్ డ్రైవింగ్, రీజియన్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
మారుతి ఈ విటారా సేఫ్టీ కిట్
మారుతి ఈ విటారా భద్రతా ఫీచర్ల చూస్తే.. ఇది లెవల్ 2 ఏడీఏఎస్ సూట్‌ను కలిగి ఉంది. ఇందులో లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 7 ఎయిర్ బ్యాగులు, బ్లైండ్ స్పాట్ మానిటర్, టైర్ ప్రెజర్ మానిటర్, 360 డిగ్రీల కెమెరా, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ డిస్క్ బ్రేక్స్, ఆటో హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, పాదచారుల కోసం ఎగ్జాస్ట్ వెహికల్ అలారం సిస్టమ్ (ఏవీఏఎస్) ఉన్నాయి.