Man chops Wife body into pieces : బ్రిటన్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి, తన భార్యను కిరాతకంగా చంపేశాడు. అనంతరం, ఆమె మృతదేహాన్ని 200 ముక్కలుగా నరికాడు. వారం రోజుల పాటు కిచెన్‌లో పెట్టుకుని చివరికి.. నదిలో పడేశాడు.
28ఏళ్ల నికోలస్ మెట్సన్ అనే వ్యక్తికి.. సుమారు 16 నెలల క్రితం 26ఏళ్ల హోలీ బ్రామ్లీ అనే మహిళతో పెళ్లి జరిగింది. అప్పటి నుంచి అతను.. తన భార్యను ఎవరితోనూ మాట్లాడనిచ్చే వాడు కాదు. సొంత తల్లిదండ్రులతో కూడా ఆమె మాట్లాడేందుకు అతను ఒప్పుకునేవాడు కాదు. వారి మధ్య గొడవలు జరిగేవి.
కాగా.. నికోలస్ చేష్టలు రోజురోజుకు శృతి మించిపోతూ వచ్చాయి. బ్రామ్లీకి ఇష్టమైన కుక్క పిల్లను వాషింగ్ మిషన్‌లో వేసి చంపేశాడు! ఇలాంటి అమానవీయ పనులు చాలా చేశాడు. ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది.
Man Kills Wife in UK : మార్చ్ చివరి వారంలో.. తన భర్త హింసిస్తున్నాడని బ్రామ్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మార్చ్ 24న ఆ ఇంటికి వెళ్లారు పోలీసులు. 'నేను కాదు. నా భార్యే నన్ను హింసిస్తోంది. నరకం చూపిస్తోంది. ఇదిగో.. నన్ను కరిచింది, చూడండి,' అని నికోలస్ తన చెయ్యిని చూపించాడు. ఆ సమయంలో బ్రామ్లీ ఇంట్లో లేదు. అప్పటికే ఆమెను అతను చంపేశాడు!
మార్చ్ చివరి వారంలో తన భార్యను కిరాతకంగా చంపేశాడు నికోలస్. ఆమె శరీరాన్ని ముక్కలుముక్కలుగా నరికాడు. ఆ తర్వాత వాటిని కిచెన్‌లో స్టోర్ చేశాడు. 'నా భార్య చనిపోతే నాకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?', 'దయ్యాలు మనుషులను వెంటాడుతాయా?' అని సెర్చ్ చేశాడు.
దాదాపు వారం రోజుల పాటు మృతదేహానికి చెందిన ముక్కలను కిచెన్‌లో దాచుకున్న నికోలస్.. వాటిని పడేయడానికి ఫ్రెండ్ సాయం తీసుకున్నాడు. '50 పౌండ్లు ఇస్తే బాడీని డిస్పోజ్ చేద్దాము,' అని ఆ స్నేహితుడు అన్నాడు.
Man murders wife : చివరికి.. సమీపంలోనే విథమ్ నదిలో తన భార్య మృతదేహాన్ని పడేశాడు నికోలస్. ఒక రోజు తర్వాత.. నదిలో బాక్స్‌లు పైకి తేలాయి. మార్నింగ్ వాకింగ్‌కి వెళ్లిన స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసుులు.. ప్లాస్టిక్ బ్యాగ్‌లను రికవరీ చేసి, లోపల చూసేసరికి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఒక బాక్స్‌లో శరీరం ముక్కలు, మరో బాక్స్‌లో షేవ్ చేసి ఉన్న బ్రామ్లీ తల కనిపించింది!
ఘటనపై వెంటనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బ్రామ్లీ వివరాలను తెలుసుకున్నారు. ఆమె ఇంటికి వెళ్లి, సోదాలు నిర్వహించారు. బాత్‌టబ్‌లో రక్తపు మరకలు కనిపించాయి. ఇల్లంతా అమోనియా, బ్లీచింగ్ వాసన వచ్చింది.
Crime news latest : కానీ తన భార్య కొన్ని రోజుల క్రితమే ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని బుకాయించాడు నికోలస్. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నికోలసే, ఆమెను చంపేశాడని తెలుసుకున్నారు. అతను కూడా నిజం ఒప్పుకున్నాడు. ఆత్మరక్షణ కోసం బ్రామ్లీ.. నికోలస్ చెయ్యి కొరికి ఉంటుందని, అందుకే మరకలు వచ్చాయని పోలీసులు భావిస్తున్నారు.
అయితే.. భార్యను నికోలస్ ఎందుకు చంపాడో తెలియరాలేదు. అతనికి ఆయిసమ్ స్పెక్ట్రమ్ డిసార్జర్ ఉందని నికోలస్ లాయర్ చెప్పుకొచ్చారు.
సంబంధిత కథనం