UPI transaction fee : యూపీఐ లావాదేవీలపై ట్రాన్సాక్షన్​ ఫీజ్​ వేస్తారా? వేస్తే..!-majority of people will stop using upi if transaction fee is levied survey says ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Upi Transaction Fee : యూపీఐ లావాదేవీలపై ట్రాన్సాక్షన్​ ఫీజ్​ వేస్తారా? వేస్తే..!

UPI transaction fee : యూపీఐ లావాదేవీలపై ట్రాన్సాక్షన్​ ఫీజ్​ వేస్తారా? వేస్తే..!

Sharath Chitturi HT Telugu
Mar 04, 2024 12:01 PM IST

transaction fee on UPI payments : యూపీఐ పేమెంట్స్​పై ఛార్జీలు వసూలు చేస్తే ఏమవుతుంది? ఎంతమంది యూపీఐ యాప్స్​ని వాడతారు? అన్న ప్రశ్నలపై ఓ సర్వే జరిగింది. పలు ఆసక్తికర విషయాలు వెలువడ్డాయి.

యూపీఐ లావాదేవీలపై ట్రాన్సాక్షన్​ ఫీజు వేస్తే..!
యూపీఐ లావాదేవీలపై ట్రాన్సాక్షన్​ ఫీజు వేస్తే..!

UPI payments transaction fee : ఇండియాలో యూపీఐ (యూనిఫైడ్​ పేమెంట్స్​ ఇంటర్​ఫేస్​) సేవలు దూసుకెళుతున్నాయి! పేమెంట్స్​, లావాదేవీలు సులభంగా జరిగిపోతుండటంతో.. చాలా మంది యూపీఐ సేవలను వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు దాదాపు అందరి స్మార్ట్​ఫోన్స్​లో ఫోన్​పే, గూగుల్​పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్​ ఉంటున్నాయి. అంతా బాగుంది కానీ.. ఈ యూపీఐ లావాదేవీలపై 'ట్రాన్సాక్షన్​ ఫీజు' వేస్తే ఏమవుతుంది? ఎంత మంది యాప్స్​ని వినియోగించేందుకు ముందుకు వస్తారు? అని విషయంపై తాజాగా ఓ సర్వే జరిగింది. సర్వేలో పలు కీలక విషయాలు బయటకి వచ్చాయి.

యూపీఐ లావాదేవీలపై ట్రాన్సాక్షన్​ ఫీజు వేస్తే..

లోకల్​సర్కిల్స్​ అనే సంస్థ ఈ ఆన్​లైన్​ సర్వేని నిర్వహించింది. ట్రాన్సాక్షన్​ ఫీజు వేస్తే మాత్రం.. యూపీఐ యాప్స్​ని వాడటం ఆపేస్తామని.. సర్వేలో పాల్గొన్న మెజారిటీ మంది చెప్పారు! మరోవైపు.. కొందరు, ఇప్పటికే తమపై ఛార్జీలు పడుతున్నాయని చెప్పుకొచ్చారు.

యూపీఐ యాప్స్​లో ట్రాన్సాక్షన్​ ఫీజు ప్రవేశపెడితే.. వాటిని ఇక వాడమని 7శాతం మంది అభిప్రాయపడ్డారు. ట్రాన్సాక్షన్​ ఫీజు వేసినా.. పేమెంట్స్​, ట్రాన్సాక్షన్స్​ కోసం యాప్స్​ని వాడటాన్ని కొనసాగిస్తామని మరో 23శాతం మంది పేర్కొన్నారు.

ఇదీ చూడండి:- పేటీఎంకి గుడ్​ బై చెబుతున్నారా? ఈ యూపీఐ యాప్స్​ మీకోసమే!

UPI payment transaction charges : దేశంలోని 364 జిల్లాలకు చెందిన 34వేల మంది.. ఈ లోకల్​సర్కిల్స్​ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో 67శాతం మంది పురుషులు, 33శాతం మంది మహిళలు ఉన్నారు.

గడిచిన 12 నెలల్లో.. తమ యూపీఐ పేమెంట్స్​పై ఒకటి, అంతకన్నా ఎక్కువసార్లు.. ట్రాన్సాక్షన్​ ఫీజు పడిందని.. 37శాతం మంది తెలిపారు.

వాస్తవానికి ఈ యూపీఐ యాప్స్​ అనేవి.. మన జీవితంలో ఓ భాగమైపోయాయి. సర్వేలో కూడా దీనిపై ఓ ప్రశ్న అడిగారు. యూపీఐని ఎంత ఫ్రీక్వెంట్​గా వాడుతున్నారు? అనేది ప్రశ్న. ప్రతి ఇద్దరిలో ఒక యూపీఐ యూజర్​.. నెలలో కనీసం 10సార్లైనా ట్రాన్సాక్షన్స్​ చేస్తారని సర్వేలో తేలింది.

యూపీఐ పేమెంట్స్​పై ట్రాన్సాక్షన్​ ఫీజు వేస్తారా?

UPI transaction limit : యూపీఐ పేమెంట్స్​పై ట్రాన్సాక్షన్​ ఫీజుకు సంబంధించి.. గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. 2022లో ఆర్​బీఐ విడుదల చేసిన ఓ డిస్కషన్​ పేపర్​ ఇందుకు కారణం! అమౌండ్​ బాండ్స్​ని పెట్టి, వాటికి తగ్గట్టుగా.. యూపీఐ పేమెంట్స్​పై ఛార్జీలు వసూలు చేస్తే ఎలా ఉంటుంది? అని ప్రతిపాదిస్తూ.. చర్చకు ఆహ్వానించింది ఆర్​బీఐ. కానీ ఆ తర్వాత.. ఈ వ్యవహారంపై ఆర్థికశాఖ స్పందిస్తూ.. యూపీఐ ట్రాన్సాక్షన్స్​పై ఛార్జీలు వసూలు చేయాలనే ప్రదిపాదన ఏదీ తాము ఇవ్వలేదని స్పష్టం చేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం