Mahindra XUV300 Turbo Sport : భారత్​లో లాంఛ్​.. ఫీచర్లు, ధర ఇవే-mahindra xuv300 turbo sport launched in india here is the price and details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mahindra Xuv300 Turbo Sport : భారత్​లో లాంఛ్​.. ఫీచర్లు, ధర ఇవే

Mahindra XUV300 Turbo Sport : భారత్​లో లాంఛ్​.. ఫీచర్లు, ధర ఇవే

Geddam Vijaya Madhuri HT Telugu
Oct 07, 2022 02:57 PM IST

Mahindra XUV300 Turbo Sport : మహీంద్రా XUV300 TurboSportను భారతదేశంలో ప్రారంభించింది. మరి దీని ధర ఎంత? టెస్ట్ డ్రైవ్‌లు, బుకింగ్‌లు, ఫీచర్లు, డెలవరీల ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి.. వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

<p>Mahindra XUV300 Turbo Sport</p>
<p>Mahindra XUV300 Turbo Sport</p>

Mahindra XUV300 : మహీంద్రా తన ప్రసిద్ధ SUV XUV300 కొత్త వెర్షన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. దీనిని మహీంద్రా XUV300 Turbo Sport అని పిలుస్తున్నారు. దీని ప్రారంభ ధర రూ. 10.35 లక్షల (ఎక్స్-షోరూమ్). కొత్త మహీంద్రా XUV300 Turbo Sport సరికొత్త 1.2 L mStallion TGDi ఇంజన్‌తో శక్తిని పొందింది. కొత్త మహీంద్రా XUV300 TGDi భారతదేశం అంతటా 10 అక్టోబర్ 2022 నుంచి టెస్ట్ డ్రైవ్‌లు, బుకింగ్‌లు, డెలివరీలకు అందుబాటులో ఉంటుంది.

Mahindra XUV300 Turbo Sport లుక్స్

మహీంద్రా XUV300 టర్బోస్పోర్ట్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. 3 కొత్త డ్యూయల్ టోన్ కలర్స్ - బ్లేజింగ్ బ్రాంజ్ విత్ బ్లాక్ రూఫ్ టాప్, నాపోలీ బ్లాక్ విత్ వైట్ రూఫ్ టాప్, పెర్ల్ వైట్ విత్ బ్లాక్ రూఫ్ టాప్, బ్లేజింగ్ బ్రాంజ్ మోనోటోన్. ఇప్పటికే ఉన్న మోనోటోన్ పెరల్ వైట్, నాపోలి బ్లాక్ ఈ వేరియంట్‌తో వస్తుంది. కారు రెడ్ గ్రిల్ ఇన్సర్ట్‌లు, ఆల్-బ్లాక్ ORVMలు, ఆల్-బ్లాక్ లెథెరెట్ ఇంటీరియర్స్, క్రోమ్-ఫినిష్ పెడల్స్, డ్యూయల్-టోన్ ఎక్స్‌టీరియర్స్ వంటి కొత్త స్పోర్టీ డిజైన్ ఎలిమెంట్‌లను కూడా పొందుతుంది.

Mahindra XUV300 Turbo Sport ఇంజిన్

5 సెకన్లలో 0-60 కిమీ/గం నుంచి టేకాఫ్ అవుతుంది. సరికొత్త XUV300 టర్బోస్పోర్ట్ 1.2L TGDi ఇంజన్ ద్వారా శక్తిని పొందింది. ఇది 96 kW (130 PS) పవర్ @ 5000 r/min, 230 Nm టార్క్ @ 1500-3750 r/min.

గరిష్ట పనితీరు ఉన్నప్పటికీ.. ఇంజిన్ ఇప్పటికీ అధిక ఇంధన సామర్థ్యాన్ని అందించగలదని కంపెనీ పేర్కొంది. దాని స్వాభావిక అబిన్ స్పేస్, 5-స్టార్ గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్‌తో కలిపి, XUV300 అంతిమ థ్రిల్ మెషీన్‌గా పేర్కొన్నారు.

మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ప్రెసిడెంట్ - ఆటోమోటివ్ టెక్నాలజీ అండ్ ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ R వేలుసామి మాట్లాడుతూ.. TGDi పవర్‌ట్రెయిన్ ద్వారా ఆధారితమైన కొత్త టర్బోస్పోర్ట్ సిరీస్ అంతిమ డ్రైవింగ్ అనుభవాన్ని కోరుకునే థ్రిలీనియల్స్ కోసం అభివృద్ధి చేసినట్లు తెలిపారు. XUV300 TGDi అడ్రినలిన్-ప్యాక్డ్ SUV కోసం చూస్తున్న కస్టమర్‌లకు పనితీరు, భద్రత, సౌకర్యం, శైలిలో అంచుని అందించేలా రూపొందించినట్లు వెల్లడించారు.

సంబంధిత కథనం