Electric car : సింగిల్​ ఛార్జ్​తో 450 కి.మీ రేంజ్​- ఈ మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్​ కారు సూపర్​..!-mahindra xuv 3xo ev in pipeline key things to expect from this electric car ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Electric Car : సింగిల్​ ఛార్జ్​తో 450 కి.మీ రేంజ్​- ఈ మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్​ కారు సూపర్​..!

Electric car : సింగిల్​ ఛార్జ్​తో 450 కి.మీ రేంజ్​- ఈ మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్​ కారు సూపర్​..!

Sharath Chitturi HT Telugu
Jan 13, 2025 01:00 PM IST

Mahindra XUV 3XO EV : మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఈవీకి సంబంధించిన పలు కీలక విషయాలు బయటకి వచ్చాయి. రేంజ్​తో పాటు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఈవీ విశేషాలు..
మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఈవీ విశేషాలు..

ఇండియాలో ఎలక్ట్రిక్​ వాహనాలకు ఉన్న డిమాండ్​ని క్యాష్​ చేసుకునేందుకు ఆటోమొబైల్​ సంస్థలు పోటీపడి మరీ కొత్త కొత్త మోడల్స్​ని లాంచ్​ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు మహీంద్రా అండ్​ మహీంద్రా సంస్థ ఈవీలపై భారీగానే ఫోకస్​ చేసినట్టు కనిపిస్తోంది. గతేడాది రెండు కొత్త ఎలక్ట్రిక్​ వాహనాలను పరిచయం చేసిన దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ ఇప్పుడు తన ఈవీ లైనప్​లో మరో మోడల్​ని యాడ్​ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీల్లో ఒకటైన మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఈవీ వర్షెన్​ని సంస్థ సిద్ధం చేస్తోంది. రాబోయే ఈ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన టెస్ట్​ డ్రైవ్​ గత కొంతకాలంగా జరుగుతోంది. ఇక ఇప్పుడు మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్ఓ ఈవీ ప్రోటోటైప్​కి చెందిన కొత్త స్పై షాట్లు ఇంటర్నెట్​లో ప్రత్యక్షమయ్యాయి. ఫలితంగా కొత్త ఎలక్ట్రిక్ ఎస్​యూవీ గ్లింప్స్ లభించింది. ఈ నేపథ్యంలో మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

yearly horoscope entry point

మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓకి ఈవీ టచ్​..

వాస్తవానికి మహీంద్రా ఎక్స్​యూవీ 300ని 3ఎక్స్​ఓగా మార్చి అప్డేటెడ్​ వర్షెన్​ని తీసుకొచ్చింది సంస్ధ. అప్పటి నుంచి ఈ ఎస్​యూవీకి రాబోయే ఈవీ వర్షెన్ గురించి ఊహాగానాలు కొనసాగుతున్నాయి. లాంచ్ అయిన తరువాత, మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్ఓ ఈవీ.. బ్రాండ్​కి కీలకంగా మారనుంది.

కొత్త మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్ఓ ఈవీ.. ఎస్​యూవీకి చెందిన ఐసీఈ వర్షెన్​ని పోలి ఉంటుంది. అయితే ఇందులో ఈవీ స్పెసిఫిక్ డిజైన్ ఎలిమెంట్స్ ఉంటాయి. గ్రిల్ స్థానంలో క్లోజ్డ్ ప్యానెల్, రీడిజైన్డ్​ ఎయిర్ డ్యామ్ ఇందులో ఉంటాయి. రివైజ్డ్​ టెయిల్​గేట్, కొత్త రేర్​ బంపర్​ కూడా ఇందులో ఉండొచ్చు. ఎక్స్​యూవీ 3ఎక్స్ఓ ఈవీ వెనుక భాగంలో రెండు వైపులా రోజ్ గోల్డ్ ఇన్సర్ట్​లను పొందుతుంది. ఇది ఏరో ఇన్సర్ట్​లతో కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్​తో రావచ్చు.

ఇతర ముఖ్యమైన డిజైన్ ఎలిమెంట్స్​లో ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. ఇది ఎడమ ఫ్రంట్ ఫెండర్​లో ఉంటుంది. ఎస్​యూవీ ఇంటీరియర్ ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఏదేమైనా, ఎక్స్​యూవీ 3ఎక్స్ఓ ఎలక్ట్రిక్​ కారు కొన్ని ఈవీ-నిర్దిష్ట మార్పులతో ఐసీఈ వర్షెన్ మాదిరిగానే డిజైన్ ఎలిమెంట్స్​తో వస్తుందని అంచనాలు ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్ఓ ఈవీలో 34.5 కిలోవాట్​, 39.4 కిలోవాట్​ బ్యాటరీ ప్యాక్లను కలిగి ఉంటుందని సమాచారం. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ప్రస్తుతం ఈ ఇది వరుసగా 375 కిలోమీటర్లు, 456 కిలోమీటర్ల రేంజ్​ని ఇస్తుంది. మహీంద్ర ఎక్స్​యూవీ400 ఈవీలో ఇదే బ్యాటరీ ప్యాక్స్​ ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం