Mahindra XEV 9e review: మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ రివ్యూ; ఈ కూపే మోడల్ ఎలక్ట్రిక్ ఎస్ యూవీ లో ఈ ఫీచర్స్ హైలైట్
మహీంద్రా లేటెస్ట్ గా మహీంద్రా ఎక్స్ఇవి 9ఇ ఎలక్ట్రిక్ కారును మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది కంప్లీట్ గా భారత్ లో తయారైన కూపే స్టైలింగ్ లో ఉన్న ఎలక్ట్రిక్ ఎస్ యూవీ. ఇది కొత్త ఈవి-ఓన్లీ సబ్-బ్రాండ్ ఎక్స్ఇవి నుంచి వచ్చిన ఫస్ట్ ప్రొడక్ట్. దీనిని బోర్న్ ఎలక్ట్రిక్ (బిఇ)అనే సబ్-బ్రాండ్ ద్వారా లాంచ్ చేశారు.
Mahindra XEV 9e review: మహీంద్రా ఎక్స్ఇవి 9ఇ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కొన్ని వారాల క్రితం భారతదేశంలో లాంచ్ అయింది. ఇది 2024 లో దేశంలో అతిపెద్ద ఆటోమోటివ్ లాంచ్ లలో ఒకటి. కూపే స్టైలింగ్ లో రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ ఎస్ యూవీ లాంచ్ ముందు నుంచీ చాలా మంది దృష్టిని ఆకర్షించింది. అందుకు ప్రధాన కారణాలు దాని డిజైన్ ఫిలాసఫీ, అధునాతన టెక్నాలజీ-ఎయిడెడ్ హై-ఎండ్ ఫీచర్లు, కాంపిటీటివ్ ప్రైస్. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ని మహీంద్రా రూ .21.90 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేశారు. దీనితో పాటు మహీంద్రా బిఇ 6ఇని కూడా లాంచ్ చేశారు. మహీంద్రా బిఇ 6ఇ పేరును ఆ తరువాత మహీంద్రా బిఇ 6 గా మార్చారు. ఇక్కడ మహీంద్రా ఎక్స్ఇవి 9ఇ సమగ్ర రివ్యూని మీ కోసం అందిస్తున్నాం.. చూడండి..
మహీంద్రా ఎక్స్ ఈవీ 9ఈ: డిజైన్
మహీంద్రా ఎక్స్ ఈవీ 9ఈ బోల్డ్ అండ్ ఫ్యూచరిస్టిక్ డిజైన్ తో వస్తుంది. మంచి స్టైలింగ్ తో పాటు ఎల్ఈడీ లైటింగ్ ప్యాకేజీ, ఫ్లేర్డ్ హుడ్, వీల్ ఆర్చ్ లు దీనికి ఆకర్షణీయమైన లుక్ ను, మంచి రోడ్ ప్రెజెన్స్ ను ఇస్తాయి. ఇంటీరియర్ డిజైన్ లేఅవుట్ కూడా అడ్వాన్స్డ్ ఫీచర్లతో ఫ్యూచరిస్టిక్ వైబ్ ను కలిగి ఉంటుంది. వెడల్పాటి ట్రిపుల్ స్క్రీన్ డిజిటల్ డిస్ప్లే, సౌకర్యవంతమైన సీట్లు, అద్భుతమైన ఆంబియెన్స్ తో మహీంద్రా ఎక్స్ఇవి 9ఈ అత్యంత సౌకర్యవంతమైన, ప్రీమియం ఎక్స్ పీరియన్స్ ను అందిస్తుంది. క్యాబిన్ లోపల తగినంత స్థలంతో పాటు, ఈ ఎస్ యూవీ 663-లీటర్ బూట్ స్టోరేజ్, 150-లీటర్ ఫ్రంక్ ను కూడా అందిస్తుంది.
మహీంద్రా ఎక్స్ ఈవీ 9ఈ: ఫీచర్లు
మహీంద్రా ఎక్స్ ఈవీ 9ఈలో మూడు హై క్వాలిటీ స్క్రీన్ల ను ఒకే ప్యానెల్ లో కలపడం, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇంటిగ్రేటెడ్ హెడ్ అప్ డిస్ ప్లే, ఇంటరాక్టివ్ లైట్లతో కూడిన ఇన్ఫినిటీ రూఫ్, డాల్బీ అట్మాస్ ఉన్న 16 స్పీకర్ల హర్మన్ కార్డాన్ సిస్టమ్, సెల్ఫీ కెమెరా, యూవీ ఫిల్టరేషన్ గ్లాస్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. సేఫ్టీ విషయానికొస్తే, లెవల్ 2 ఏడీఏఎస్, ఏడు ఎయిర్ బ్యాగులు, ఫెటీగ్ అలర్ట్ సిస్టమ్, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్స్, ఇఎస్పి, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, 360 డిగ్రీల కెమెరా, హిల్ హోల్డ్, హిల్ డిసెంట్, టిపిఎంఎస్ వంటి అధునాతన టెక్నాలజీ ఆధారిత ఫీచర్లు ఈ మహీంద్రా (mahindra & mahindra) ఎస్ యూవీలో ఉన్నాయి.
మహీంద్రా ఎక్స్ ఈవీ 9ఈ: పర్ఫార్మెన్స్
మహీంద్రా ఎక్స్ ఈవీ 9ఈ లో శక్తివంతమైన మోటార్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో లభిస్తుంది. ప్రస్తుతానికి 59 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ను మాత్రమే ప్రవేశపెట్టినప్పటికీ, మరింత శక్తివంతమైన 79 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ను త్వరలో విడుదల చేయనున్నారు. ఇది ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 500 కిలోమీటర్ల పరిధి అందిస్తుంది. ఈ మహీంద్రా ఎక్స్ ఈవీ 9ఈ ఎస్యూవీ (SUV) లోని ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్ 282 బిహెచ్పి గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 6.9 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.