Electric car : మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్​ కార్లు కొంటున్నారా? వెయిటింగ్​ పీరియడ్​పై షాకింగ్​ అప్డేట్​..-mahindra xev 9e and be 6 electric cars waiting period extends up to six months ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Electric Car : మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్​ కార్లు కొంటున్నారా? వెయిటింగ్​ పీరియడ్​పై షాకింగ్​ అప్డేట్​..

Electric car : మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్​ కార్లు కొంటున్నారా? వెయిటింగ్​ పీరియడ్​పై షాకింగ్​ అప్డేట్​..

Sharath Chitturi HT Telugu

మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఈ, హీఈ 6 ఎలక్ట్రిక్​ కార్లపై వెయిటింగ్​ పీరియడ్​పై బిగ్​ అప్డేట్​! ఈ రెండు వెహికిల్స్​ సొంతం చేసుకోవాలంటే 6 నెలలు వెయిట్​ చేయాల్సిందే!

మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఈ, బీఈ6 వెయిటింగ్​ పీరియడ్​..

మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల బిఈ 6, ఎక్స్​ఈవీ 9ఈ ఎలక్ట్రిక్ ఎస్​యూవీల డెలివరీలను ప్రారంభించింది. వాహన తయారీదారు గత కొన్ని రోజుల్లో 3,000 వాహనాలను వినియోగదారులకు అందజేసింది. కానీ ఈ మోడల్స్​కి వస్తున్న డిమాండ్​కి ఇది సరిపోలేదు. ఫలితంగా ఈ రెండు ఎలక్ట్రిక్​ కార్ల వెయిటింగ్​ పీరియడ్​ అమాంతం పెరిగిపోయింది.

మహీంద్రా ఎలక్ట్రిక్​ కార్ల వెయిటింగ్ పీరియడ్..

ఎక్స్​ఈవీ 9ఈ, బీఈ 6కి 6 నెలల వెయిటింగ్​ పీరియడ్​ ఉంది. ఈ విషయాన్ని సంస్థ కూడా ధ్రువీకరించింది. అత్యంత ప్రజాదరణ పొందిన ఆప్షన్​గా మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఈ (59 శాతం) నిలిచింది. బీఈ 6కి 41 శాతం డిమాండ్​ కనిపించింది మహీంద్రా తెలిపింది. ఇంకా, చాలా మంది వినియోగదారులు టాప్-స్పెక్ ప్యాక్ త్రీ వేరియంట్​ని ఎంచుకుంటున్నారు. డిమాండ్ పెరుగుతుండటంతో కొత్త ఎలక్ట్రిక్ ఎస్​యూవీల డెలివరీలను పెంచే పనిలో ఉన్నట్లు సంస్థ తెలిపింది. రూ.8,472 కోట్ల విలువైన 30,179 యూనిట్లకు ఎక్స్​ఈవీ 9ఈ, బీ 6 కలిపి బుకింగ్స్ వచ్చాయి.

మహీంద్రా బీఈ 6, ఎక్స్​ఈవీ 9ఈ స్పెసిఫికేషన్లు..

మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఈ, బీఈ 6 మోడల్స్​ రెండు బ్యాటరీ ప్యాక్​లతో అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు బ్యాటరీలను బీవైడీ నుంచి తెప్పించారు. వెనుక చక్రాలకు 228 బీహెచ్​పీ (59 కిలోవాట్లు), 282 బీహెచ్​పీ (79 కిలోవాట్) పవర్​ని జనరేట్​ చేసే రేర్ యాక్సిల్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్​తో ఇవి పనిచేస్తాయి. రెండు వెర్షన్లలో గరిష్ట టార్క్ 380 ఎన్ఎమ్​గా ఉంది. మహీంద్రా ఎక్స్ఇవీ 9ఈ 0-100 కిలోమీటర్ల వేగాన్ని 6.8 సెకన్లలో అందుకుంటుంది. స్పోర్టియర్ బీఈ 6 0.1 సెకన్ల వేగంతో నడుస్తుంది.

మహీంద్రా బీఈ 6, ఎక్స్​ఈవీ 9ఈ రేంజ్..

మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఈలోని 59 కిలోవాట్ల బ్యాటరీపై ఎఆర్ఎఐ సర్టిఫైడ్ రేంజ్​ని 542 కిలోమీటర్లుగా పేర్కొంది. అయితే 79 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ 656 కిలోమీటర్ల రేంజ్​ని అందిస్తుంది. బీఈ 6 ఒక్కసారి ఛార్జ్ చేస్తే 557 కిలోమీటర్లు (59 కిలోవాట్లు), 683 కిలోమీటర్లు (79 కిలోవాట్లు) అందిస్తుంది. భారత్ ఎన్​సీఏపీ క్రాష్ టెస్ట్ ఫలితాల్లో ఈ రెండు ఎస్​యూవీలకు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది.

బీఈ 6 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ ధర రూ.18.90 లక్షల నుంచి, ఎక్స్ఈవీ 9ఈ ధర రూ.21.90 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం