Mahindra Thar Roxx : థార్​లో లేని, థార్​ రాక్స్​లో కనిపించే 5 సూపర్​ ఫీచర్స్​ ఇవే..-mahindra thar roxx vs thar 5 features five door suv gets the other doesnt ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mahindra Thar Roxx : థార్​లో లేని, థార్​ రాక్స్​లో కనిపించే 5 సూపర్​ ఫీచర్స్​ ఇవే..

Mahindra Thar Roxx : థార్​లో లేని, థార్​ రాక్స్​లో కనిపించే 5 సూపర్​ ఫీచర్స్​ ఇవే..

Sharath Chitturi HT Telugu
Aug 10, 2024 10:20 AM IST

3 డోర్​ మహీంద్రా థార్​లో లేని ఐదు కొత్త ఫీచర్స్​ 5 డోర్​ థార్​ రాక్స్​లో కనిపించబోతున్నాయి. ఇవి చాలా అగ్జైటింగ్​గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ 5 కొత్త ఫీచర్ల గురించి ఇక్కడ తెలుసుకోండి..

మహీంద్రా థార్​ రాక్స్​లో కొత్త ఫీచర్లు..
మహీంద్రా థార్​ రాక్స్​లో కొత్త ఫీచర్లు..

ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో 5 డోర్​ మహీంద్రా థార్​ రాక్స్​ లాంచ్​కు రెడీ అవుతోంది. స్టాండర్డ్​ 3 డోర్​ థార్​కు మార్కెట్​లో క్రేజీ డిమాండ్​ ఉన్న నేపథ్యంలో కొత్త థార్​ రాక్స్​పై భారీ అంచనాలు ఉన్నాయి. మహీంద్రా థార్ రాక్స్ భారతదేశంలో స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15) న విడుదల కానుంది. ఈ సంవత్సరం మహీంద్రా నుంచి ఇది అతిపెద్ద లాంచ్ కాబోతోంది. అంతేకాదు ఈ ఏడాది మొత్తంలో మచ్​ వైటెడ్​ వెహికిల్​ లాంచ్​లలో ఇదొకటి. థార్ రాక్స్ ఎలా ఉంటుంది, ఫీచర్లు, ఇంజిన్ పరంగా ఇది ఏం అందిస్తుంది, మరీ ముఖ్యంగా దాని ధర ఎంత అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో 5 డోర్​ థార్​ రాక్స్​ని స్టాండర్డ్​ థార్​తో పోల్చి, కొత్తగా వచ్చే ఐదు ఫీచర్స్​పై ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోండి..

మహీంద్రా థార్ రాక్స్ ఫీచర్లు: వెంటిలేటెడ్ సీట్లు..

లాంచ్​కి ముందే మహీంద్రా థార్​ రాక్స్​కి సంబంధించిన టీచర్​, ఫొటోలను సంస్థ రివీల్​ చేస్తూ వస్తోంది. వాటి ద్వారా పలు కీలక విషయాలు తెలుస్తున్నాయి. ఐకానిక్ రగ్డ్ ఎస్​యూవీ సామర్థ్యాన్ని పెంచడానికి కార్ల తయారీదారు మరిన్ని సౌకర్యాలను జోడించడానికి ఆసక్తిగా ఉందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా టీజర్ వీడియోలో ప్రత్యేకంగా నిలిచిన వాటిలో వెంటిలేటెడ్​ సీట్లు ఉన్నాయి. మాస్ మార్కెట్ వాహనాల్లో వెంటిలేటెడ్ సీట్లు ఇటీవల ప్రజాదరణ పొందాయి. ఇప్పుడు అన్ని సెగ్మెంట్లలో కార్లలో ఉంటున్నాయి. కానీ థార్ రాక్స్ ఉన్న సెగ్మెంట్​లో వెంటిలేటెడ్​ సీట్స్​ ఉండటం ఇదే తొలిసారి కావడం విశేషం.

మహీంద్రా థార్ రాక్స్ ఫీచర్లు: ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్..

మహీంద్రా థార్ రాక్స్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టెమ్​తో వస్తుంది. మూడు డోర్ల థార్ మేన్యువల్ క్లైమేట్ కంట్రోల్​తో వస్తుంది. కాబట్టి, వ్యక్తి ఫ్యాన్ వేగంతో పాటు ఉష్ణోగ్రతను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది.

మహీంద్రా థార్ రాక్స్ ఫీచర్లు: హార్మన్ కార్డన్ స్పీకర్స్..

మహీంద్రా థార్ రాక్స్ హార్మన్ కార్డన్ స్పీకర్ సిస్టెమ్​ను ఉపయోగిస్తోంది. ఇదే యూనిట్ ఇటీవల లాంచ్ చేసిన మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్ ఓలో కూడా ఉంది.

మహీంద్రా థార్ రాక్స్ ఫీచర్లు: పానోరమిక్ సన్​రూఫ్​..

థార్ రాక్స్ పనోరమిక్ సన్ రూఫ్​తో వస్తుంది. ఇది క్యాబిన్​కు చాలా వెంటిలేషన్​ని ఇస్తుంది. 3-డోర్ల థార్​లో పానోరమిక్ సన్​రూఫ్ లేదు. దీనికి ఎలక్ట్రిక్ సన్​రూఫ్ కూడా లేదు.

మహీంద్రా థార్ రాక్స్ ఫీచర్లు: వెనుక భాగంలో బెంచ్ సీట్లు..

మూడు డోర్ల థార్ వెనుక భాగంలో రెండు వేరువేరు సీట్లతో వస్తుంది. అయితే స్కార్పియో ఎన్​లో మనం చూసినట్లుగా థార్ రాక్స్​కు సరైన బెంచ్ సీటు లభిస్తుంది.

ఇక త్వరలో లాంచ్​ కాబోతున్న మహీంద్రా థార్​ రాక్స్​ ఇతర ఫీచర్స్​, వేరియంట్లు, వాటి ధరలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఆగస్ట్​ 15 నాటికి వీటిపై ఓ క్లారిటీ వస్తుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

సంబంధిత కథనం