మహీంద్రా స్కార్పియో ఎన్ Vs మహీంద్రా ఎక్స్‌యూవీ700.. ఈ రెండు ఎస్‌యూవీలలో ఏది బెస్ట్?
Mahindra Scorpio N Vs Mahindra XUV700 : మహీంద్రా స్కార్పియో ఎన్, మహీంద్రా XUV700 ఎస్‌యూవీ రెండూ ఉత్తమమైన కార్లు. ఈ రెండు ఎస్‌యూవీలలో ఏది కొనాలో అర్థం కావడం లేదా? అయితే వీటి గురించి వివరాలు కచ్చితంగా తెలుసుకోండి.

మీరు త్వరలో కారు కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే మీ కోసం మార్కెట్‌లో మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. మహీంద్రా కార్లలో మీరు వెయిట్ చేస్తున్న వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో మహీంద్రా స్కార్పియే ఎన్, మహీంద్రా ఎక్స్‌యూవీ700 గురించి ఆలోచించవచ్చు. ఈ రెండు కార్ల వివరాలు చూద్దాం..
ఫీచర్లు
మహీంద్రా స్కార్పియో ఎన్ సింగిల్-పాన్ సన్‌రూఫ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో 8-అంగుళాల టచ్‌స్క్రీన్, 12-స్పీకర్ సోనీ సౌండ్ సిస్టమ్, మల్టీ-ఇన్ఫో డిస్‌ప్లేతో అనలాగ్ డయల్స్, 6-వే పవర్డ్ డ్రైవర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటో-డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్‌వ్యూ మిర్రర్ (IRVM), రియర్ వెంట్‌లతో కూడిన డ్యూయల్-జోన్ ఆటో ఏసీ, ఆటోమేటిక్ హెడ్‌లైట్లు, రెయిన్-సెన్సింగ్ వైపర్లు వంటి ఫీచర్లతో వస్తుంది.
ఎక్స్‌యూవీ700లో పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 6-వే పవర్డ్ సీట్లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 12-స్పీకర్ ఆడియో సిస్టమ్, అలెక్సా కనెక్టివిటీ, వైర్‌లెస్ ఛార్జర్, 70 కనెక్ట్ చేసిన ఫీచర్లు ఉన్నాయి.
పవర్‌ట్రెయిన్
మహీంద్రా స్కార్పియో ఎన్ రెండు ఇంజన్ ఆప్షన్స్‌తో అమ్ముడవుతోంది. 2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. దాని డీజిల్ ఇంజిన్‌లో 2డబ్ల్యూడీ, 4డబ్ల్యూడీ సెటప్ ఆప్షన్స్ రెండూ అందుబాటులో ఉన్నాయి. దీని గరిష్ట మైలేజ్ 16.23కేఎంపీఎల్.
ఎక్స్‌యూవీ700 లో రెండు ఇంజన్లు 2-లీటర్ టర్బో-పెట్రోల్, 2.2-లీటర్ డీజిల్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. దీని టాప్-స్పెక్ ఏఎక్స్7, ఏఎక్స్7 L ట్రిమ్‌లు డీజిల్ ఆటోమేటిక్ పవర్‌ట్రెయిన్‌తో ఐచ్ఛిక ఆల్-వీల్-డ్రైవ్ వ్యవస్థను కూడా పొందుతాయి. ఈ ఎస్‌యూవీ గరిష్టంగా 17 కేఎంపీఎల్ మైలేజీని ఇస్తుంది.
సేఫ్టీ చూస్తే..
మహీంద్రా స్కార్పియో ఎన్ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్(ESC), ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, హిల్ హోల్డ్, హిల్ డీసెంట్ కంట్రోల్, ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్, అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి భద్రతా లక్షణాలతో వస్తుంది.
ఎక్స్‌యూవీ700 ఏడు ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్-కీపింగ్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి అనేక సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది.
ధరలు
ఈ రెండు ఎస్‌యూవీలు ఒకే ప్రారంభ ధరను కలిగి ఉన్నాయి. మహీంద్రా స్కార్పియో ఎన్ ధర రూ. 13.99 లక్షల నుండి ప్రారంభమై రూ. 24.69 లక్షల వరకు ఉంటుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ700 ధర రూ. 13.99 లక్షల నుండి ప్రారంభమై టాప్ మోడల్ ధర రూ. 25.74 లక్షల వరకు ఉంది. ఈ ధరలన్నీ ఎక్స్-షోరూమ్ అని గుర్తుంచుకోండి. ఈ రెండు ఎస్‌యూవీల్లో వేరియంట్‌ను బట్టి సీటింగ్ కెపాసిటీలో మార్పు ఉంటుంది.
సంబంధిత కథనం