భారత దేశంలో అడాస్‌తో కూడిన స్కార్పియో ఎన్ ఎస్‌యూవీని మహీంద్రా అండ్ మహీంద్రా ఎట్టకేలకు లాంచ్ చేసింది. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 21.35లక్షలు. ఫలితంగా ఇప్పుడు మహీంద్రా స్కార్పియో ఎన్ టాప్ ఎండ్ వేరియంట్ జెడ్8ఎల్ 10 లెవల్ 2 అడాస్ ఫీచర్స్‌తో వస్తోంది. అంతేకాదు, ఈ ఎస్‌యూవీలో సరికొత్త వేరియంట్‌ని సైతం లాంచ్ చేసింది సంస్థ. దాని పేరు జెడ్8ఎల్. ఎక్స్‌షోరూం ధర రూ. 20.29 లక్షలు. పూర్తి వివరాల్లోకి వెళితే..
స్కార్పియో-ఎన్ జెడ్8ఎల్ వేరియంట్ ఆరు, ఏడు సీట్ల ఆప్షన్లలో లభిస్తుంది. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు కూడా ఉన్నాయి. ఇంజిన్ విషయానికి వస్తే, 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ లేదా 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో ఇది వస్తుంది. ఈ వేరియంట్ 2డబ్ల్యూడీ (టూ-వీల్ డ్రైవ్), 4x4 (ఫోర్-వీల్ డ్రైవ్) వెర్షన్లలో అందుబాటులో ఉంది.
ఈ ఎస్‌యూవీలోని జెడ్8ఎల్ వేరియంట్‌లో లెవల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ సూట్ ఉంటుంది. ఇందులో 10 ఫీచర్లు ఉన్నాయి:
వీటితో పాటు, స్కార్పియో ఎన్ అడాస్‌లో ప్రత్యేకమైన ఫీచర్లుగా స్పీడ్ లిమిట్ అసిస్ట్ (వేగ పరిమితిని సూచిస్తుంది) ఫ్రంట్ వెహికల్ స్టార్ట్ అలర్ట్ (ముందున్న వాహనం కదలడం ప్రారంభించినప్పుడు అలర్ట్) కూడా ఉన్నాయి.
ఇక కొత్తగా విడుదలైన స్కార్పియో-ఎన్ జెడ్8టీ వేరియంట్, జెడ్8 శ్రేణిలో మధ్యస్థంగా ఉంటుంది. ఇది అన్ని పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో (పెట్రోల్/డీజిల్, మాన్యువల్/ఆటోమేటిక్, 2WD/4x4) లభిస్తుంది.
ప్రీమియం ఫీచర్లు:
మహీంద్రా స్కార్పియో ఎన్ వేరియంట్లు- ఎక్స్‌షోరూం ధరలు
వేరియంట్ | పెట్రోల్ | డీజిల్ | ||||
---|---|---|---|---|---|---|
ఎంటీ | ఏటీ | 2డబ్ల్యూటీ ఎంటీ | 2డబ్ల్యూడీ ఏటీ | 4డబ్ల్యూడీ ఎంటీ | 4డబ్ల్యూడీ ఏటీ | |
Z8T | ₹20.29 lakh | ₹21.71 lakh | ₹20.69 lakh | ₹22.18 lakh | ₹22.80 lakh | ₹24.36 lakh |
Z8L (ADAS) 7-seater | ₹21.35 lakh | ₹22.77 lakh | ₹21.75 lakh | ₹23.24 lakh | ₹23.86 lakh | ₹25.42 lakh |
Z8L (ADAS) 6-seater | ₹21.60 lakh | ₹22.96 lakh | ₹22.12 lakh | ₹23.48 lakh | N/A | N/A |
స్కార్పియో ఎన్ ఎస్‌యూవీ రెండు ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది:
2.0-లీటర్ ఎంస్టాలియన్ టర్బో-పెట్రోల్ ఇంజిన్: ఇది 200 బీహెచ్‌పి శక్తిని, 380 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
2.2-లీటర్ ఎంహాక్ డీజిల్ ఇంజిన్: ఈ డీజిల్ ఇంజిన్ రెండు వేర్వేరు ట్యూన్‌లలో లభిస్తుంది, శక్తి ఉత్పత్తిలో తేడాలు ఉంటాయి.
జెడ్2 మోడల్‌లో 130 బీహెచ్‌పి శక్తిని, 300 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
Z4, అంతకంటే ఎక్కువ వేరియంట్‌లలో ఇది 172 బీహెచ్‌పి శక్తిని, 400 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
ఈ ఎస్‌యూవీలో 4x4 వేరియంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి 4XPLOR టెర్రైన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో వస్తాయి. అయితే, ఈ 4x4 ఆప్షన్లు డీజిల్ మోడళ్లకు మాత్రమే పరిమితం.
సంబంధిత కథనం