Best selling cars : భారతీయులు ఎక్కువగా కొంటోంది ఈ కంపెనీ కార్లే- రికార్డు స్థాయిలో సేల్స్​..!-mahindra records highest ever sales in october 24 see full details inside ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Selling Cars : భారతీయులు ఎక్కువగా కొంటోంది ఈ కంపెనీ కార్లే- రికార్డు స్థాయిలో సేల్స్​..!

Best selling cars : భారతీయులు ఎక్కువగా కొంటోంది ఈ కంపెనీ కార్లే- రికార్డు స్థాయిలో సేల్స్​..!

Sharath Chitturi HT Telugu
Nov 02, 2024 01:05 PM IST

Best selling cars : పండగ సీజన్​లో మహీంద్రా అండ్​ మహీంద్రా దుమ్మురేపింది! ఎన్నడూ లేని విధంగా సేల్స్​ చేసింది ఈ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ!

పండగ సీజన్​లో అదిరిపోయే సేల్స్​..
పండగ సీజన్​లో అదిరిపోయే సేల్స్​..

దేశీయ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, పండగ సీజన్​లో బంపర్​ హిట్​ కొట్టింది! అక్టోబర్ 2024లో రికార్డు స్థాయి అమ్మకాలను సాధించింది. ఈ మేరకు అక్టోబర్​ సేల్స్​ డేటాని ప్రకటించింది. అక్టోబర్​లో ఎం అండ్​ ఎం మొత్తం వాహన అమ్మకాలు 96,648 యూనిట్లకు చేరుకున్నాయి. ఇయర్​ ఆన్​ ఇయర్​లో ఇది ఏకంగా 20 శాతం వృద్ధిని సూచిస్తుంది. ఈ మైలురాయిలో అత్యధికంగా 54,504 యూనిట్ల ఎస్​యూవీ అమ్మకాలు ఉన్నాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 25 శాతం పెరుగుదలను ఈ సెగ్మెంట్​ నమోదు చేసింది.

యుటిలిటీ వెహికిల్​ సెగ్మెంట్​ 54,504 యూనిట్ల దేశీయ అమ్మకాలను నమోదు చేసింది. ఇది అక్టోబర్ 2023 నుంచి 25 శాతం పెరుగుదలను సాధించింది! కమర్షియల్​ వెహికిల్స్​ మొత్తం 28,812 యూనిట్లు కాగా, ఎగుమతి గణాంకాలు 3,506 యూనిట్లుగా ఉన్నాయి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 89 శాతం వృద్ధిని చూపించింది.

థార్ రాక్స్ లాంచ్ ఈ విజయానికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. మొదటి 60 నిమిషాల్లో 1.7 లక్షల బుకింగ్స్ వచ్చాయి.

"అక్టోబర్​లో అత్యధికంగా 54504 వాహనాల అమ్మకాలు, 25 శాతం వృద్ధి, 20 శాతం వృద్ధితో 96648 ఎస్​యూవీల విక్రయం జరగడం సంతోషంగా ఉంది. థార్ రాక్స్ మొదటి 60 నిమిషాల్లో 1.7 లక్షల బుకింగ్​లను పొందడంతో ఈ నెల అద్భుతంగా ప్రారంభమైంది. పండగ సీజన్ అంతటా ఎస్​యూవీ పోర్ట్​ఫోలియో అంతటా సానుకూల వృద్ధి కొనసాగింది," అని ఎం అండ్ ఎం లిమిటెడ్ ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ వీజయ్ నక్రా అన్నారు.

వాస్తవానికి, థార్ రాక్స్​కి అధిక డిమాండ్ కారణంగా, థార్ 3-డోర్ల కోసం వెయిటింగ్ పీరియడ్ పడిపోయింది. మహీంద్రా కూడా ఉత్పత్తిని పెంచినందున 3 నెలల్లో 3-డోర్ థార్ డెలివరీని పొందవచ్చు.

టాప్, హార్డ్ టాప్ ఆప్షన్లలో లభించే పెట్రోల్ వెర్షన్​కు మూడు నెలల వెయిటింగ్ పీరియడ్, డీజిల్ వెర్షన్​కు రెండు నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంటుందని మహీంద్రా డీలర్లు చెబుతున్నారు. సాఫ్ట్-టాప్ కన్వర్టిబుల్ వెర్షన్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వేరియంట్ల కోసం మూడు నెలల వెయిటింగ్ పీరియడ్​ ఉంది. మహీంద్రా థార్ 4×2 వేరియంట్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ మోడళ్లకు ఒక నెల వెయిటింగ్ పీరియడ్ వరకు ఉంటుంది.

మరోవైపు, కస్టమర్ ఎంచుకున్న వేరియంట్​ని బట్టి థార్ రాక్స్ కోసం వెయిటింగ్ పీరియడ్ 18 నెలల వరకు ఉంది. థార్ రాక్స్ చాలా ప్రాచుర్యం పొందింది. ఎందుకంటే ఇది థార్ 3-డోర్ మిస్సింగ్స్​ నుంచి పాఠాలు నేర్చుకుని వచ్చిన మోడల్​ కాబట్టి దీనికి చాలా డిమాండ్​ కనిపిస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం