BE 6 XEV 9E bookings : మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కార్లకు సూపర్ క్రేజ్! తొలి రోజే భారీగా బుకింగ్స్..
Mahindra BE 6 bookings : ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా మహీంద్రా బీఈ 6, మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ ఎలక్ట్రిక్ వాహనాల బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. తొలిరోజే భారీగా బుకింగ్స్ సంపాదించుకున్నాయి.

ఊహించిందే జరుగుతోంది! దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి వస్తున్న రెండు కొత్త ఎలక్ట్రిక్ కార్లకు భారతీయుల నుంచి సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. వాలెంటైన్స్ డే నేపథ్యంలో మహీంద్రా బీఈ6, మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈల బుకింగ్స్‌ని సంస్థ ప్రారంభించగా.. ఈ రెండింటికీ మొదటి రోజే 30,179 బుకింగ్స్ దక్కాయి. ఫలితంగా ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల బుకింగ్ వాల్యూ రూ. 8,472 కోట్ల (ఎక్స్‌షోరూం ధర)కు చేరింది. ఈ 30,179 బుకింగ్స్‌లో 44శాతం మంది బీఈ 6ని ఎంచుకోగా, మిగిలిన 56శాతం మంది ఎక్స్ఈవీ 9ఈని బుక్ చేసుకున్నారు. అంతేకాదు, మొత్తం మీద 79శాతం బుకింగ్స్ టాప్ ఎండ్ వేరియంట్స్కే వెళ్లడం విశేషం.
మహీంద్రా బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ- ఎలా బుక్ చేసుకోవాలి?
'అన్లిమిట్ లవ్' అనే బ్రాండ్ థీమ్‌కి అనుగుణంగా మహీంద్రా తన కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈల బుకింగ్స్‌ని వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రారంభించింది. ఆసక్తిగల కొనుగోలుదారులు తయారీదారు అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించడం ద్వారా ఆన్లైన్లో లేదా ఆఫ్‌లైన్‌లో సమీపంలోని మహీంద్రా డీలర్షిప్షోరూమ్ని సందర్శించి వెహికిల్స్‌ని బుక్ చేసుకోవచ్చు.
పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ ఎస్యూవీ బీఈ 6 ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.19.4 లక్షలుగా ఉంది. ఇక ఎక్స్ఈవీ 9ఈ ప్రారంభ ధర రూ .22.4 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీనితో పాటు, మహీంద్రా టాప్-స్పెక్ వేరియంట్ల కోసం ఇతర సౌకర్యవంతమైన చెల్లింపు ప్రణాళికలను కూడా అందిస్తోంది.
మహీంద్రా బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ: పర్ఫార్మెన్స్, రేంజ్..
ఎక్స్ఈవీ 9ఈ, బీఈ 6 ఫీచర్లు, డిజైన్ భిన్నంగా ఉన్నప్పటికీ, అవి ఒకే పవర్ట్రైన్ని పంచుకుంటాయి. మహీంద్రా ఐఎన్జీఎల్ఓ ఆర్కిటెక్చర్ రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలను కలిగి ఉంది. అవి.. 59 కిలోవాట్ - 79 కిలోవాట్ల లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (ఎల్ఎఫ్పి) యూనిట్లు. ప్రారంభంలో, ఎక్స్ఈవీ 9ఈ, బీఈ 6ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు రెండూ 59 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ని అందిస్తాయి.
మహీంద్రా ప్రకారం.. బీఈ 6 175 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగించినప్పుడు కేవలం 20 నిమిషాల్లో 20 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. 59 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ రేంజ్‌ని ఇంకా చెప్పలేదు. 79 కిలోవాట్ల ప్యాక్ ఏఆర్ఏఐ టెస్టింగ్ ప్రకారం 682 కిలోమీటర్ల పరిధిని సాధిస్తుందని సంస్థ పేర్కొంది. చిన్న బ్యాటరీ 228 బీహెచ్పీ పవర్‌ని, పెద్ద 79 కిలోవాట్ల వర్షెన్ 278 బీహెచ్పీ పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా, రెండు బ్యాటరీ ఆప్షన్స్ 380 ఎన్ఎమ్ స్థిరమైన టార్క్‌ని ఉత్పత్తి చేస్తాయి.
మహీంద్రా బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ: డెలివరీ..
మహీంద్రా జోరు మీద ఉంది. ఇప్పటికే 2,281 యూనిట్ల ఎక్స్ఈవీ 9ఈ, బీ 6 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను తయారు చేసింది. వీటిల్లో 1,837 యూనిట్లను డిస్పాచ్ కూడా చేసేసింది. రానున్న రోజుల్లో డిమాండ్‌కి తగ్గట్టు ప్రొడక్షన్ చేసేందుకు రెడీ అవుతోంది.
ఇక రెండు కార్ల ప్యాక్ త్రీ వేరియంట్ డెలివరీలు 2025 మార్చ్ మధ్య నుంచి ప్రారంభం కానున్నాయి. ప్యాక్ త్రీ సెలెక్ట్, ప్యాక్ టూ డెలివరీలు వరుసగా జూన్ 2025, జులై 2025 నుంచి ప్రారంభమవుతాయి. ఎంట్రీ లెవల్ వేరియంట్లు అయిన వన్, వన్ అబౌవ్ల డెలివరీలు 2025 ఆగస్టులో ప్రారంభం కానున్నాయి.
సంబంధిత కథనం