Mahindra electric cars : మహీంద్రా బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను బుక్ చేశారా?
Mahindra electric cars : మహీంద్రా బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను బుక్ చేశారా? అయితే ఇది మీకోసమే! వీటి దెలివరీలు త్వరలోనే ప్రారంభంకానున్నాయి.
మహీంద్రా బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల డెలివరీ త్వరలో ప్రారంభం కానుంది. మార్చ్ 2025 మధ్య నాటికి రెండు ఎలక్ట్రిక్ వాహనాల డెలివరీలను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు కంపెనీ ఇంతకు ముందు ప్రకటించింది. ఈ ఎలక్ట్రిక్ వాహనాలను 2024 నవంబర్‌లో లాంచ్ చేశారు. బుకింగ్ ప్రారంభించిన తొలిరోజే 30 వేలకు పైగా ఆర్డర్లు వచ్చాయని కంపెనీ తెలిపింది. వీటిల్లో ఎక్స్ఈవీ 9ఈకి 56శాతం, బీఈ 6కి 44 శాతం బుకింగ్స్ వచ్చాయి. మహీంద్రా మొదటి రోజు రూ .8472 కోట్ల రిజిస్టర్డ్ బుకింగ్ వాల్యూను (ఎక్స్-షోరూమ్ ధర వద్ద) వసూలు చేసింది.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. మొదటి దశలో, అంటే మార్చ్ మధ్యలో, కంపెనీ రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల టాప్ స్పెక్ వెర్షన్లను (ప్యాక్ త్రీ) మాత్రమే అందించాలని యోచిస్తోంది! రెండు ఎస్‌యూవీల ప్యాక్ త్రీ సెలెక్ట్ వేరియంట్ డెలివరీలు జూన్ 2025 నుంచి ప్రారంభం కానుండగా, జులై 2025లో ఈ-ఎస్‌యూవీల ప్యాక్ టూ వేరియంట్ డెలివరీలు ప్రారంభం కానున్నాయి. బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ప్యాక్ వన్‌తో పాటు బీఈ 6 ప్యాక్ వన్ ఎబౌవ్ వేరియంట్ ఆగస్టు నుంచి డెలివరీ చేయనున్నారు.
మహీంద్రా బీఈ 6: ఫీచర్లు..
మహీంద్రా బీఈ 6 ట్విన్ స్క్రీన్ సెటప్‌ను కలిగి ఉంది. రెండూ 12.3 ఇంచ్ పరిమాణంలో ఉన్నాయి. వీటిల్లో ఒకటి ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, మరొకటి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ డిస్ప్లేలను ఫ్లోటింగ్ స్టైల్‌తో డాష్‌బోర్డ్‌పై ఉంచారు. టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, ప్రకాశవంతమైన లోగో, పెద్ద సన్‌రూఫ్ కూడా ఉన్నాయి. 16 స్పీకర్ల ఆడియో సిస్టమ్, ఆటోమేటిక్ పార్కింగ్ ఫంక్షన్, ఏడీఏఎస్ సూట్, 360 డిగ్రీల కెమెరా వంటి సౌకర్యాలు ఈ ఎస్‌యూవీలో ఉన్నాయి.
మహీంద్రా ఎక్స్ ఈవీ 9ఈ: ఫీచర్లు..
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈలో ట్రిపుల్ స్క్రీన్ సెటప్ ఉంది! ఇందులో మహీంద్రాకు చెందిన అడ్రినాక్స్ సాఫ్ట్‌వేర్‌తో నడిచే మూడు 12.3 ఇంచ్ స్క్రీన్లు ఉన్నాయి. ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డ్రైవర్ డిస్ప్లే కీలకం. ప్రకాశవంతమైన లోగో ఈ ఎస్యూవీ కోసం ట్విన్-స్పోక్ మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్‌ను అలంకరించింది. వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, 16 స్పీకర్ల ఆడియో సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ పార్కింగ్ అసిస్టెన్స్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఏడీఏఎస్) సూట్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.
మహీంద్రా బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ: స్పెసిఫికేషన్లు..
ఎక్స్ఈవీ 9ఈ, బీఈ 6 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల మధ్య ఫీచర్లు, డిజైన్ సెట్ భిన్నంగా ఉన్నప్పటికీ, పవర్ట్రెయిన్ ఒకేలా ఉంటుంది. మహీంద్రా ఐఎన్జిఎల్ఓ ఆర్కిటెక్చర్ రెండు వేర్వేరు బ్యాటరీ ప్యాక్ ఎంపికలను సపోర్ట్ చేస్తుంది. అవి 59 కిలోవాట్, 79 కిలోవాట్ యూనిట్లు. ఇవి లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (ఎల్ ఎఫ్ పీ) బ్యాటరీ ప్యాక్‌లు. రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు 175 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగించి 20 నిమిషాల్లో 20 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయగలవని మహీంద్రా పేర్కొంది.
మహీంద్రా బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ చిన్న 59 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో గరిష్టంగా 230 బీహెచ్పీ పవర్‌ని ఉత్పత్తి చేస్తాయి. పెద్ద 79 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో రెండు వాహనాలు 285 బీహెచ్పీ పవర్‌ని జనరేట్ చేస్తాయి.
సంబంధిత కథనం