Offers on Mahindra cars: మహీంద్రా కార్లపై ఏకంగా రూ. 3 లక్షల వరకు డిస్కౌంట్; ఏ మోడల్స్ పై అంటే..?
భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా మూడు-డోర్ల మహీంద్రా థార్ పై, అలాగే, ప్రస్తుతం డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉన్న ఆల్-ఎలక్ట్రిక్ మహీంద్రా ఎక్స్ యూ వీ 400 పై గణనీయమైన డిస్కౌంట్ లను ప్రకటించింది.
మహీంద్రా అండ్ మహీంద్రా వారి మూడు డోర్ల థార్ ను కానీ, వారి ఏకైక ఎలక్ట్రిక్ వేరియంట్ అయిన ఎక్స్ యూ వీ 400 ఈవీని కానీ కొనే ప్లాన్ లో ఉన్నారా? అయితే, ఇదే సరైన సమయం. ఇప్పుడు ఈ రెండు కార్లపై మహీంద్రా అండ్ మహీంద్రా అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ ను ప్రకటించింది. ఈ రెండు మోడల్స్ ప్రస్తుతం డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఇన్వెంటరీని క్లియర్ చేయడంతో పాటు మార్కెట్ వాటాను పెంచుకునే లక్ష్యంతో మహీంద్రా అండ్ మహీంద్రా ఈ డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది.
థార్ పై 1.5 లక్షల తగ్గింపు
ప్రముఖ ఆఫ్-రోడర్ అయిన 3 - డోర్ మహీంద్రా థార్, దాని అన్ని వేరియంట్లపై రూ. 1.50 లక్షల తగ్గింపును ప్రకటించింది. థార్ అధికారిక ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.35 లక్షల నుండి రూ. 17.60 లక్షల వరకు ఉంది. మహీంద్రా కొత్త వేరియంట్ థార్ రాక్స్ మార్కెట్లోకి రాకముందే మూడు-డోర్ల మోడల్ ఇన్వెంటరీని క్లియర్ చేయాలని మహీంద్రా సంస్థ భావిస్తోంది.
ఎక్స్ యూ వీ 400 పై..
థార్‌తో పాటు, మహీంద్రా తన ఏకైక ఎలక్ట్రిక్ ఆఫర్ అయిన మహీంద్రా ఎక్స్ యూ వీ 400 (XUV400) పై కూడా గణనీయమైన తగ్గింపును అందిస్తోంది. ఎక్స్ యూ వీ 400 రెండు వేరియంట్‌లపై రూ. 3 లక్షల డిస్కౌంట్ ను అందిస్తున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా (mahindra & mahindra) సంస్థ ప్రకటించింది. ఎక్స్ యూ వీ 400 EV అధికారిక ఎక్స్-షోరూమ్ ధర రూ. 16.74 లక్షల నుండి రూ. 17.69 లక్షల మధ్య ఉంటుంది. ముఖ్యంగా టాటా మోటార్స్ వంటి ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో మహీంద్రా పోటీతత్వాన్ని కొనసాగించేందుకు ఈ తగ్గింపు వ్యూహాత్మక చర్యగా చెప్పవచ్చు.
టాటా కూడా తగ్గించింది..
ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ప్రత్యక్ష పోటీదారుగా ఉన్న టాటా మోటార్స్ ఇటీవల తన నెక్సాన్ EVపై రూ. 1.20 లక్షల ధర తగ్గింపును ప్రకటించింది. ఆ తరువాత మళ్లీ ధరను పెంచింది. మహీంద్రా యొక్క ప్రస్తుత ఆఫర్‌లను ప్రభావితం చేసే కూపే లాంటి వాహనం టాటా Curvv EVని ప్రారంభించడంతో పోటీ మరింత తీవ్రమైంది.
థార్, ఎక్స్ యూ వీ 400 ఫీచర్స్
మహీంద్రా ఎక్స్ యూ వీ 400 (XUV400) రెండు బ్యాటరీ ఎంపికలతో రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్‌పై 456 కిమీల పరిధిని అందిస్తోంది. ఇది డ్యూయల్ 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, వైర్‌లెస్ కనెక్టివిటీ, అధునాతన భద్రతా ఫీచర్లు వంటి ఆధునిక ఫీచర్లతో వస్తుంది. మరోవైపు, మహీంద్రా థార్ మూడు ఇంజన్ ఎంపికలను అందిస్తుంది. క్రాల్ మోడ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ లాకింగ్ డిఫరెన్షియల్‌తో సహా ఆఫ్-రోడ్ పనితీరు కోసం రూపొందించిన అనేక రకాల ఫీచర్లను అందిస్తుంది.