Maharatna PSU company declares 30% dividend: డివిడెండ్ ప్రకటించిన మహారత్న కంపెనీ-maharatna psu company declares 30 dividend record date falling next week ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Maharatna Psu Company Declares 30% Dividend, Record Date Falling Next Week

Maharatna PSU company declares 30% dividend: డివిడెండ్ ప్రకటించిన మహారత్న కంపెనీ

HT Telugu Desk HT Telugu
Nov 19, 2022 09:04 PM IST

Maharatna PSU company declares 30% dividend: మహారత్న కంపెనీల్లో ఒకటైన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్(Power Finance Corporation Ltd) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ఫలితాలను విడుదల చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Maharatna PSU company declares 30% dividend: పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్(Power Finance Corporation Ltd).. మహారత్న కంపెనీల్లో ఒకటి. రూ. 32,974.62 కోట్ల మార్కెట్ విలువ ఉన్న లార్జ్ క్యాప్ కంపెనీ ఇది. ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో ఈ సంస్థ రాణిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Maharathna company: 2021 మహారత్న హోదా

ఈ ప్రభుత్వ రంగ సంస్థకు 2021 అక్టోబర్ లో మహారత్న హోదా ఇచ్చారు. విద్యుత్ రంగంలో ఫైనాన్స్ సర్వీస్ అందిస్తున్న మార్కెట్ లీడర్ ఈ సంస్థ. ఈ సంస్థ మార్కెట్ వాటా దాదాపు 20%. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్(Power Finance Corporation Ltd) తాజాగా ఈ ఆర్థిక సంవత్సరం Q2 ఫలితాలను విడుదల చేసింది.

Maharatna PSU company declares 30% dividend: 30% డివిడెండ్

Q2 ఫలితాలతో పాటు షేర్ హోల్డర్లకు 30% డివిడెండ్ ఇస్తున్నట్లు సంస్థ శనివారం ప్రకటించింది. ఇది ఈ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం ఇస్తున్న రెండో మధ్యంతర డివిడెండ్ ఇది. రూ. 10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ. 3 డివిడెండ్ ను ఇస్తున్నట్లు Power Finance Corporation Ltd ప్రకటించింది. డివిడెండ్ జారీకి నవంబర్ 25వ తేదీని రికార్డు డేట్ గా ప్రకటించింది. అలాగే, డిసెంబర్ 9 లోపు డివిడెండ్ షేర్ హోల్డర్ల ఖాతాల్లో జమ అవుతుందని వెల్లడించింది.

Rise in PAT: రూ. 5,229 కోట్లు

ఈ ఆర్థిక సంవత్సరం Q2 లో Power Finance Corporation Ltd అత్యధిక లాభాలను ఆర్జించింది. Q2లో సంస్థ నికర లాభాలు రూ. 5,229.39 కోట్లు అని సంస్థ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం Q2 తో పోలిస్తే.. ఇది 4.09% అధికం. గత Q2లో సంస్థ రూ. 5,023.42 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. అలాగే, ఈ Q2లో సంస్థ ఆదాయం రూ. 19,344.39 కోట్లు. గత Q2లో ఇది రూ. 19,267.75 కోట్లు.

PFC share value: షేరు విలువ

పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్(Power Finance Corporation Ltd) షేరు విలువ నవంబర్ 18, 2022 శుక్రవారం రూ. 124.65 వద్ద ముగిసింది. అంతకుముందు రోజు సంస్థ షేరు విలువ రూ. 123.05 వద్ద ముగిసింది. 2022లో ఈ సంస్థ షేరు 1.51% వరకు బలపడింది. 2022 ఆర్థిక సంవత్సరంలో షేరు హోల్డర్లకు సంస్థ రూ. 12 ను డివిడిండ్ గా అందించింది.

WhatsApp channel