Maha Kumbh 2025 : మహా కుంభమేళాలో 45 రోజుల్లో 30 కోట్లు సంపాదించిన కుటుంబం.. పన్ను ఎంత చెల్లించాలి?-mahakumbh 2025 boatman family earned 30 crore rupees in 45 days know how much income tax will pay ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Maha Kumbh 2025 : మహా కుంభమేళాలో 45 రోజుల్లో 30 కోట్లు సంపాదించిన కుటుంబం.. పన్ను ఎంత చెల్లించాలి?

Maha Kumbh 2025 : మహా కుంభమేళాలో 45 రోజుల్లో 30 కోట్లు సంపాదించిన కుటుంబం.. పన్ను ఎంత చెల్లించాలి?

Anand Sai HT Telugu

Maha Kumbh 2025 : ప్రయాగ్‌‌రాజ్‌‌లో ఓ కుటుంబం సంపాదన గురించి ఇప్పుడు ఎక్కువగా వైరల్ అవుతోంది. కుంభమేళాలో పడవలను నడపడం ద్వారా ఒక వ్యక్తి రూ.30 కోట్ల వరకు సంపాదించారు. దీనిపై ట్యాక్స్ ఎంత పడుతుంది?

ట్యాక్స్

ప్రయాగ్‌రాజ్‌లో 2025 మహా కుంభమేళా ముగిసింది. కోట్లాది మంది భక్తులు ఇక్కడ సంగమంలో స్నానాలు చేశారు. 45 రోజుల పాటు జరిగింది. ఇందులో ఉపాధికి సంబంధించిన అనేక విషయాలు బయటకు వచ్చాయి. కొంతమంది వేప పుల్లలు అమ్మడం ద్వారా, మరికొందరు టీ అమ్మడం ద్వారా చాలా డబ్బు సంపాదించారు. పడవలు నడిపే వ్యక్తి 45 రోజుల్లో రూ.30 కోట్లు సంపాదించిన కథ వెలుగులోకి వచ్చింది.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ విషయాన్ని తెలిపారు. మహా కుంభమేళా సందర్భంగా పడవలు ఉన్న ఓ కుటుంబం 130 పడవలను నడపడం ద్వారా 45 రోజుల్లో రూ.30 కోట్లు ఆదాయం చూసిందని చెప్పారు.

మొత్తం ఆదాయం గురించి మాట్లాడితే అది దీని కంటే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మొత్తం ఆదాయం అంటే పడవ నడపడానికి అయ్యే ఖర్చు, పడవ నడిపేవారి జీతం, ఇతర ఖర్చులు కూడా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో ఆదాయపు పన్ను ప్రకారం అన్ని ఖర్చులను తీసివేసిన తర్వాతే మొత్తం పొదుపు లెక్కిస్తారు. అంటే ఈ పొదుపు రూ. 30 కోట్ల కంటే తక్కువ లేదా ఎక్కువ ఉండవచ్చు.

పడవల యజమాని పొదుపు మొత్తం రూ.30 కోట్లు. ఇది కేవలం 45 రోజులు మాత్రమే. ఈ పొదుపును మొత్తం సంవత్సరానికి పొదుపుగా పరిగణిస్తే.. 30 శాతం చొప్పున ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇది కాకుండా పన్ను మొత్తంపై 4 శాతం సెస్ కూడా చెల్లించాలి.

మొత్తం పన్ను బాధ్యత గురించి మాట్లాడితే, రూ. 30 కోట్ల ఆదాయంపై 30శాతం పన్ను అంటే రూ.9 కోట్లు విధిస్తారు. ఈ పన్నుపై అతను 4శాతం సెస్సు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం దాదాపు రూ. 36 లక్షలు ఉంటుంది. ఈ కుటుంబం రూ.30 కోట్ల ఆదాయంపై మొత్తం రూ.9.36 కోట్ల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొన్ని మినహాయింపులు, తగ్గింపులను కూడా పొందవచ్చు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

సంబంధిత కథనం