Madhusudan Masala IPO : 71శాతం ప్రీమియంతో మధుసూదన్​ మసాలా ఐపీఓ బంపర్​ లిస్టింగ్​..!-madhusudan masala ipo shares open at 71 premium on nse sme ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Madhusudan Masala Ipo : 71శాతం ప్రీమియంతో మధుసూదన్​ మసాలా ఐపీఓ బంపర్​ లిస్టింగ్​..!

Madhusudan Masala IPO : 71శాతం ప్రీమియంతో మధుసూదన్​ మసాలా ఐపీఓ బంపర్​ లిస్టింగ్​..!

Sharath Chitturi HT Telugu
Sep 26, 2023 11:22 AM IST

Madhusudan Masala share price : ఎన్​ఎస్​ఈ ఎస్​ఎంఈలో మధుసూదన్​ మసాలా ఐపీఓ బంపర్​ లిస్టింగ్​ జరిగింది. 71శాతం ప్రీమియంతో ఈ కంపెనీ స్టాక్​ మార్కెట్​లోకి అడుగుపెట్టింది.

71శాతం ప్రీమియంతో మధుసూదన్​ మసాలా ఐపీఓ బంపర్​ లిస్టింగ్​..!
71శాతం ప్రీమియంతో మధుసూదన్​ మసాలా ఐపీఓ బంపర్​ లిస్టింగ్​..! (www.madhusudanmasala.com)

Madhusudan Masala share price : స్టాక్​ మార్కెట్​లో మరో ఐపీఓ హిట్​ కొట్టింది. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో మధుసూదన్​ మసాలా స్టాక్​కు బంపర్​ లిస్టింగ్​ లభించింది. ఏకంగా 71.43శాతం ప్రీమియంతో ఎన్​ఎస్​ఈ ఎస్​ఎంఈలో ఓపెన్​ అయ్యింది ఈ ఐపీఓ. ఇష్యూ ప్రైజ్​ రూ. 70గా ఉండగా.. రూ. 120 వద్ద లిస్టింగ్​ ప్రైజ్​ నమోదైంది.

ఎస్​ఎంఈ ఐపీఓ వివరాలు..

సెప్టెంబర్​ 18న ఈ మధుసూదన్​ మసాలా సబ్​స్క్రిప్షన్​ ఓపెన్​ అయ్యింది. సెప్టెంబర్​ 21తో ముగిసింది. మొత్తం మీద ఐపీఓకు 444.27 రెట్లు సబ్​స్క్రిప్షన్​ లభించింది. ఇక రీటైల్​ పోర్షన్ 592.73 రెట్లు ఓవర్​ సబ్​స్క్రైబ్​ అయ్యింది.

Madhusudan Masala IPO : ఈ మధుసూదన్​ మసాలా ఐపీఓ ప్రైజ్​ బ్యాండ్​ రేంజ్​ ఒక్క షేరుకు రూ. 66- రూ. 70. ఫేస్​ వాల్యూ రూ. 10. ఈ ఐపీఓ లాట్​ సైజ్​ 2000 ఈక్విటీ షేర్లు. ఈ ఐపీఓ విలువ రూ. 23.80 కోట్లు. పూర్తిగా ఫ్రెష్​ ఇష్యూనే. ఐపీఓ ద్వారా పోగుచేసిన నిధులను వర్కింగ్​ క్యాపిటల్​ అవసరాలకు ఉపయోగించుకోవాలని సంస్థ చూస్తోంది.

ఇదీ చూడండి:- ఐపీఓలు అలాట్​ అవ్వట్లేదా? ఈ ట్రిక్​ పాటించండి..

మధుసూదన్​ మసాలా స్టాక్స్​ బంపర్​ లిస్టింగ్​ను గ్రే మార్కెట్​ ప్రీమియం అంచనా వేస్తూ వచ్చింది. 87.14శాతం ప్రీమియంతో ఇది స్టాక్​ మార్కెట్​లో లిస్ట్​ అవుతుందని జీఎంపీ సూచించింది. కాగా.. కొన్ని రోజులుగా మార్కెట్​లో నెలకొన్న ఫ్లాట్​నెస్​తో 71శాతం ప్రీమియంతో లిస్ట్​ అయ్యింది.

Madhusudan Masala IPO listing : సాధారణ ఐపీఓలకు.. ఎస్​ఎంఈ ఐపీఓలకు చాలా తేడా ఉంటుంది. ఈ తరహా ఐపీఓల్లో ఎక్కువ మొత్తంలో ఇన్​వెస్ట్​ చేయాల్సి ఉంటుంది. స్మాల్​ అండ్​ మీడియం మార్కెట్​ క్యాపిటల్​ ఉన్న కంపెనీలు ఇక్కడ డబ్బులు రైజ్​ చేస్తూ ఉంటాయి.  ఇందులో ఇన్​స్టిట్యూషనల్​ ప్లేయర్స్​ ఎక్కువగా పాల్గొంటారు. ఎస్​ఎంఈ ఐపీఓలు బీఎస్​సీ, ఎన్​ఎస్​ఈలో లిస్ట్​ అవ్వవు. వీటికి ఉన్న ఎస్​ఎంఈ వేదికల్లో లిస్ట్​ అవుతాయి.

2023 మార్చ్​31తో ముగిసిన ఆర్థిక ఏడాదిలో ఈ కంపెనీ.. రూ. 575.89లక్షల నెట్​ ప్రాఫిట్​ను నమోదు చేసింది. ఈ సంస్థ రెవెన్యూ రూ. 12,750.57లక్షలుగా ఉంది. ఎబిట్​డా మార్జిన్​ 8.66శాతంగా ఉంది. ప్రాఫిట్​ మార్జిన్​ 4.53శాతంగా మారింది.

సంబంధిత కథనం