Pravaig Defy electric SUV : మేడ్​ ఇన్​ ఇండియా ‘డిఫై’ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ.. లాంచ్​కు సిద్ధం!-made in india pravaig defy electric suv to be revealed on 25th november all you need to know ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Made In India Pravaig Defy Electric Suv To Be Revealed On 25th November, All You Need To Know

Pravaig Defy electric SUV : మేడ్​ ఇన్​ ఇండియా ‘డిఫై’ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ.. లాంచ్​కు సిద్ధం!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 18, 2022 01:54 PM IST

Pravaig Defy electric SUV : మేడ్​ ఇన్​ ఇండియా డిఫై ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని త్వరలోనే రివీల్​ చేయనుంది ప్రవాగ్​. ఇది ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న ఇతర ఈవీలకు గట్టి పోటీనిచ్చే విధంగా కనిపిస్తోంది.

మేడ్​ ఇన్​ ఇండియా ‘డిఫై’ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ.. లాంచ్​కు సిద్ధం!
మేడ్​ ఇన్​ ఇండియా ‘డిఫై’ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ.. లాంచ్​కు సిద్ధం! (HT AUTO)

Pravaig Defy electric SUV : బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్​ సంస్థ ప్రవాగ్​.. సరికొత్త ఎలక్ట్రిక్​ ఎస్​యూవీతో భారతీయుల ముందుకు రానుంది. డిఫై ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని ఈ నెల 25న రివీల్​ చేయనుంది ఈ సంస్థ. ఈ సంస్థ నుంచి వస్తున్న ఫ్లాగ్​షిప్​ వెహికిల్​ ఇది. ఈ వాహనం రేంజ్​, పర్ఫార్మెన్స్​పై మార్కెట్​లో భారీ అంచనాలే ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

డిఫై ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని గత కొంతకాలంగా టీజ్​ చేస్తూ వస్తోంది ప్రవాగ్​. ఇదొక 5 సీటర్​ ప్రిమియం ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ. వాస్తవానికి డిఫై ఎస్​యూవీ.. ప్రవాగ్​కు తొలి ఎలక్ట్రిక్​ వాహనం కాదు. రెండేళ్ల క్రితం.. ఎక్స్​టింక్షన్​ ఎంకే1తో భారత్​ మార్కెట్​లోకి అడుగుపెట్టింది. ఇదొక టూ డోర్​, 4 సీటర్​ ఎలక్ట్రిక్​ సెడాన్​ కారు. కానీ ఇది కమర్షియల్​గా క్లిక్​ అవ్వలేదు. ఇక ఇప్పుడు డిఫై ఎలక్ట్రిక్​ ఎస్​యూవీతో మరోమారు ప్రజల ముందుకు రానుంది ప్రవాగ్​. ఈసారి ప్రీమియం ఎస్​యూవీతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

ఫీచర్స్​.. అదుర్స్​..!

ప్రవాగ్​ రివీల్​ చేసిన సమాచారం ప్రకారం.. డిఫై ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 504కి.మీల దూరం ప్రయాణించవచ్చు. ఇదే నిజమైతే.. ప్రస్తుతం ఇండియాలో ఎక్కువ దూరం(ఒక్కసారి ఛార్జ్​ చేస్తే) ప్రయాణించగలిగే ఈవీల జాబితాలోకి చేరిపోతుంది ఈ డిఫై ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ. అంతేకాకుండా.. ఈ బ్యాటర్​ 30 నిమిషాల్లో 80శాతం ఛార్జ్​ అయిపోతుందని సంస్థ చెబుతోంది. అంటే ఈ ఈవీకి డీసీ ఫాస్ట్​ ఛార్జింగ్​ సిస్టెమ్​ ఉన్నట్టు స్పష్టమవుతోంది.

Defy electric SUV launch : ఈ డిఫై ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ.. 420హెచ్​పీ పవర్​, 620 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది ప్రవాగ్​ చెబుతోంది. ఇది వోల్వో ఎక్స్​సీ40 రీఛార్జ్​, కియా ఈవీ6, ఆడీ ఈ-ట్రాన్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీతో సమానంగా ఉండటం గమనార్హం. దీని టాప్​ స్పీడ్​.. 210కేఎంపీఎల్​ అని సంస్థ చెబుతోంది. 0-100 కేఎంపీహెచ్​ను కేవలం 4.9సెకన్లలో ఈ ఈవీ అందుకుంటుందని సంస్థ చెప్పడం విశేషం. ఫలితంగా ఈ ఈవీపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈ డిఫై ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలో వైఫ్​, 15ఇంచ్​ డెస్క్​, 220వీ సాకెట్స్​, 2.5ఎయిర్​ ఫిల్టర్​తో కూడిన ఎయిర్​ క్వాలిటీ ఇండెక్స్​, ప్రీమియం సౌండ్​ సిస్టెమ్​, యూఎస్​బీ సాకెట్​, వయర్​లెస్​ ఛార్జింగ్​ వంటి ఫీచర్స ఉన్నట్టు తెలుస్తోంది. కాగా.. ఫీచర్స్​పై సంస్థ మరింత స్పష్టతను ఇవ్వాల్సి ఉంది.

Defy electric SUV price : ఇండియాలో.. డిఫై ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ ధరకు సంబంధించిన వివరాలను కూడా ప్రవాగ్​ వెల్లడించాల్సి ఉంది.

WhatsApp channel