Smartphone Discount : కొత్త ఫోన్ కొనాలనుకునేవారికి లక్కీ ఛాన్స్.. భారీ డిస్కౌంట్‌తో 108 కెమెర్ ఉన్న స్మార్ట్‌ఫోన్-lucky chance for those who want to buy a new phone poco m6 plus 5g gets huge discount know 108mp camera phone details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Smartphone Discount : కొత్త ఫోన్ కొనాలనుకునేవారికి లక్కీ ఛాన్స్.. భారీ డిస్కౌంట్‌తో 108 కెమెర్ ఉన్న స్మార్ట్‌ఫోన్

Smartphone Discount : కొత్త ఫోన్ కొనాలనుకునేవారికి లక్కీ ఛాన్స్.. భారీ డిస్కౌంట్‌తో 108 కెమెర్ ఉన్న స్మార్ట్‌ఫోన్

Anand Sai HT Telugu

Smartphone Discount : తక్కువ ధరతో స్మార్ట్‌ఫోన్ కొనాలి అనుకునేవారికి మంచి అవకాశం వచ్చింది. భారీ డిస్కౌంట్‌తో పోకో ఎం6 ప్లస్ ఫోన్ లభిస్తుంది. ఆ వివరాలపై ఓ లుక్కేయండి..

పోకో స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్

తక్కువ ధరకే పోకో ఎం6 ప్లస్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. 108 మెగాపిక్సెల్ కెమెరా, 6.79 అంగుళాల పెద్ద డిస్ ప్లే, 5030mAh పవర్ ఫుల్ బ్యాటరీ లభిస్తుంది. అద్భుతమైన ఫీచర్లతో పోకో ఎం6 ప్లస్ 5జీ ఫోన్ ధరను తగ్గించింది. ఫ్లిప్‌కార్ట్‌లో 30 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలేంటో చూద్దాం..

కంపెనీ పోకో ఎం6 ప్లస్ 5జీ ఫోన్‌ను రెండు స్టోరేజ్ ఆప్షన్‌లలో అందిస్తుంది. మిస్టీ లావెండర్, ఐస్ సిల్వర్, గ్రాఫైట్ బ్లాక్ కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు. ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఏఈ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఫోన్‌లో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జర్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కూడా కలిగి ఉంది. 12 వేల లోపు కొత్త ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటే ఇది బెటర్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

పోకో ఎం6 ప్లస్ 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌పై కంపెనీ 30 శాతం తగ్గింపును అందిస్తోంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై ఈ ఫోన్ కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం తగ్గింపు లభిస్తుంది. 6జీబీ ప్లస్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ని డిస్కౌంట్‌తో ఫ్లిప్‌కార్ట్‌లో రూ.11,499కి కొనుగోలు చేయవచ్చు. దీనిపై 28 శాతం డిస్కౌంట్. 8జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.12,499కి అందుబాటులో ఉంది.

పోకో ఎం6 ప్లస్ 5జీ మొబైల్ 6.79-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 2400 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 550 నిట్స్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణను కలిగి ఉంది.

క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఏఈ ప్రాసెసర్‌తో కంపెనీ పోకో ఎం6 ప్లస్ 5జీ ఫోన్‌ను విడుదల చేసింది. ఇది గ్రాఫిక్స్ కోసం అడ్రినో A613 GPU అందుబాటులో ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా సరికొత్త హైపర్ ఓఎస్‌లో పని చేస్తుంది.

పోకో ఎం6 ప్లస్ 5జీ మొబైల్ 108-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంది. 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. 5030mAh బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 33W ఫాస్ట్ ఛార్జర్ సౌకర్యంతో వస్తుంది. దుమ్ము, స్ప్లాష్ నుండి రక్షణ కోసం ఐపీ 53 రేటింగ్‌ను కలిగి ఉంది.