LPG gas price in Hyderabad : అలర్ట్.. గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు!
LPG gas price increased : గ్యాస్ సిలిండర్ ధరలను పెంచాయి ఓఎంసీలు. మార్చ్ 1 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. హైదరాబాద్లో ఇప్పుడు ధర ఎంతంటే..
LPG gas price march 2024 : ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు).. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను ఈ రోజు (మార్చ్ 1, శుక్రవారం) నుంచి రూ. 25 పెంచాయి. తాజా ధరల పెంపుతో ఢిల్లీలో.. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రిటైల్ ధర రూ.1,795కు చేరింది. ముంబైలో నేటి నుంచి 19 కిలోల సిలిండర్ ధర రూ.1,749గా ఉంది. చెన్నై, కోల్కతాలో కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర వరుసగా రూ.1,960, రూ.1,911కు పెరిగాయి.
వివిధ ప్రాంతాల్లో సిలిండర్ ధరలు..
వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను ప్రభుత్వ రంగ సంస్థలు పెంచడం వరుసగా ఇది రెండోసారి! ఫిబ్రవరి 1న 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.14 పెరిగింది. ఫిబ్రవరిలో 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర వరుసగా రూ .1,769.50 (ఢిల్లీ), రూ .1,887 (కోల్కతా), రూ .1,723 (ముంబై), రూ .1,937 (చెన్నై) గా ఉండేవి. కాగా.. ప్రతి నెల మొదటి రోజున సిలిండర్ల ధరలను కంపెనీలు సవరిస్తూ ఉంటాయి.
LPG gas price in Telangana : చమురు కంపెనీలు.. 2023 డిసెంబర్ 1న దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ రేట్లను రూ .21 పెంచాయి. అయితే 2024 నూతన సంవత్సరం సందర్భంగా 19 కిలోల వాణిజ్య వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.39.50 తగ్గింది. ఆ తర్వాత వరుసగా రెండు నెలలు పెరిగాయి.
వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర పెరగడం.. ఇళ్లల్లో వంటకు వాడే సిలిండర్ ధరలపై ప్రభావం చూపించదు.
19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర మార్చ్ 1, 2024..
- ఢిల్లీ- రూ.1,795
- ముంబై- రూ.1,749
- కోల్కతా- - రూ.1,911
- చెన్నై- రూ.1,960.50
- చండీగఢ్- రూ.1,816
- బెంగళూరు- రూ.1,875
- ఇండోర్- రూ.1,901
- అమృత్ సర్- రూ.1,895
- హైదరాబాద్- రూ. 2027
ఫిబ్రవరి 1, 2024న వాణిజ్య 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర
- ఢిల్లీ- రూ.1,769.50
- ముంబై- రూ.1,723
- కోల్ కతా- రూ.1,887
- చెన్నై- రూ.1,937
ఇళ్లల్లో వాడే 4.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలు స్థిరంగా ఉన్నాయి. 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.903, కోల్కతా రూ.929, ముంబైలో రూ.902.50, చెన్నైలో రూ.918.50గా ఉంది. హైదరాబాద్లో రూ. 955గా ఉంది.
ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్).. గత నెలలో సగటు అంతర్జాతీయ ధర ఆధారంగా ప్రతి నెలా ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తాయి.
సంబంధిత కథనం