జులై 1న ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) సిలిండర్ల కొత్త రేట్లు విడుదలయ్యాయి. ఈ రేట్ల ప్రకారం, 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర తగ్గింది. దేశ రాజధాని దిల్లీ సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ సిలిండర్ ధర సుమారు రూ. 60వరకు తగ్గింది.
కాగా గృహాల్లో వినియోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ సిలిండర్ ధరలు ఒకే విధంగా కొనసాగుతున్నాయి.
చమురు మార్కెటింగ్ సంస్థ డేటా ప్రకారం.. దిల్లీలో 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ఈ రోజు నుంచి రూ .1723.50 కు బదులుగా రూ .1665 కు లభిస్తుంది. అంటే రూ. 58.5 తగ్గింపు! కోల్‌కతాలో కమర్షియల్ సిలిండర్ నేటి నుంచి రూ.1769కే లభ్యం కానుంది. గతంలో రూ.1826కు అందుబాటులో ఉండగా, ఇప్పుడు రూ.57 తగ్గింది. ఇక ముంబైలో సిలిండర్ ధర రూ.1616కు చేరింది. జూన్‌లో ఇది రూ.1674.50గా ఉంది. ఇక్కడ సిలిండర్ ధర రూ.58.50 తగ్గింది.
ఇక చెన్నై విషయానికొస్తే ఇక్కడ కమర్షియల్ సిలిండర్ ధర రూ.1823.50కి చేరింది. జూన్ నెలలో రూ.1881కు అందుబాటులో ఉండేది.
హైదరాబాద్‌లో 19కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 57 తగ్గి రూ. 1886.50కి చేరింది.
ముడి చమురు ధరలకు సంబంధించి.. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్-సరఫరాను బట్టి వాణిజ్య సిలిండర్ల ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. ఉదాహరణకు, మే 2025 లో, దిల్లీలో 19 కిలోల సిలిండర్ రూ .1,747.50గా ఉంది. ఇది ఏప్రిల్ కంటే రూ .17 చౌకగా మారింది. జూన్‌లో రూ.1723.50కు తగ్గింది. జులైలో తగ్గింది.
ప్రతి నెల మొదటి రోజున చమురు మార్కెటింగ్ సంస్థలు ధరలను పెంచడం, తగ్గించడం లేదా యథావిథిగా వదిలేయడం చేస్తుంటాయి.
డొమెస్టిక్ సిలిండర్ ధరలు తగ్గకపోయినా, కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గడం కూడా సాధారణ ప్రజలకు ఉపశమనాన్ని ఇచ్చే విషయమే. వాణిజ్య సిలిండర్లను రెస్టారెంట్లు వంటి వాటిల్లో ఉపయోగిస్తారు. వీటి ధరలు తగ్గితే, ప్రాడక్ట్ రేట్లు కూడా తగ్గే అవకాశం ఉంది.
జూన్‌తో పోల్చితే జులై ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
దిల్లీ- 853.00
గురుగ్రామ్- 861.5
అహ్మదాబాద్- 860
జైపూర్ 856.5
పట్నా- 942.5
ఆగ్రా- 865.5
మీరట్- 860
ఘజియాబాద్- 850.5
ఇండోర్- 881
భోపాల్- 858.5
లుధియానా- 880
వారణాసి- 916.5
ముంబై- 890
హైదరాబాద్- రూ. 905
విజయవాడ- రూ. 877.50
బెంగళూరు- రూ. 855.5
చెన్నై- రూ. 868.50
సంబంధిత కథనం