LPG cylinders price hike: చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) సిలిండర్ల రేటును, ఒక్కో సిలిండర్ పై రూ .6 మేరకు పెంచాయి. ఈ పెంపు తరువాత, 19 కిలోల వాణిజ్య ఎల్పిజి సిలిండర్ ధర రూ. 1,797 నుండి రూ. 1,803 కు పెరిగింది.
ఫిబ్రవరిలో చమురు కంపెనీలు కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను రూ .7 తగ్గించిన తరువాత, ఇప్పుడు మళ్లీ ఒక్కో సిలిండర్ పై రూ. 6 పెంచాయి. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరల పెరుగుదల హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థలపై ప్రభావం చూపుతుంది. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు 2023 మార్చిలో రూ .352 పెరిగాయి. కాగా, గృహ అవసరాలకు ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ ధరలను ఈ మధ్య కాలంలో సవరించలేదు. ఇవి గత కొన్ని నెలలుగా స్థిరంగా ఉన్నాయి. ఈ సారి కూడా డొమెస్టిక్ సిలిండర్ల ధరలను పెంచలేదు. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు 2024 ఆగస్టు నుండి మారలేదు. కొత్త ధరలు 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లకు మాత్రమే వర్తిస్తాయి. వీటిని ప్రధానంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపారాల్లో వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తారు.
ఈ నాలుగు మెట్రో నగరాలకు పేర్కొన్న ధరతో పోలిస్తే మీ నగరంలో ఎల్పిజి ధర వేరుగా ఉండవచ్చు. మీ నగరంలో ఖచ్చితమైన ధర తెలుసుకోవడానికి స్థానిక గ్యాస్ ఆపరేటర్లను సంప్రదించడం మంచిది. ప్రధానంగా స్థానిక పన్నులు, రవాణా ఖర్చులలో వ్యత్యాసం కారణంగా ఎల్పీజీ ధరలు రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి.